Seethe Ramudi Katnam Today Episode : మహాలక్ష్మి ఇంట్లోకి వచ్చిన సుమిత్ర ప్రీతి పడుకొని ఉంటే చూసి ఎమోషనల్ అవుతుంది. ఇంకా ప్రీతి చిన్న పిల్లలానే పడుకుందని అనుకొంటుంది. ఇక ప్రీతికి ప్రేమగా ముద్దు పెట్టాలని దగ్గరకు వెళ్తుంది. ఇంతలో ప్రీతి కళ్లు తెరిచేస్తుంది. తన గదికి ఎందుకు వచ్చావ్ అని సుమతి మీద సీరియస్ అవుతుంది.


ప్రీతి: నేను కళ్లు తెరిచే సరికి నా ముఖం దగ్గర ఉన్నావ్. నా ముఖం మీద తలగడ పెట్టి నన్ను చంపాలి అనుకుంటున్నావా. పిన్ని.. పిన్ని..


మహాలక్ష్మి: ఏమైంది ప్రీతి.


ప్రీతి: ఈవిడ నా గదిలోకి వచ్చింది పిన్ని నన్ను ఏదో చేయాలనుకుంది.


మహాలక్ష్మి: నా కూతురిని ఏం చేయాలని అనుకున్నావ్. 


సుమతి: నేను ఏం చేయాలనుకోలేదు. తల కింద.


అర్చన: ప్రీతిని ఏం చేయాలనుకున్నావ్.


ప్రీతి: అంటే తలగడ కింద ఉన్న నా చైన్ కొట్టేయాలనుకున్నావా. మరి నా తల దగ్గర ఏం చేస్తున్నావ్. అసలు నువ్వు డ్యాన్స్ మాస్టర్‌వా దొంగవా.. పో ఇక్కడి నుంచి అని ప్రీతి సుమతిని తోసేస్తుంది. ఇంతలో సీత వచ్చి పట్టుకుంటుంది.


సీత: ఏం చేశావ్ ప్రీతి నువ్వు నీ తల్లి వయసున్నామెని అలా తోసేస్తావా. పెద్దలు అంటే గౌరవం లేదా నీకు. 


మహాలక్ష్మి: దొంగలకి గౌరవం ఇచ్చేది ఏంటి.


అర్చన: ఆవిడ ప్రీతి చైన్ దొంగతనం చేయడానికి వచ్చింది.


సీత: ఏం మాట్లాడుతున్నారు చిన్న అత్తయ్య.


ప్రీతి: సమయానికి నాకు మెలకువ రావడం వల్ల సరిపోయింది. లేదంటే ఈ దొంగావిడ నా చైన్ కొట్టేసేది. 


సీత: కనీసం ఆవిడ వయసుకు అయినా విలువ ఇవ్వు. అయినా అలాంటి వాళ్లు మీరే మా టీచర్‌కి అలాంటి అవసరం లేదు. 


మహాలక్ష్మి: నువ్వు ఈ ఇంటికి డ్యాన్స్ టీచర్‌ని తీసుకొచ్చావా లేదా నగలు కొట్టేసే దొంగని తెచ్చావా.


సీత: మీరు కూడా అలాగే మాట్లాడుతారు ఏంటి. దొంగ తనం చేయాల్సిన అవసరం మా టీచర్‌కి లేదు. నిప్పు లాంటి మా టీచర్ మీద నిందలు వేయకండి. వీళ్లు ఎలాంటి మనుషులో ఇప్పటికైనా అర్థమైందా టీచర్. ఇలాంటి వాళ్లతో మనకెందుకు. 


అర్చన: ఇలాంటి వాళ్లని తర్వగా ఇంటి నుంచి పంపించే మహా. 


మహాలక్ష్మి: ఆ పనే చేయబోతున్నా.


సీత: మా మహాలక్ష్మి అత్తయ్య పెంపకంలో ప్రీతి అలా పెరిగింది. తన నోటికి హద్దు అదుపు ఉండదు. ఎంత వస్తే అంత మాట్లాడేస్తుంది. చెల్లిలి విషయంలో మామ కూడా చూసి చూడనట్లు ఉంటాడు. మా సుమతి అత్తయ్య బతికి ఉంటే ఇలా జరిగేది కాదు. కానీ ఏం చేస్తాం అత్తమ్మ కాలం చేసింది. అత్తమ్మ పోయాక మామయ్య మహా అత్తయ్యని పెళ్లి చేసుకున్నారు. దాంతో అంతా ఆవిడ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఈ ఇంట్లో ఎవరూ కూడా సుమతి అత్తయ్యని గుర్తు చేసుకోకుండా చేసింది. నేను వచ్చాక అత్తమ్మని గురించి తెలుసుకొని పదే పదే ప్రశ్నించాను. స్టోర్‌ రూంలో ఉన్న అత్తమ్మ ఫొటోను హాల్‌లో పెట్టాను. నేను ఆ ఫొటోకు రోజూ దీపం పెడుతుంటే మహా అత్తయ్య కోపంతో ఆ ఫొటోని కాల్చేసింది. అయినా నేను ఆగలేదు. ఈ ఇంటికి సుమతి నిలయం అని బోర్డ్ తగిలించాను. 


సుమతి: ఆ బోర్డ్ పెట్టింది నువ్వా సీత. మీ అత్తయ్య పెట్టిందేమో అని అనుకున్నా.


సీత: ఆవిడకు అంత మంచి మనసు ఎక్కడుంది టీచర్. మా అత్తమ్మ పేరు అంటేనే తనకు గిట్టదు. పైగా మా అత్తమ్మ ఆవిడ మంచి ఫ్రెండ్స్ అంట. నా అనుమానం ఏంటి అంతే ఆవిడే మా అత్తమ్మని ఏదో చేసి ఉంటుందని. ఒక్కోసారి ఆవిడ చేసిన దారుణాలు చూస్తుంటే ఆవిడ మనిషేనా అనిపిస్తుంది. ఆవిడ ఎంతకైనా తెగిస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. ఆవిడే కాదు ఆ బ్యాచ్ అంతా మంచోళ్లు కాదు. మామయ్యే కాస్త బెటర్. సుమతి అత్తయ్య పేరు వింటే  నాతో మంచిగా మాట్లాడుతారు. కానీ మహాలక్ష్మి అత్తయ్య దగ్గర బయట పడరు. ఇదంతా సరే మీరు ప్రీతి గదిలోకి ఎందుకు వెళ్లారు.


సుమతి: ప్రీతి నా కూతురు కదా సీత. అంటే నా కూతురు లాంటిది కదా తను ఎక్కువ ఆవేశ పడుతుంది. పద్ధతిగా ఉండాలని నాలుగు మంచి మాటలు చెప్పాలి అని వెళ్లాను. 


సీత: నా గురించి మహాలక్ష్మి ఏదేదో వాగుతుంది. నేనే సుమతి అని తెలిస్తే మహాలక్ష్మి ఎలాంటి ప్లాన్ వేస్తుందో. ఆ దుర్మార్గురాలి ఆట కట్టిస్తాను.


ఉదయం సీత వంట చేస్తుంటే సుమతి అక్కడికి వస్తుంది. కాఫీ కావాలా అని సీత అడిగితే సుమతి సాయం చేస్తా అని అంటుంది. సుమతి రామ్ ప్రీతిలకు ఇష్టమైన స్వీట్స్ చేస్తా అనుకొని చెప్తుంది. రవ్వలడ్లు, సున్నుండలు అంటే తన భర్తకు, ప్రీతి, తన మామయ్యలకు ఇష్టం అని చెప్తుంది. 


ఇక సుమతి స్వీట్స్ చేస్తుంది. రామ్ అక్కడికి వస్తే అవి తనకు చాలా ఇష్టమని చిన్నప్పుడు తనకు ప్రీతికి తన తల్లి చేసి పెట్టేదని అంటాడు. రామ్, సీతలు లొట్టలేసుకొని తింటారు. ఇంతలో ప్రీతి వచ్చి బుంగమూతి పెట్టుకుంటుంది. సీత ప్రీతికి టీచర్ పర్మిషన్ తీసుకోమని అంటుంది. సుమతి ప్రీతికి తినమని ఇస్తుంది. ఇక సీత మళ్లీ ప్రీతిని ఆపి ఊరికే తీసుకోవద్దు టీచర్‌కి ముద్దు ఇవ్వాలని అంటుంది. టీచర్‌ని నువ్వు తోసేసినందుకు ముద్దు ఇచ్చి స్వీట్ తీసుకో అని అంటుంది. దీంతో ప్రీతి సుమతికి ముద్దు పెట్టుకుంటుంది. సుమతి చాలా సంతోషంతో ప్రీతి నుదిటి మీద ముద్దు పెడుతుంది. తర్వాత ప్రీతికి స్వీట్స్ ఇస్తుంది. ఇక ఉష అదంతా చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: మైత్రీ చేతికి కాజల్, ఆనంద్ దేవరకొండ సినిమాలు - చిన్న చిత్రాలకు సపోర్ట్ గా నిలుస్తున్న అగ్ర నిర్మాతలు!