Garuda Purana: శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి తీర్చిన సందేహాలే గరుడపురాణం. జీవుడి పుట్టుక నుంచి మరణం...మరణానంతరం ఆత్మ ప్రయాణం...స్వర్గం, నరకం వరకూ ప్రతి విషయం గురించి శ్రీ మహావిష్ణువు గరుడుడికి వివరించాడు. గరుడపురాణంలో ఓ అధ్యాయంలో పూర్తిగా నరకం, వైతరణి నది గురించి గరుత్మంతుడికి వివరించాడు శ్రీ మహావిష్ణువు. నరకం అంటే ఏంటి? నరకం ఎవరికి ప్రాప్తిస్తుంది? దాన్నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అనే విషయాలను స్పష్టంగా వివరించాడు. పాపాత్ములు మాత్రమే యమపురి దక్షిణ ద్వారం నుంచి నరకంలో అడుగుపెడతారు. ఈ మార్గంలోనే వైతరణి నది ఉంటుంది.


Also Read: అమ్మ కడుపులో ఉన్నప్పుడే నరకం మొదలైపోతుందా, గరుడ పురాణం ఏం చెబుతోంది


ఈ పాపాలు చేస్తే దక్షిణద్వారమే
మనిషిగా పుట్టి చేయకూడని పాపాలు చేసినవారు నరకంలోకి వెళ్లకతప్పదు. గరుడపురాణం ప్రకారం ఆ పాపాలు ఏంటంటే.. 


బ్రహ్మహత్య, శిశుహత్య, గోహత్య, స్త్రీహత్య, గర్భపాతం చేసేవారూ, రహస్యంగా పాపపు పని చేసేవారూ, గురువులు పండితులను దూషించేవారు, శిశువులను చంపేవారు, తీసుకున్న అప్పు తీర్చకపోయినా వేరొకరి ద్రవ్యాన్ని అపహరించినా, విషం పెట్టి చంపేవారు నరకానికి వెళ్లాల్సిందే..


తప్పులు చేసేవారు..తప్పులు చేసేవారిని సమర్థించేవారు, మంచివారిని నిందించేవారు, దుర్మార్గులతో స్నేహం చేసేవారు..మంచివారిని నిందించేవారు, పుణ్యక్షేత్రంలో అస్సలు అడుగుపెట్టనివారు, వేదాలను నిందించేవారు, ఇతరుల సంతోషాన్ని చూసి ఏడ్చేవారు వైతరణి దాటి దక్షిణద్వారం ద్వారా నరకంలోకి అడుగుపెడతారు


చెడు మాటలు మాట్లాడేవారు, పెద్దలు మంచి చెప్పినా పట్టించుకోని వారు, తమని తాము పొగుడుకుని ఇతరులని తిట్టేవారు, అధర్మాన్ని మాత్రమే ఆచరించేవారు, పతివ్రత అయిన భార్యను దూషించేవాడు, మాట తప్పేవాడు, దానం ఇచ్చిన తర్వాత బాధపడేవాడికి నరకం తప్పదు...


Also Read: గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చా-ఉండకూడదా!


మంచి కార్యాలను అడ్డుకునేవారు,ఇతరుల భూములను ఆస్తులను స్వాధీనం చేసుకుేనవారు, పశువులకు మేతలేకుండా చేసిన వారు, గోవులను హింసించేవారు, అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, అన్యాయంగా సంపాదించేవారు, దొంగతనం చేసేవారు, పూలు పండ్ల తోటల్ని ధ్వంసం చేసేవారు  నరకానికే వెళతారు...


ఈ పాపాలు చేసేవారందర్నీ...యమధర్మరాజు ఆజ్ఞ మేరకు యమభటులు వైతరణి నదిలోకి తోసేస్తారు. పాపాత్ములు ముందుగా వైతరణిలో పడి బాధలు అనుభవించిన తర్వాత వారి వారి పాపాలకు విడిగా శిక్షలుంటాయి. 


Also Read: పక్కవాళ్లకు స్వీట్ ఇవ్వకుండా తింటే కూడా పాపమే? గరుడ పురాణంలో ఘోరమైన శిక్ష?


వాస్తవానికి గరుడ పురాణం అంటే మరణం, స్వర్గం, నరకం గురించి మాత్రమే కాదు..గర్భంలో శిశువు పడినప్పటి నుంచి పుట్టుక... ఆ తర్వాత ఆచరించాల్సిన కర్మలు...మరణం..మరణానంతరం ఆత్మ ప్రయాణం..శిక్షలు...పాప ఫలితంగా మరో జన్మ..ఇలా మొత్తం జీవన ప్రయాణం  గరుడపురాణంలో ఉంటుంది. పుణ్యకార్యాలు చేసేవారికి మరో జన్మ ఉండదు...పాపాత్ములకు మరో జన్మ తప్పదు. పురుషుని రేతస్సుని ఆధారంగా చేసుకుని కర్మను అనుసరించి అందుకు అనుగుణమైన స్త్రీ గర్భంలో ప్రవేశిస్తారు. ఫలితం అనుభవించడం గర్భంలో ఉన్నప్పుడే మొదలైపోతుంది...అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా గరుడపురాణం చదివితే కొన్ని పాపాలను అయినా చేయకుండా ఉంటారు... కొన్నైనా పుణ్యకార్యాలు చేస్తారని చెబుతారు...