Trivikram – Siddhu Jonnalagadda – Venky Atluri New Movie: సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌.. ఒక్క సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు. 'డీజే టిల్లు' సినిమాతో ఎంతోమంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు. చిన్న సినిమాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఆ సినిమా సక్సెస్ అందుకుంది. ఇక ఆ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ క్రేజ్‌ను కంటిన్యూ చేస్తూ 'డిజే టిల్లుకు' సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్' తో ప్రేక్ష‌కుల ముందుక వ‌చ్చాడు. అది కూడా సూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. అయితే, ఇప్పుడు వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నాడ‌ట సిద్ధూ. త్రివిక్ర‌మ్ తో సినిమా చేస్తున్నాడ‌ట‌. అయితే, త్రివిక్ర‌మ్ డైరెక్ట‌ర్ కాద‌ట‌. 


సిద్ధూ, త్రివిక్ర‌మ్, వెంకీ అట్లూరి కాంబినేష‌న్.. 


సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ‌, త్రివిక్ర‌మ్, వెంకీ అట్లూరి కాంబినేష‌న్ లో సినిమా రాబోతుంది. ఈ సినిమాకి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ రైట‌ర్ గా చేస్తున్నార‌ట‌. యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి సినిమాకి డైర‌క్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ఇండ‌స్ట్రీలో టాక్ గ‌ట్టిగా వినిపిస్తోంది. యూత్ ఫుల్ ఎంటర్‌టైన‌ర్ గా ఈ సినిమా రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. సితారా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై శ్రీ‌క‌ర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ సినిమాకి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ రైట‌ర్ గా, ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది. సిద్ధూ ప్ర‌స్తుతం 'జాక్', 'తెలుసు క‌దా' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలు పూర్త‌వ్వ‌గానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 


'టిల్లు స్క్వేర్' హిట్ తో జోష్.. 


సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ‌కి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్ 'సినిమా స‌క్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇక వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీ అయిపోయాడు. ఇప్ప‌టికే 'టిల్లు క్యూబ్' ప్ర‌క‌టించాడు. దాని మీద వ‌ర్కౌట్ చేస్తునట్లు స‌మాచారం. వ‌చ్చే ఏడాది 'టిల్లు క్యూబ్' షూటింగ్ మొద‌ల‌వ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక వ‌రుస హిట్ల‌తో టిల్ల‌న్న రెమ్యున‌రేష‌న్ కూడా పెంచేశాడ‌ట‌. రూ.15 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ట‌. మ‌రోవైపు వెంకీ అట్లూరి సితార ఎంటర్‌టైన్మెంట్స్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్ తో చేసిన 'ల‌క్కీ భాస్క‌ర్' సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. 


'జాక్'గా సిద్ధు 


బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు హీరోగా నటిస్తున్న చిత్రం 'జాక్'. ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో సిద్ధు ఈసారి యాక్షన్ మోడ్ లో తన స్టైలిష్ లుక్ తో  ఆకట్టుకున్నాడు. రెండు చేతుల్లో రెండు గన్స్ తో కనిపించాడు. అందులో ఒక గన్ ఒరిజినల్, మరొకటి బొమ్మ తుపాకి. మోషన్ పోస్టర్ ని బట్టి ఈ సినిమా యాక్షన్ అండ్ కామెడీ కలబోతగా ఉంటుందని అర్థమవుతుంది. ఫస్ట్ టైం సిద్దు గన్ పట్టుకొని కనిపించడంతో సినిమాలో ఏమైనా పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడా? అని అనుకుంటున్నారు అంద‌రూ. ఇక 'జాక్' అనే టైటిల్ కింద 'కొంచెం క్రాక్' అని రాసి ఉంది. 


Also Read: ‘ఇండియన్ 2’లో నా పాత్ర అలాంటిది, అందుకే నీల్‌ను షూటింగ్స్‌కు తీసుకువెళ్లను - కాజల్ అగర్వాల్