Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : దీప, కార్తీక్ తండ్రి చేసిన నిర్వాకం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సుమిత్ర దీప దగ్గరకు వస్తుంది. నర్శింహ గురించి ఆలోచిస్తున్నావా అని దీప అడిగితే అలాంటి వాళ్లు చాలా మందే ఉన్నారని దీప శ్రీధర్‌ని ఉద్దేశించి చెప్తుంది. దీంతో సుమిత్ర చాలా మంది అంటే అని అడుగుతుంది.


దీప: మా అత్తయ్య ఇంటికి వచ్చింది కాబట్టి మీకు నర్శింహ రెండో పెళ్లి గురించి తెలిసింది. లేదంటే మీకు తెలిసేది కాదు కదా. నేను ఈ ఊరు వచ్చాను కాబట్టి నాకు నా భర్త గురించి తెలిసింది. లేదంటే నాకు తెలీదు. నా కంట్లో పడింది మరొకరి కంట్లో పడకుండా ఎన్నాళ్లు దాగుతుంది.


సుమిత్ర: నువ్వు ఏదో చెప్పాలి అని నాకు అర్థం కాకుండా మాట్లాడుతున్నావు దీప.


దీప: మనసులో.. మీ ఆడ పడుచు భర్త గురించి మీకు చెప్పకుండా దాస్తున్నాను అమ్మా. కానీ చెప్పకుండా దాచి తప్పు చేస్తున్నాను అని అనిపిస్తుంది. ఏం లేదు అమ్మ. ఎవరో సన్యాసి వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్లాడు. 


సుమిత్ర: ముందు ఏం జరిగిందో చెప్పు.


దీప: నాన్న కోసం పెట్టిన పిండాలు కాకులు ముట్టలేదు అమ్మ. తీరని కోరికలతో చనిపోతే పిండం ముట్టవు అంటారు కదా నేను అలాగే అనుకున్నాను. కానీ ఇంతలో అక్కడికి ఓ సన్యాసి వచ్చి నన్ను చూస్తూ బతికున్న వారికి పిండం పెడితే కాకులు ముట్టవు అన్నారు. మా అమ్మానాన్నలు చనిపోయారు అని నాకు తెలుసు కదమ్మా. అందుకే ఆయన మాటలు వింటే నాకు నవ్వు వచ్చింది.


సుమిత్ర: ఇది నవ్వాల్సిన విషయం కాదు దీప. ఆలోచించాల్సిన విషయం. నువ్వు పెట్టిన పిండాలు కాకులు ఎందుకు ముట్టలేదు. ఆ సన్యాసి నీకే ఎందుకు చెప్పాడు. ఆయన చెప్పిందే ఎందుకు నిజం కాకూడదు. 


దీప: మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. మా నాన్న నా కళ్ల ముందే చనిపోయారు. అలాంటప్పుడు ఆ సన్యాసి మాటలు ఎలా నిజం అనుకుంటాను.  


సుమిత్ర: నువ్వు పుట్టినప్పుడు నీ తల్లిదండ్రులు ఎవరో తెలీదు కదా. నీకు తెలీకుండా ఏమైనా జరిగి ఉంటే.


దీప: లేదమ్మా అలా జరిగే అవకాశమే లేదు. 


సుమిత్ర: ఏమీ లేకుండా ఊరికే ఎందుకు చెప్తాడు దీప. ఇన్నాళ్లలో ఎప్పుడూ మీ అత్తయ్య నీకు ఎప్పుడూ ఏమీ అనలేదా..


దీప: ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉంటుంది. నిన్న కూడా కొడుకు మీద కోపంతో ఒక మాట అంది. కానీ దానికి దీనికి సంబంధం లేదు. 


సుమిత్ర: ఉందేమో ఆలోచించు దీప. ఇవన్నీ కాదు దీప. నువ్వు చెప్పిన దాని బట్టి చూస్తే ఆ సన్యాసి మాటలు ఎందుకు నిజం కాకూడదు అనిపిస్తుంది. 


ఉదయం సుమిత్ర కిచెన్‌లో కూరలు కట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో దీప అక్కడికి వస్తుంది. సుమిత్ర దీపకు ఉప్మా చేయమని అంటుంది. ఇక మరోవైపు శ్రీధర్‌ వాళ్లు ఇంటికి వస్తారు.  దీప హోటల్‌కి వెళ్లిపోయి ఉంటుందని శ్రీధర్ అనుకుంటాడు. ఇక అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకుంటారు. ఇక సుమిత్రను పలకరించడానికి శ్రీధర్ కిచెన్‌కి వెళ్తాడు. అక్కడ దీపని చూసి షాక్ అవుతాడు. 


శ్రీధర్: మనసులో.. దీప హోటల్‌కి వెళ్లిపోయింది అనుకున్నానే. ఇక్కడే ఉందా. నా గురించి ఇప్పుడు నిజం చెప్పదు కదా. 


సుమిత్ర: ఏంటి అన్నయ్య అంత హుషారుగా పలకరించుకుంటూ వచ్చి ఏదో దెయ్యాన్ని చూసినట్లు అలా ఉండిపోయారు. 


శ్రీధర్: ఏం లేదమ్మా నిన్ను పలకరించడానికి వచ్చాను పలకరించాను. నేను బావతో మాట్లాడుతాను అమ్మ.


సుమిత్ర: అన్నయ్యకు ఏమైంది ఎప్పుడూ లేదు ఇంత కంగారు పడుతున్నారు.


దీప: మనసులో.. హోటల్ దగ్గర చూసింది నేను ఎక్కడ అందరితో చెప్పేస్తానో అని భయపడుతున్నట్లు ఉన్నారు. 


సుమిత్ర అందర్ని డైనింగ్ టేబుల్‌ దగ్గరకు రమ్మని పిలుస్తుంది. ఇంతలో కార్తీక్ గొంతు బాలేదు అని వాటర్ తాగుతాను అని కిచెన్‌కి వెళ్తాడు. అక్కడ దీపని చూసి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని వెళ్లిపోతుంటే దీప ఆపుతుంది.


దీప: బాబు నేను మిమల్ని నా వ్యక్తిగత విషయాల్లోనే కలగజేసుకోవద్దు అని చెప్పాను. ఇది మీ ఇళ్లు మీరు ఇక్కడ నన్ను చూసి నేను చెప్పింది గుర్తుచేసుకొని వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. మీరు ఇలా చేసినా కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఇంట్లో ఎలా ఉంటారో అలాగే ఉండండి. మీరు ఇలా నన్ను చూసి వెళ్లిపోతుంటే అది ఎవరైనా చూస్తే బాగోదు. 


కార్తీక్: నేను మిమల్ని చూడగానే వెళ్లిపోవాలి అనుకున్నది మీరు ఏదో అంటారు అని కాదు అండీ. మిమల్ని ఎవరూ ఏమీ అనకూడదు అని. అయినా అనే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి. సారీ నేను ఎందుకు ఇవ్వాలి. వాస్తవాన్ని దగ్గర నుంచి ఆలోచించాను. ఇంకెప్పుడూ మిమల్ని ఇబ్బంది పెట్టను. 


అందరికీ దీప టిఫెన్ వడ్డిస్తుంది. శ్రీధర్ దీపని చూసి ఇబ్బందిగా ఫీలవుతాడు. ఇక దశరథ్ శ్రీధర్‌తో బిజినెస్ ప్రాబ్లమ్ ఒకటి ఉందని శరత్ అనే వ్యక్తి మీద పరువు నష్టం దావా వేయించమని శ్రీధర్‌ ఫ్రెండ్‌కి చెప్పమని అంటాడు. శ్రీధర్ సరే అంటాడు. ఇక సుమిత్ర దీప మంచి కోసం మీరు ఇంకో పని చేయాలి అన్నయ్య అంటుంది. ఏంటి అని శ్రీధర్ అడిగితే దీపకు అతని భర్త నర్శింహకు విడాకులు ఇప్పించమని అంటుంది. అందరూ షాక్ అవుతారు.  దీప వద్దు అన్నా సుమిత్ర వద్దు అంటుంది. 


సుమిత్ర: దీప వద్దు అంటుంది కానీ వాడి వేధింపులు ఆగవు అన్నయ్య.


పారిజాతం: ఎందుకు ఆగుతాయి. అంటే దీప ఫీలవుతుంది కానీ. పెళ్లాం ఉండగానే చాటుగా వాడు రెండో పెళ్లి చేసుకున్నాడు అంటే ఎంత వెధవ అయింటాడు చెప్పు. అలాంటి వెధవల్ని వాడి రెండో పెళ్లాం ముందే రెండు చెంపలు వాయించాలి.


శ్రీధర్: మీరు ఊరుకోండి అత్తయ్యగారు.


పారిజాతం: అయినా వాడికే పోయే కాలం బంగారం లాంటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకున్నాడు.


శ్రీధర్: మనసులో.. మీరు వాడిని తిడుతున్నట్లు లేదు నన్ను తిడుతున్నట్లు ఉంది.


దీప: మనసులో.. తిట్టేది నా భర్తని అయినా మీకు తగులుతున్నట్లున్నాయ్. 


పారిజాతం రెచ్చిపోతుంది. ఇక దీప కూడా నర్శింహ తన జోలికి రాకుండా చూసుకుంటాను అని అంటే సుమిత్ర దీప మాటలు పట్టించుకోవద్దని అంటుంది. ఇక శ్రీధర్ మెల్లగా అక్కడి నుంచి జారుకుంటాడు. ఇంతలో శౌర్య వచ్చి తనని స్కూల్‌కి తీసుకెళ్లమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ప్రభాస్ బుల్లి ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్ - ముందుగానే ఓటీటీలోకి ‘కల్కి 2898 AD’, డేట్ సేవ్ చేసుకోండి