Happy Holi Wishes, Messages and Greetings 2024:   ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని ఒక్కో ప్రాంతంలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. మొదటియుగం అయిన సత్యయుగం నుంచీ జరుగుతున్న ఈ పండుగ గురించి పురాణాల్లో ఎన్నో కథలున్నాయి. శ్రీహరి పరమ భక్తులడైన భక్త ప్రహ్లాదుడిని సంహరించేందుకు తండ్రి హిరణ్యకశ్యపుడు తన చెల్లెలైన హోలిక అనే రాక్షసిని పురమాయిస్తాడు. ప్రహ్లాదుడిని తీసుకుని మంటల్లో దిగిన హోలిక మాడి మసైపోతుంది కానీ శ్రీహరి కరుణతో ప్రహ్లాదుడిక ఏమీ జరగదు. చెడు మాడిమసైందనేందుకు సంకేతంగా హోలికా దహనం నిర్వహిస్తారు. విజయ దశమికి రావణాసురుడి ప్రతిమను దహనం చేసినట్టే...హోలీకి హోలిక దహనం నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే ఈ పండుగ...ముఖ్యంగా..శ్రీ కృష్ణుడు పుట్టి పెరిగిన ప్రాంతాలైన మథుర, బృందావనంలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకుంటారు. చిన్నా పెద్దా ఉత్సాహంగా పాల్గొనే ఈ రంగుల పండున ఆనందాన్ని కొటేషన్స్ ద్వారా మీ బంధుమిత్రులతో ఇలా పంచుకోండి...


వసంత కాలంలో వచ్చింది రంగుల హోలీ..
తెచ్చింది సంతోష కేళీ
అందరికీ హోలీ శుభాకాంక్షలు


ఈ హోలీ మీ జీవితంలో రంగులు నింపాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు


Also Read: హోలీ రోజు నుంచి ఈ 4 రాశుల వారి జీవితంలో ఇంద్రధనస్సు వెల్లి విరుస్తుంది!


రంగుల పువ్వులు వికసించే ఈ వసంతం
మీ జీవితంలో నింపాలి అంతులేని సంతోషం
హోలీ శుభాకాంక్షలు


సుఖం, దుఃఖం, సంతోషం, ఆనందాలకు చిరునామా హోలీ
 హోలీ శుభాకాంక్షలు.


చెడుపై మంచి సాధించిన విజయానికి సూచనే హోలీ
 మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు


సుఖం, దుఃఖం, సంతోషాలకు ప్రతీకే రంగుల పండగ 
 హోలీ శుభాకాంక్షలు


ప్రకృతికి రంగులు అందం
అంతా కలసి మెలసి ఉంటే దేశంలో ఆనందం
అందరికి హోలీ శుభాకాంక్షలు


Also Read: హోలీ రోజు ఎవరు ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలో తెలుసా!


రంగుల పండుగ వచ్చే..
హరివిల్లు నేలను దించే..
అందరిలో ఆనందాన్ని తెచ్చే..
 హోలీ శుభాకాంక్షలు


హోళీ  రోజున ఒకరిపై ఒకరు చల్లుకునేది రంగులు కావు
అనురాగ, ఆప్యాయతలు 
 హోలీ శుభాకాంక్షలు


హరివిల్లులో రంగులు మీ ఇంట ఆనందాలుగా వెల్లివిరియాలి
  హ్యాపీ హోలీ


హోలీ నింపాలి మీ జీవితాల్లో ఆనంద రంగేలి
 హోలీ శుభాకాంక్షలు


హరివిల్లిలాంటి హోలీ రంగులు..
ప్రతి ఒక్కరి జీవితాల్లో నింపును సంతోషాలు
హోలి శుభాకాంక్షలు


Also Read: శవాల బూడిదతో హోలీ సంబరాలు - ఇక్కడ వారం ముందు నుంచే సందడి మొదలు!


హరివిల్లులో రంగులు నేలకు దించేద్దాం
అంతా కలసి ఆనందంగా ఆడేద్దాం
రసాయనాల రంగులొద్దు..ప్రకృతి రంగులే ముద్దు
మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షాలు


ఇవి రంగులు కావు..ప్రేమానురాగాలు..
ఈ హోలీ ఎప్పటికీ గుర్తిండిపోవాలి 
హోలీ శుభాకాంక్షలు


Also Read: హోళీ రోజు రంగులెందుకు చల్లుకుంటారు, కొత్తగా పెళ్లైనవారికి ఈ విషయం తెలుసా!


మీ జీవితపు కాన్వాస్‌ను భగవంతుడు అందమైన రంగులతో చిత్రీకరించాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు


చెడు, నిరాశ, నిరుత్సాహాన్ని హోలికా దహనంలో వేసేసి
మీ జీవితంలో సంతోషాన్ని రంగులతో ఆహ్వానం పలకండి
హోలీ శుభాకాంక్షలు
 


ఏబీపీ దేశం తరపున మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు