గాయత్రి మంత్రం
ఓం భూర్భువః సువః తత్ సవితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్"
ఇందులోని ప్రతి బీజాక్షరం మహిమాన్వితమైంది. ఈ మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లేనని రుగ్వేదంలో పేర్కొన్నారు. ఈ మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్దతిలో జపించినా, విన్నా తద్వారా వెలువడే ధ్వని తరంగాలు మనసుని,శరీరాన్ని ఉల్లాసపరిచి, తేజోవంతం చేస్తాయి. దీన్ని ప్రయోగాత్మకంగా నిరూపించేందుకు చాలామంది ప్రయత్నించి నిజమే అని అంగీకరించారు కూడా.
- ఈ మంత్రం జపించడం వల్ల మెదడులో ఒక రకమైన ఆనందం, అనుకూల ఆలోచనలు, ఆత్మవిశ్వాసం స్థాయి కూడా పెరుగుతాయని తేల్చారు
- గాయత్రి మంత్రాన్ని జపించే వారి మెదడులో నిరంతరం ప్రకంపనలను కొనసాగుతున్న అనుభవం పొందుతారు
- నిత్యం ఈ మంత్రం స్మరిస్తే ఏ పని తలపెట్టినా విజయం సొంతం చేసుకుంటారని పురాణాల్లో పేర్కొన్నారు
- గాయత్రి మంత్రాన్ని లయబద్ధంగా జపించే వారి తల చుట్టూ దాదాపు లక్ష శక్తి తరంగాలు ఉద్భవిస్తాయి
- గాయత్రి మంత్రోపాసన ఒక వ్యక్తిని తెలివైనవాడిగా, ధైర్యవంతుడిగా చేసి శక్తి సామర్థ్యాలు నింపుతుంది
- నాలుక ఉచ్ఛారణ ద్వార కంఠం, అంగుటి, కొండనాలుక, పెదవులు, దంతాలు ఇలా నోటిలో విభిన్న అంగాలను ప్రభావితం చేస్తి.. అక్కడి నుంచి నవనాడుల ద్వారా శరీరం మొత్తం వ్యాపిస్తుంది. అలా శరీరంలో ఉన్న ఏడు చక్రాలపైనా ఈ ప్రభావం పడి ఆ చక్రాలు ఉత్తేజితమవుతాయి.
Also Read: అఖండ సినిమాలో బాలయ్య చెప్పిన చక్రాలు విన్నారు కదా-అవేంటో తెలుసా
గాయత్రీ మంత్రం జపిస్తే శరీరంలో జాగృతం అయ్యే గ్రంధులివే
ఓం- శిరస్సు పైన సుమారు ఆరు అంగుళములు
భూ:- కుడి కన్ను పైన 4 అంగుళములు.
భువః -మూడవ నేత్రము పైన 3 అంగుళములు
స్వ: - ఎడమ కన్ను పైన 4 అంగుళములు
అక్షరం - గ్రంధి పేరు - శక్తి -శరీరంలోని కేంద్రం
1. తత్ - తాపీని - సఫలత - ఆజ్ఞాచక్రము
2. స - సఫలత - పరాక్రమము - ఎడమకన్ను
3. వి - విశ్వ - పాలన - కుడికన్ను
4. తు: - తుష్టి - మంగళకరము - ఎడమ చెవి
5 వ - వరద - యోగము - కుడిచెవి
6. రే - రేవతి - ప్రేమ - నాసికా
7. ణి - సూక్ష్మ - ఘనము - పై పెదవి
8. యం - జ్ఞాన - తేజము - క్రింది పెదవి
9. భర్ - భర్త - రక్షణ - కంఠము
10 గో - గోమతి - బుద్ధి కంఠ కూపము
11. దే - దేవిక - దఘనము - ఎడమ ఛాతి
12. వ - వరాహి - నిష్ఠ - కుడిఛాతీ
13. స్య - సింహని - ధారణ - ఉదరము పైన చివరి
14. ధీ - ధ్యాన - ప్రాణ - కాలేయము
15. మ - మర్యా ద - సంయమము - ప్లీహ్యము
16. హి - మూలము - స్పుట - తపము - నాభి
17. ది - మేధ - రూరదర్శిత - వెన్నుపూస చివరి భాగము
18. యో - యోగమాయ - జాగృతి - ఎడమ భుజము
19. యో - యోగిని - ఉత్పాదన - కుడి భుజము
20. నః - ధారిణీ - సరసత - కుడి మోచేయి
21. ప్ర - పభవ - ఆదర్శము - ఎడమ మోచేయి ఆగ్ర భాగం
22. చో - ఉష్మ - సాహసము - కుడి మణికట్టు
23. ద - దృశ్య - వివేకము - కుడి అర చేయి అగ్రభాగం
24. యాత్ - నిరంజన - సేవ - ఎడమ అరచేయి
గాయత్రీ మంత్రం జపిస్తే శరీరంలో ఉన్న ఈ 24 గ్రంథుల్లో స్పందన ఉంటుంది.ఈ 24 అక్షరాలతో పాటు 24 దేవతమూర్తుల శక్తి అంతర్హితమై ఉంటుందని చెబుతారు. ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ ఇరవైనాలుగు దేవతల ఆశీస్సులు, శక్తి చేకూరుతాయని మన పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.
Also Read: శరీరంలో ఏడు చక్రాలకి - తిరుమల ఏడుకొండలకి ఏంటి సంబంధం