Naga Panchami Serial Today May 27th Episode : వైశాలి, ఫాల్గుణి, ఘనాపర్ణలకు అక్షరాభ్యాసం చేయించడానికి రఘురాం, వైదేహిలు పంతుల్ని పిలిపిస్తారు. పంతులు మంచి ముహూర్తం పెడతారు. 


వైదేహి: పంతులు గారు చెప్పింది విన్నారు కదా.. ఎల్లుండి ఎవరూ ఏ పని పెట్టుకోకండి. ఇంటి పట్టునే ఉండండి.


జ్వాల: అందరితో కలిపి నా కొడుకు నామకరణం ఏదో చేశాం అనిపించారు. ఇది కూడా అంతేనా. 


వైదేహి: నీ కొడుకుకు ఏం తక్కువ చేశాం జ్వాల. అందరితో పాటు సమానంగానే చూస్తున్నాం కదా.


జ్వాల: ఆ సమానమే నేను భరించలేకపోతున్నాను. ఆడపిల్లలు ఈ రోజు ఉంటారు. పెళ్లి అయ్యాక అత్తారింటికి వెళ్లిపోతారు. ఈ వంశాన్ని ఉద్ధరించాల్సింది నా కొడుకు.


చిత్ర: అక్క ప్రతీ సారి నువ్వేదో గొప్పగా నీ కొడుకును వెనకేసుకురాకు అక్క. కొడుకు అయినా కూతురు అయినా ఒక్కటే. ఇప్పుడు అందరికీ సమాన హక్కులు ఉన్నాయి.


మోక్ష: ప్రతీ సారి ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడటం బాలేదు వదినా. ఈ కాలంలో మగ పిల్లల కంటే ఆడపిల్లలే ముందు ఉంటున్నారు. 


పంచమి: మీరు మీ అబ్బాయికి ప్రత్యేకంగా చేయించుకోవాలి అనుకుంటే మాకు ఏ అభ్యంతరం లేదు అక్క. కానీ మేం మా పిల్లలకి అదే ముహూర్తానికి అక్షరాభ్యాసం చేయిస్తాం.


జ్వాల: ఇలా ఏదైనా అడిగితే అందరూ నన్ను వేలెత్తి చూపుతారు. ప్రతీ కార్యం గుంపులో గోవింద లాగా కానిచేస్తున్నారు.


వరుణ్: జ్వాల ఎల్లుండి ముహూర్తం బాగుందని పంతులు చెప్పారు కదా. కావాలంటే నీ కోరిక ప్రకారం మొదట మన కొడుకుకే అక్షరాభ్యాసం చేద్దాం.


మోక్ష: అలాగే చేద్దాం మా కోరిక అందరం కలిసి ఉండటం. అందరూ బాగుండాలి అనే. 


రఘురాం: అయితే సరే ఎల్లుండి అక్షరాభ్యాసం జరిపిస్తున్నాం. అందరూ సంతోషంగా ఉండాలి. ఎవరూ మనసులో ఏం పెట్టుకోకండి. సరేనా..


అక్షరాభ్యాసం ఏర్పాట్లు జరుగుతాయి. పంతులు వచ్చి పూజ చేస్తారు. పంచమి, మోక్ష, వరుణ్, జ్వాలలు పూజ చేస్తారు. పంతులు ఘనని పిలుస్తారు. ఘన కూడా వస్తుంటే కరాళి ఆపుతుంది. 


కరాళి: ఆగు ఘన, ఇది నువ్వు ఎవరో తెలుసుకొనే సమయం. నువ్వు ఒక మంత్రం స్మరించు. సర్పం దర్శయామి. అని ఈ మంత్రం స్మరించు గరుడ. 


ఘన: సర్పం దర్శయామి.


కరాళి: ఇప్పుడు నువ్వు ఆరేళ్ల పిల్లవాడివి కాదు. ఘన అనంతమైన శక్తి మంతుడివి. నువ్వు గరుడ శక్తిలో అంతర్భాగం అయ్యావు. నువ్వు ఆ మంత్రం జపిస్తే ఎవరు సర్పాంశతో పుట్టారో నీకు తెలిసిపోతుంది. ఓం గరుడాయ నమః అని స్మరిస్తూ ఉండు ఘన. వెళ్లు. 


ఘన వచ్చాక జ్వాల, వరుణ్‌లు పూజ చేయిస్తారు. బియ్యం మీద ఓం నమఃశివాయ అని రాయించమని పంతులు చెప్తారు. అయితే ఘన తానే రాస్తాను అని ఓం నమఃనమో నారాయణ అని రాస్తాడు. ఇక జ్వాల ఎందుకు అలా రాశావ్ అని అంటే పంతులు పర్లేదు అంటాడు. 


పంతులు: బాబు నీకు ఆ పేరు ఎవరు రాయమని చెప్పాడు. 


జ్వాల: నా కొడుకు అందరిలాంటి వాడు కాదు. చాలా ప్రత్యేకం. ఆరోజు పంతులు గారే స్వయంగా చెప్పారు కదా అందుకే అలా రాశాడు. నేను చాలా అదృష్టవంతురాలిని నా కొడుకు అక్షరాభ్యాసం రోజే నేను అందరిలా కాదు ప్రత్యేకం అని చాటుకున్నాడు. 


చిత్ర: నువ్వు మరీ అంత పొంగిపోకు అక్క. చిన్నప్పుడే చెప్పిన మాట వినకుండా మరేదో రాశాడు అంటే ఇది ఆలోచించాల్సిన విషయమే. రేపు పెద్దయిన తర్వాత మీ మాట వింటాడో లేదో కొంచెం ఆలోచించుకో అక్క.


జ్వాల: ఏం పర్లేదు నా కొడుకు పది మందిలో తన గొప్పతనం నిరూపించుకుంటే చాలు. 


ఇక వైశాలితో బియ్యం మీద రాయిస్తుంటే ఘన చదువుతున్న మంత్రం వల్ల వైశాలి పాములా మారుతూ ఉంటుంది. అది గమనించిన పంచమి వైశాలిని దేవుడి గదిలోకి తీసుకెళ్లి శాపం పెట్టిన అఘోరా చేతిలోని రుద్రాక్షులతో చేసిన తాడుని చేతికి కడుతుంది. 


పంచమి: స్వామి ఏ ఆవేశం అయితే శాపం ఇచ్చిందో ఆ శాపమే ఇవాళ నా బిడ్డను కాపాడే వరం కావాలి. అనుగ్రహించు శివయ్య నా బిడ్డను కాపాడు.


వైదేహి: ఎందుకు పంచమి రుద్రాక్షమాల కట్టావు.


పంచమి: అక్షరాభ్యాసం రోజు వైశాలి చేతికి ఈ రుద్రాక్షి మాల కడతాను అని మొక్కుకున్నాను అత్తయ్యగారు. 


జ్వాల: మరి ఫాల్గుణి చేతికి కట్టలేదు. ఏంటో వైశాలి స్పెషల్. కొంపతీసి తనకు కూడా నీలా పాములు అంటే ఇష్టమా ఏంటి. 


చిత్ర: అసలు ఈ పంచమి చేష్టలు అన్నీ విచిత్రంగా ఉంటాయి ఏదో ఒక విశేషం లేకపోతే ఆ రుద్రాక్షి మాల తీసుకొచ్చి కట్టదు కదా. నువ్వు నిజం చెప్పు పంచమి. 


వైదేహి: ప్రతీ విషయంలోనూ మీరు ఏదో ఒక తప్పు వెతకాలి అని చూస్తూ ఉంటారు. పంచమి చెప్పంది కదా మొక్కుకున్నాను అని ఇక ఆ విషయం వదిలేయండి. 


ఇక మోక్ష, పంచమిలు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఇక పిల్లల్ని మంచి స్కూల్‌లో చేర్పించాలి అని రఘురాం అంటాడు. ఇంతలో జ్వాల అందర్ని ఒకే స్కూల్‌లో వేస్తారా అని అడుగుతుంది. తన కొడుకుకు సిటీలోనే నెంబరు వన్ స్కూల్‌లో చేర్పిస్తాను అని అంటుంది. తన కొడుకే వారసుడు అని మిగతా వాళ్లు ఆడపిల్లలు అని రేపు తమ బిజినెస్‌లు చూసుకోవాల్సింది తన కొడుకే అని అంటుంది. దాంతో చిత్ర పిల్లల విషయంలో తేడా చూపించొద్దని తన కూతురు కూడా బిజినెస్‌లు చేస్తుందని అంటుంది. రఘురాం కలగజేసుకొని ఇప్పుడు ఆర్గ్యూలు అవసరం లేదని మంచి స్కూల్‌లో చేర్పించాలి అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.   


Also Read: 'ఓజీ'కి అర్థం చెప్పిన డైరెక్ట‌ర్ సుజీత్.. టీజ‌ర్, ట్రైల‌ర్ చింపేస్తాం