Foreign Audience About Kannappa Teaser: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ఎన్నో పాన్ ఇండియా చిత్రాల్లో ‘కన్నప్ప’ కూడా ఒకటి. మంచు విష్ణు తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన ప్రతీ అప్డేట్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంది. అలాగే ‘కన్నప్ప’ టీజర్‌ను విడుదల చేయడానికి ఏకంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌నే వేదికగా ఎంచుకున్నాడు మంచు విష్ణు. తాజాగా జరిగిన 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ టీజర్‌ను ఫారిన్ ఫిల్మ్ మేకర్స్‌కు చూపించి వారి దగ్గర నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇదంతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.


చాలా థ్యాంక్స్..


‘కన్నప్ప’ టీజర్‌ను చూడగానే అక్కడ ఉన్న సినీ ప్రముఖులు అంతా చప్పట్లు కొట్టారు. ‘‘మా కన్నప్ప కోసం మేము పడిన కష్టానికి మీరు చూపించిన ప్రేమకు, ప్రశంసలకు చాలా థ్యాంక్స్’’ అని అక్కడ ఉన్నవారికి చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. ఆ తర్వాత ఓ ఫిల్మ్ మేకర్.. ‘కన్నప్ప’ టీజర్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘‘ఇప్పుడే కన్నప్ప టీజర్ చూశాను. ఒక సాటి ఫిల్మ్ మేకర్‌గా ఈ టీజర్ అదిరిపోయిందని నాకు అనిపించింది. అందులో సినిమాటోగ్రాఫీ, ఇమేజ్.. అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి’’ అని ప్రశంసించారు. అలా మరెందరో కూడా ‘కన్నప్ప’ టీజర్‌పై ప్రశంసలు కురిపించారు.


యాక్షన్ ఉంది..


‘‘ఈ టీజర్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది’’ అని మరోకరు తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ‘‘ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు అనిపించింది. విజువల్స్, ఆప్టిక్స్.. అన్నీ చాలా బాగున్నాయి’’ అని మరొకరు తెలిపారు. ‘‘టీజర్ అద్భుతంగా ఉంది. అందులో చాలా యాక్షన్ ఉంది, చాలా ఫన్ ఉంది. అంతా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. సినిమాను కోసం చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నాను’’ అని మరో ప్రేక్షకురాలు తెలిపింది. ‘‘చాలా బాగుంది. సినిమా కోసం ఎదురుచూస్తున్నాను’’ అంటూ మరో ప్రేక్షకుడు అన్నాడు. అలా ‘కన్నప్ప’ టీజర్ స్క్రీనింగ్ నుంచి బయటికొచ్చిన అందరూ పాజిటివ్ రివ్యూలనే ఇచ్చారు.






స్పెషల్ స్క్రీనింగ్..


‘కన్నప్ప’ టీజర్‌కు ఇంత మంచి రెస్పాన్స్ రావడంపై మంచు విష్ణు సంతోషం వ్యక్తం చేశాడు. ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్, ఫిల్మ్ మేకర్స్, యాక్టర్స్ అందరికీ టీజర్ బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. ‘‘ప్రపంచవ్యాప్తంగా జూన్ 13న టీజర్ విడుదల కానుంది. మే 30న హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ థియేటర్‌లో కన్నప్ప తెలుగు టీజర్‌ను స్క్రీనింగ్ చేయనున్నాం. ఈ స్క్రీనింగ్ కన్నప్పను ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న కొందరు ప్రేక్షకులకు మాత్రమే’’ అని క్లారిటీ ఇచ్చాడు మంచు విష్ణు. ఇలా ‘కన్నప్ప’ నుంచి విడుదల చేస్తున్న ఒక్కొక్క అప్డేట్‌తో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు ఈ హీరో.


Also Read: పవన్ కల్యాణ్, ప్రభాస్‌లలో నాకు నచ్చేది అదే - ఆసక్తికర విషయాలు చెప్పిన ‘ఓజీ’ డైరెక్టర్ సుజీత్