Kalki 2898 AD: ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన సినిమాల్లో ‘కల్కి 2898 AD’ టాప్‌లో ఉంటుంది. ఈ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అవ్వడంతో రెండుసార్లు పోస్ట్‌పోన్ అయ్యింది. ఫైనల్‌గా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. విడుదలకు ఇంకా ఒకే నెల సమయం ఉండడంతో మూవీ మేకర్స్.. ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. అందులో భాగంగా ముందుగా ‘బుజ్జి - భైరవ’ టీజర్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ బుజ్జి, భైరవ గోల ఇంకా ముగిసిపోలేదని అమెజాన్ ప్రైమ్.. ఒక స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో మరో అప్డేట్‌కు హింట్ ఇచ్చింది.


ఇంకొన్ని రోజులే..


తాజాగా అమెజాన్ ప్రైమ్.. తమ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. అందులో బుజ్జి, భైరవతో పాటు కొందరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అందులో ముందుగా ఒక చిన్నపిల్ల ముందుకొచ్చి భైరవ అని అరుస్తుంది. మరొక పాప వచ్చి ‘‘ఎప్పుడు చూసినా వెల్డింగ్ చేస్తుంటావు’’ అని అంటుంది. ‘‘మేము చూడడానికి సమ్మర్ అంతా వెయిట్ చేశాం’’ అని మరో పాప కోప్పడుతుంది. ‘‘సెలవులు అన్నీ అయిపోతున్నాయి’’ అంటూ ఒక బాబు అంటాడు. ఆ పిల్లల కోపం చూసిన ప్రభాస్.. వారిని కూల్ చేయడం కోసం ‘‘ఇంకొన్ని రోజులు’’ అని చెప్తాడు. అయినా కూడా ‘‘ఇంకెన్ని రోజులు మేము ముసలివాళ్లం అయిపోతున్నాం. ఇప్పుడే చూపించు’’ అని పాప కోప్పడుతుంది.


అప్పటివరకు ఆగాలి..


పిల్లలు అందరూ ఒక్కసారిగా అదేదో ఇప్పుడే చూపించు అని గోల చేస్తారు. దీంతో ‘‘ఓకే బుజ్జి. వీళ్లకు సర్‌ప్రైజ్ చూపించేద్దామా’’ అని బుజ్జిని అడుగుతాడు ప్రభాస్. తను కూడా ఓకే చెప్తుంది. అసలు ఆ సర్‌ప్రైజ్ ఏంటి? చిన్నపిల్లలతో ఈ స్పెషల్ వీడియో ఏంటి? అని తెలుసుకోవాలంటే మే 31 వరకు ఆగాలి అని చెప్పడంతో ఈ వీడియో ముగుస్తుంది. ఈ వీడియోకు ‘బుజ్జి అండ్ భైరవ’ అని పేరు కూడా పెట్టారు. పిల్లల కోసం ‘కల్కి 2898 AD’ టీమ్ యానిమేషన్ వీడియోను రిలీజ్ చేయనుంది. అయితే, అదెలా ఉంటుందో చూడాలనే ఆసక్తితో డార్లింగ్ ఫ్యాన్స్ కూడా.. మేమూ వెయిటింగ్ అంటున్నారు.






గ్రాండ్ ఈవెంట్..


‘కల్కి 2898 AD’ నుండి బుజ్జి, భైరవ టీజర్‌ను విడుదల చేయడం కోసం మూవీ టీమ్ పెద్ద ఈవెంట్‌నే ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ కోసం చాలాకాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. కేవలం ఒక గ్లింప్స్ కోసమే ఈ రేంజ్‌లో ఈవెంట్ ప్లాన్ చేశారంటే.. త్వరలోనే మరెన్నో ఈవెంట్స్ జరగనున్నాయని ప్రేక్షకులు ఇప్పుడే ఫిక్స్ అయిపోతున్నారు. జూన్ 27న విడుదల కానున్న ‘కల్కి 2898 AD’లో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనె, దిశా పటానీ నటించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.


Also Read: పవన్ కల్యాణ్, ప్రభాస్‌లలో నాకు నచ్చేది అదే - ఆసక్తికర విషయాలు చెప్పిన ‘ఓజీ’ డైరెక్టర్ సుజీత్