నుమంతుడు సంకట మోచనుడు. భక్తికి, అంకిత భావానికి ప్రతీక ఆంజనేయడు. తన భక్తులను కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని నమ్మకం. పవన పుత్ర హనుమాన్ ను పూజించేందుకు సింధూరాన్ని వాడతారు. జ్యోతిషంలో హనుమతుండికి చేసే సింధూర పూజకు చాలా ప్రాశస్థ్యం ఉంది. కేసరి రంగులో ఉండే సింధూరం సమర్పించడం ద్వారా సకల కోరికలు నెరవేరుతాయని శాస్త్రం చెబుతోంది. సింధూరంతో హనుమంతుని ఆరాధించిన వారికి తప్పక ఫ్రతిఫలం దక్కుతుందని నమ్మకం. సిందూరంతో చేసిన హనుమాన్ పూజ ఆయనను ప్రసన్నుడను చేస్తుంది. ఇలా సింధూరానికి హనుమంతుడికి విడదీయలేని సంబంధం ఉంది.


సింధూర ధారణతో హనుమంతుడు కరుణిస్తాడు. కోరిన కోరికలు తీరుస్తాడు. ముఖ్యంగా మంగళ వారం నాడు ఆంజనేయుడికి సింధూర పూజ చేస్తే ఇంట్లో కి సౌభాగ్యం వఃస్తుంది. సుఖ శాంతులు వెల్లివిరుస్తాయి. రామభక్త హనుమంతుడికి సింధూరం సమర్పించడం వెనుక ఒక పౌరాణిక కథ ప్రాచూర్యంలో ఉంది.


హనుమంతుడికి సింధూరం అంత ప్రియం ఎందుకు?


హనుమంతుడు సీతను వెతుకుతూ లంకకు వెళ్లిన సందర్భంలో అశోక వనంలో సీతను కనిపెట్టిన తర్వాత దూరం నుంచే సీతాదేవిని చాలా సమయం పాటు గమనిస్తూ ఉంటాడు. ఆమె ప్రతిరోజూ, అనునిత్యం తన పాపిటలో సింధూరం ధరించడాన్ని గమనిస్తాడు. రావణుడు రావడం సీతను బెదిరించడం వంటి అన్ని ఘట్టాల తర్వాత తనను తాను రామబంటుగా సీతకు పరిచయం చేసుకుంటాడు హనుమంతుడు. ఆ సందర్భంలో సీతాదేవిని సింధూరం గురించి అడుగుతాడు. అప్పుడు ఆమె శ్రీరామచంద్రుడి దీర్ఘాయువు కోసం తాను ఈ సింధూరాన్ని తన నుదుటన ధరిస్తానని, అంతే కాదు ఇది ఆయనకు చాలా ఇష్టమని, దీన్ని ధరించిన తన ముఖాన్ని చూసిన శ్రీరాముడి ముఖంలో ప్రసన్నతను తాను గమనించగలుగుతానని అందుకే.. ఆయనకు నచ్చే విధంగా ఉండేందుకు గాను తాను సింధూరాన్ని ప్రతి నిత్యం ధరిస్తానని సమాధానం చెప్పిందట. కాస్త సింధూరం రాముడికి దీర్ఘాయువును ఇస్తే తాను తనువంతా సింధూరం ధరిస్తే రాముడికి మృత్యువే ఉండదు. చిటికెడు సింధూరం నుదుటన ధరించిన సీతనే అంత శ్రీరాముడు అంత ప్రేమిస్తే, తనను ఇంకెంత ప్రేమిస్తాడో కదా అని అప్పటి నుంచి హనుమంతుడు ఒళ్లంతా సింధూరం ధరిస్తాడని ఒక కథ ప్రాచూర్యంలో ఉంది.


హనుమంతుడికి సింధూర సేవను ఆలయాల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఆయనకు ఎంతో ఇష్టమైన సింధూరం సమర్పణలో పాలుపంచుకున్న వారి సకల అభీష్టాలు నెరవేరుతాయట. కాబట్టి, మీరు కూడా ఈసారి అలా సింధూర సేవతో హనుమంతుడి ఆశీర్వాదాలు పొందేందుకు ప్రయత్నించండి.


Also read: గరుఢ పురాణం: ఈ పనులు చేసేవారు, వచ్చే జన్మలో ఇలా పుడతారట!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


Also read: మామిడి పండు తింటున్నట్లు కల వచ్చిందా? జరిగేది ఇదే!