భగవధ్గీతలో మొత్తం 700 శ్లోకాలున్నాయి. ఉరకల పరుగుల జీవనంలో మొత్తం చదివే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. అందుకే చదివిన వారికి ఎంతవరకూ అర్థమైంది, చదవని వారు తెలుసుకోవాల్సిన విషయాలను కొన్ని ప్రశ్నలు సమాధానాల రూపంలో ఇస్తున్నాం. 

భగవద్గీతలో ఒకటి నుంచి 40 వరకూ ప్రశ్నలకు సమాధానాలివే...

41. అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పాడు? అనంతుడు42. మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?సుఘోషం43. ఛందస్సులలో తను ఏ ఛందస్సు అని శ్రీకృష్ణుడు చెప్పాడు.?గాయత్రీ ఛందస్సు44. జీవునకు ఈ శరీరంలో  ఎన్ని అవస్థలు కలుగుతాయని శ్రీకృష్ణుడు చెప్పాడు?నాలుగు (బాల్యం, యౌవ్వనం, వార్థక్యం, దేహాంతర ప్రాప్తి)45. నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు? గంగానది.46. ఆత్మ ఎలాంటింది?నాశరహితమైనది47. కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమంటారు?నిష్కామ కర్మ48. మనుజునకు దేనియందు అధికారము  ఉంది?కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)49. అర్జునుడు ఎవరి లక్షణాలు-భాష, నివాసం, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?స్థితప్రజ్ఞుడు 50. వృక్షాల్లో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను? రావిచెట్టు.51. పంచభూతములచే నాశనము పొందనిది ఏది?ఆత్మ

Also Read: ఈ రోజు గీతా జయంతి - భగవద్గీత మత గ్రంధం కాదు మనిషిగా ఎలా బతకాలో చెప్పే మార్గదర్శి

52. మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?మణిపుష్పకం53. ప్రపంచంలో పూర్ణానందం ఎక్కడ లభిస్తుంది?ఆత్మయందు54. మహాభారత సంగ్రామంలో అర్జునుని రధం  జెండాపై గల వానరుడెవరు?హనుమంతుడు55. పక్షుల్లో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు? గరుత్మంతుడు56. ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?తాబేలు.57. కర్మచేయుటం మేలా..యకుండా ఉండడం మేలా..చేయుటయే మేలు.58. బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించినప్పుడు వారితో సహా ఏం సృష్టించాడు?యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)59. వివేకవంతుడు కర్మలు ఎందుకు చేయాలి?లోక క్షేమం కోసం60. ఆవుల్లో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పాడు? కామధేనువు61. స్వధర్మ, పరధర్మాల్లో ఏది శ్రేష్ఠమైనది?స్వధర్మం62. పొగచేత అగ్ని, మురికిచేత అద్దం, మావిచేత గర్భమందలి శిశువు కప్పి ఉన్నట్లు ఆత్మజ్ఞానం దేనిచే కప్పి ఉంటుంది?కామము చేత 63. ఏ ప్రేరణతో జీవుడు తాను వద్దనుకున్నా పాపం చేస్తాడు?కామము ప్రేరణతో64. భగవంతుడెపుడు అవతరిస్తాడు?ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందినపుడు65. అసురుల్లో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు? ప్రహ్లాదుడు66. గంధర్వుల్లో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?చిత్రరథుడు67. హృదయ శుద్ధి ద్వారా మోక్షం దేనివలన కలుగుతుంది?జ్ఞానతపస్సు68. జ్ఞానప్రాప్తి వలన కలిగే  ఫలితమేంటి?పరమశాంతి69. ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి  మనస్సు దేనితో పోల్చవచ్చు?గాలిలేనిచోట గల దీపంతో70. ఏ సాధనములతో మనస్సు నిగ్రహింగా ఉంటుంది?అభ్యాసం, వైరాగ్యం71. భయంకరమైన మాయను దాటడం ఎలా ?భగవంతుని శరణుపొందుట వలన72. భగవంతుని సేవించువారిని  శ్రీకృష్ణుడు  ఎన్నిరకాలుగా వర్గీకరించాడు?నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని)73. భగవత్స్వరూపమును ఎవరు తెలులుకోలేరు?అజ్ఞానులు74. విద్యల్లో శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?బ్రహ్మవిద్య75. మహర్షుల్లో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు? భృగు మహర్షి76. బ్రహ్మవిద్యకు అర్హతేంటి?హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము77. ఆకాశంలో వాయువులా, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి ఉన్నది?పరమాత్మలో78. గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెలా అవుతాడు?పరమాత్మపై  అనన్యభక్తితో79. ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?భగవంతుని భక్తుడు80. సమస్త ప్రాణికోటి  హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?సాక్షాత్తు పరమాత్మయే81. ఇంద్రియాల్లో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?మనస్సు82. పర్వతాల్లో తాను ఏ పర్వతం అన్నాడు?మేరువు83. పురోహితుల్లో తాను ఎవరినన్నాడు?బృహస్పతి84. వాక్కులలో ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?ఓం కారం85. యజ్ఞాల్లో ఎవరిని అన్నాడు?జప యజ్ఞము86. ఏనుగుల్లో  తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు? ఐరావతము87. గుర్రాల్లో ఎవరన్నాడు?ఉచ్ఛైశ్శ్రవసము88. ఆహారం ఎన్ని రకాలని చెప్పాడు?మూడు (సాత్విక, రాజస, తామసాహారము)89. దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?నారదుడు90. సిద్ధుల్లో  ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పాడు?కపిల మునీంద్రుడు91. భగవద్గీత చివరి అధ్యాయం పేరేంటి? మోక్షసన్యాస యోగం92. లెక్కపెట్టేవారిలో తాను ఎవరని చెప్పాడు?కాలము93. జలచరాల్లో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?మొసలి94. ఆత్మను దేహంలో ఉంచాడానికి కారణమైన మూడు గుణాలేంటి?సత్త్వ, రజ, తమో గుణములు.95. వేగంగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?వాయువు.96. భక్తియోగమైన పన్నెండో అధ్యాయంలో భక్తుని లక్షణాలు ఎన్నని చెప్పాడు?3597. విద్యల్లో ఏ విద్యనన్నాడు ?ఆధ్యాత్మిక విద్య98. రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయం కోసం వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?వాదము.99. అక్షరాల్లో ఏ అక్షరమన్నాడు?“అ”-కారము100. భగవంతుని విశ్వరూప సందర్శనం ఎవరు మాత్రమే చూశారు?అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)101. మాసాల్లో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పాడు?మార్గశిరం102. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయంలో జ్ఞానగుణాలు మొత్తం ఎన్ని చెప్పాడు?20 (ఇరువై)103. శ్రీకృష్ణ భగవానునుడు దైవగుణాలు ఎన్నని చెప్పాడు?26 (ఇరువైఆరు)104. అసుర గుణములు ఎన్ని?6 (ఆరు)105. తపస్సులెన్ని రకాలు?మూడు (శారీరక, వాచిక, మానసిక)106. పరబ్రహ్మకు ఎన్నిపేర్లు?మూడు (ఓమ్, తత్, సత్).107. మోక్షాన్ని పొందటానికి కర్మలను వదలాలా?లేదు. కర్మలు చేసేటప్పుడు భగవంతుడిపై మనస్సు లగ్నమై ఉండాలి108. సంజయుడు ఎవరి అనుగ్రహంతో  గీతాసంవాదాన్ని లైవ్ లో విన్నాడు?వేదవ్యాసుడు

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి