నిద్రలో కలలు కనడం అనేది అత్యంత సహజమైన స్థితి. అయితే కొన్ని కలలు తీపి జ్ఞాపకాలైతే మరికొన్ని పీడ కలలుగా ఉంటాయి. అప్పుడప్పుడు విచిత్రమైన కలలు వచ్చి ఫన్నీగా కూడా అనిపిస్తుంటుంది. కొన్ని రకాల కలలు మార్మికంగా ఉండి ఏదో సందేశాన్ని ఇస్తున్న భావన కలుగుతుంది. అలా కొన్ని రకాల కలలు ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. అలాంటి కలల గురించి ఇవ్వాళ చెప్పుకుందాం. కలలో మామిడి పండు కనిపిస్తే? అలాంటి కల వెనుక ఏదైనా సందేశం ఉందా? అలాంటి వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మామిడి పండు తింటున్నట్లు
మామిడి.. ఫల రాజ్యపు రారాజు. మామిడి పండు తినడం ఇష్టం లేని వారు చాలా తక్కువ మంది. దాదాపు అందరికీ మామిడి ఇష్టమైన పండు. వేసవంటే మామిడి పండ్లు దొరికే కాలమని చాలా మంది వేసవిని ఇష్టపడతారు. మామిడి పండు తింటున్నట్టు కలలో కనిపిస్తే మీకు త్వరలో చాలా డబ్బు రాబోతోందని అర్థం. అయాచితంగా మీకు సంపద లభిస్తుందని అర్థం.
పచ్చి మామిడి తింటుంటే
ఒక చెట్టు నుంచి పండును పండించాలంటే చాలా కష్టపడాలి. డబ్బు సంపాదించేందుకు కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. చేసిన శ్రమకి తగిన ఫలితం లభించాలి. కలలో పచ్చిమామిడి తింటున్నట్టు కల వస్తే మీ కష్టానికి తగిన ఫలితం త్వరలో అందబోతోందని అర్థం. మీరు ఆశించినది త్వరలో మీకు అందుతుందని ఈ కల సంకేతం.
మామిడి పండు రాలుతున్నట్లు
చెట్టు నుంచి పండ్లు రాలుతూనే ఉంటాయి. మామిడి పిందెలు, పండ్లు తరచుగా రాలుతుంటాయి. మామిడి చెట్టు నుంచి పండు రాలుతున్నట్టు కలలో కనిపిస్తే మాత్రం మీరు ఎదురు చూస్తున్న పరీక్షా ఫలితాలు చాలా అనుకూలంగా వస్తాయని అర్థం. మీరు రాసిన పరీక్షల్లో విజయం సాధిస్తారు. లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నం సఫలం అవుతుంది.
మామిడి కాయ కోస్తున్నట్టు
సాధారణంగా మామిడి పండు కోసుకుని తింటారు. అలా మామిడి పండ్లను కోస్తున్నట్టు కల వచ్చే కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయని అర్థం. ఒక లక్ష్యం కోసం ప్రయత్నిస్తుంటే తప్పకుండా ఆ లక్ష్యాన్ని చేధిస్తారు.
మామడి కలలో కనిపిస్తే అది చాలా మంచి శకునంగా భావిస్తారు. ఏ రకంగా మామిడి కలలో కనిపించినా సరే అది మంచికే అని స్వప్నశాస్త్రం చెబుతోంది. మామిడి ఇలలో మాత్రమే కాదు కలలో అయినా తీపి పంచే పండే అన్న మాట.
Also read: వీటిని ఇంట్లో అలంకరించుకుంటే దుష్టశక్తులు దరి చేరవు