Happy Navratri Day 6:  "కాత్యాయనీ మాత" నాలుగు భుజాలతో విరాజిల్లే  కాత్యాయని కుడిచేతిలో అభయ ముద్ర, వరముద్రను కలిగిఉంటుంది. ఎడమచేతిలో ఖడ్గం, పద్మం పట్టుకుని  సింహవాహనంపై కొలువై సేవలందుకుంటుంది. ఈ దేవిని భక్తితో సేవించినవారికి  చతుర్విధ పురుషార్ధాల ఫలం లభిస్తుందని చెబుతారు


‘చంద్ర హాజ్జ్వల కరా శార్దూల వరవాహనా
కాత్యాయనీ శుభం దద్యాత్‌ దేవీ దానవ ఘాతినీ’


నవరాత్రుల్లో ఆరో రోజు అనుగ్రహించే రూపం కాత్యాయని
నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మ అనుగ్రహించే రూపం కాత్యాయని. చతుర్భుజాలతో, వరద, అభయ హస్తాలతో, ఖడ్గం, పద్మం ధరించి సింహ వాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతూ దివ్యతేజస్సుతో అలరారుతుంది. కాత్యాయని అంటే తేజ స్వరూపిణి, మహాతేజో పుంజం అని అర్థం. తేజస్సు అంటే జ్ఞానం, కాత్యాయని మన బుద్ధిని ప్రేరేపిస్తుంది. భక్తులను భవజలధి, చింతా జలధి, సంసార జలధి అనే భవ సాగరాల నుంచి ఉద్ధరింపజేస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలకు అధికారిణి ఈమె. మహిషాసుర సంహారంలో కాత్యాయని సింహ వాహనం అధిష్ఠించి దుర్గాదేవికి సాయం చేసిందని స్కాంద పురాణం చెబుతోంది.


Also Read: బ‌తుక‌మ్మ పండుగ‌లో ఏడో రోజు - వేప‌కాయ‌ల‌ బ‌తుక‌మ్మ‌కు ఏం నివేదిస్తారంటే!


ఆజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవత
యోగశాస్త్రం ప్రకారం కాత్యాయనిని ఆజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవతగా చెబుతారు. ఆజ్ఞా చక్రాన్ని జాగృతపరచి సాధకుడికి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది అమ్మ. ఆ మూలపుటమ్మను ధ్యానిస్తే అన్నీ శుభాలే కలుగుతాయి. విద్యార్థులు ఆ తల్లిని ఆరాధించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. కన్యలు కాత్యాయనీ దేవిని కొలిస్తే వివాహానికి ఎదురైన ఆటంకాలు తొలగిపోయి మంచి భర్త లభిస్తాడని చెబుతారు.


కాత్యాయని అష్టకం 


శ్రీగణేశాయ నమః ।
అవర్షిసఞ్జ్ఞం పురమస్తి లోకే కాత్యాయనీ తత్ర విరాజతే యా ।
ప్రసాదదా యా ప్రతిభా తదీయా సా ఛత్రపుర్యాం జయతీహ గేయా ॥ 1॥


త్వమస్య భిన్నైవ విభాసి తస్యాస్తేజస్వినీ దీపజదీపకల్పా ।
కాత్యాయనీ స్వాశ్రితదుఃఖహర్త్రీ పవిత్రగాత్రీ మతిమానదాత్రీ ॥ 2॥


బ్రహ్మోరువేతాలకసింహదాఢోసుభైరవైరగ్నిగణాభిధేన ।
సంసేవ్యమానా గణపత్యభిఖ్యా యుజా చ దేవి స్వగణైరిహాసి ॥ 3॥


గోత్రేషు జాతైర్జమదగ్నిభారద్వాజాఽత్రిసత్కాశ్యపకౌశికానామ్ ।
కౌణ్డిన్యవత్సాన్వయజైశ్చ విప్రైర్నిజైర్నిషేవ్యే వరదే నమస్తే ॥ 4॥


భజామి గోక్షీరకృతాభిషేకే రక్‍తామ్బరే రక్‍తసుచన్దనాక్‍తే ।
త్వాం బిల్వపత్రీశుభదామశోభే భక్ష్యప్రియే హృత్ప్రియదీపమాలే ॥ 5॥


ఖడ్గం చ శఙ్ఖం మహిషాసురీయం పుచ్ఛం త్రిశూలం మహిషాసురాస్యే ।
ప్రవేశితం దేవి కరైర్దధానే రక్షానిశం మాం మహిషాసురఘ్నే ॥ 6॥


స్వాగ్రస్థబాణేశ్వరనామలిఙ్గం సురత్‍నకం రుక్మమయం కిరీట్మ ।
శీర్షే దధానే జయ హే శరణ్యే విద్యుత్ప్రభే మాం జయినం కురూష్వ ॥ 7॥


నేత్రావతీదక్షిణపార్శ్వసంస్థే విద్యాధరైర్నాగగణైశ్చ సేవ్యే ।
దయాఘనే ప్రాపయ శం సదాస్మాన్మాతర్యశోదే శుభదే శుభాక్షి ॥ 8॥


ఇదం కాత్యాయనీదేవ్యాః ప్రసాదాష్టకమిష్టదమ్ ।
కుమఠాచార్యజం భక్‍త్యా పఠేద్యః స సుఖీ భవేత్ ॥ 9॥


॥ ఇతి శ్రీకాత్యాయన్యష్టకం సమ్పూర్ణమ్ ॥


దశవిధాలైన పాపాలను హరించేది కనుకే ‘దశహరా’ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉహోత్సవాల్లో పరమార్థం. ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మొదలై ఆశ్వయుజ శుద్ధ దశమి వరకూ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 15 నుంచి అక్టోబరు 24 వరకూ జరగనున్నాయి. 


Also Read:  దసరాల్లో బాలలకు పూజ ఎందుకు చేస్తారు - దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!


Also Read: రాజపుత్రుల జన్మస్థానంలో ఏం చేసినా రాజసమే-దసరా ఉత్సవాల నిర్వహణలో కూడా!