తనదైన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న సినిమా 'గుర్తుందా శీతాకాలం'. తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్‌టైల్' సినిమాకి ఇది రీమేక్. తొలిసారి సత్యదేవ్, తమన్నా కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో మంచి బజ్ ఏర్పడింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతుంది. కానీ కరోనా కారణంగా రిలీజ్ ఆలస్యమైంది. ఇప్పుడు విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
వాలెంటైన్స్ వీక్ లో సినిమా వస్తుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తాజాగా సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. జూలై 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్, కొన్ని సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండంతో ప్రమోషన్స్ జోరు పెంచే ఛాన్స్ ఉంది. అయితే సత్యదేవ్ కానీ, హీరోయిన్ తమన్నా కానీ ఈ సినిమా పెద్దగా ప్రమోట్ చేసేలా కనిపించలేదు.
రీసెంట్ గా విడుదలైన 'ఎఫ్3' సినిమా ప్రమోషన్స్ ని కూడా లైట్ తీసుకుంది తమన్నా. ఇక సత్యదేవ్ అయితే ఈ మధ్యకాలంలో 'గుర్తుందా శీతాకాలం' సినిమా గురించి ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. తన నెక్స్ట్ సినిమా 'గాడ్సే' మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. మరి ఈ సినిమా సంగతి ఏమవుతుందో చూడాలి. నాగశేఖర్ మూవీస్ బ్యానర్‌పై నాగశేఖర్, భావన రవి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సత్య హెగ్డే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.
Also Read: 'నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ - నా జీవో గాడ్స్ ఆర్డర్' బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలే!
Also Read: నయన్-విఘ్నేష్ ల మంచి మనసు, వేలాది పేద పిల్లలకు విందు భోజనం