Director Sujeeth About Pawan Kalyan & OG Movie : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, సుజీత్ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న చిత్రం 'ఓజీ'. ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య ప్రొడ్యూస‌ర్. ఈ సినిమాకి సంబంధించి ప‌వ‌న్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు భారీ అంచ‌నాలు ఉన్నాయి. కార‌ణం.. ప‌వ‌న్ క‌ల్యాణ్ డిఫ‌రెంట్‌గా క‌నిపించ‌నున్నారు. ఒక గ్యాంగ్ స్ట‌ర్‌గా ఆయ‌న క‌నిపించనున్నారు. దీంతో ఫైట్స్, ఫీట్స్ ఉంటాయ‌ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అదీ కాకుండా డైరెక్ట‌ర్ సుజీత్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు పెద్ద ఫ్యాన్. దీంతో ఒక ఫ్యాన్ త‌మ హీరోని ఎంత‌బాగా చూపిస్తాడో అని వెయిట్ చేస్తున్నారు అంద‌రూ. ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు దర్శకుడు సుజీత్. ఈ సంద‌ర్భంగా 'ఓజీ' అంటే ఏంటో చెప్పారు. 


ఒక్క లైన్ చెప్పాను అంతే.. 


'ఓజీ'.. దాదాపు ఈ సినిమా షూటింగ్ ఎండింగ్‌కు వచ్చింది. సెప్టెంబ‌ర్ 27న సినిమా రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే, ఈ సినిమాకి సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు డైరెక్ట‌ర్ సుజీత్. ఒక్క లైన్ చెప్ప‌గానే క‌ల్యాణ్ గారు ఓకే చెప్పేశార‌ని అన్నారు. "'ఓజీ' కూడా రీ మేక్ అన్నారు. అలా అనే న‌న్ను పిలిచారు. కానీ, ఒక్క ఒరిజిన‌ల్ సినిమా, డైరెక్ట్ గా తీస్తే ఆ కిక్కే వేరు క‌దా. అందుకే నేను మాత్రం ఒక్క ఛాన్స్ దేవుడా అని అనుకున్నాను. నేచ‌ర్ మ‌న‌కి కో - ఆప‌రేట్ చేస్తుంది అంటారు క‌దా. అలా ల‌క్కీగా.. ఏదైనా కొత్త క‌థ ఉందా అని అడిగారు. ఒక లైన్ చెప్పాను క‌ల్యాణ్ గారికి. వెంట‌నే ఓకే అన్నారు. నా మీద జ‌ప‌నీస్ సినిమా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. క‌ల్యాణ్ గారికి కూడా జ‌ప‌నీస్ సినిమాలు చాలా ఇష్టం. క‌ల్యాణ్ గారి కొడుకు పేరు ఎక్క‌డెక్క‌డో వెతికి పెట్టుకున్నారు. అలా ఇద్ద‌రం క‌నెక్ట్ అయ్యాం" అని చెప్పారు సుజీత్. 


'ఓజీ' అంటే అర్థం ఇదే.. 


'ఓజీ'లో ప‌వ‌న్ క‌ల్యాణ్ క్యారెక్ట‌ర్ పేరు ఏంటో లీక్ చేశారు సుజీత్. ఓజీ అంటే ఓజ‌స్ గంభీర అని అన్నారు. 'ఓజ‌స్' అంటే మాస్ట‌ర్ అని, 'గంభీర' అనేది హీరో పేరు అని చెప్పారు.ఆయ‌న సినిమాలో మాస్ట‌ర్ అని అన్నారు. ఇక 'ఓజీ' అంటే ఒరిజిన‌ల్ గ్యాంగ‌స్ట‌ర్ అనే అర్థం క‌డా వ‌స్తుంద‌న్నారు సుజీత్. 


ఆయ‌నతో అలా సినిమా తీయాలి అనుకున్నాను.. 


"ప‌వ‌న్ క‌ల్యాణ్ గారి మీద జ‌ప‌నీస్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. ఆయ‌న సినిమాలో అలాంటివి ఉండాలి అనుకున్నాను. నేను ఆయ‌న వేరే సినిమాలు చూశాను. సాంగ్స్ లో పెడుతుంటారు. అవ‌స‌రం లేక‌పోయినా ఆయ‌న్ని ఇన్ కార్పొరేట్ చేస్తుంటారు అన‌మాట. జనాలు ఎక్స్ పెక్ట్ చేస్తారు క‌దా. దాన్ని రిలేట్ చేసుకున్నాను. స్టోరీని లింక్ చేసుకున్నాను. దాన్ని జ‌నాలు ఫ్రెష్ గా ఫీల్ అవుతారు అనిపించింది నాకు. ఇక టీజ‌ర్ అన్ని కూడా మ‌నం ఇర‌గ‌దీశాం. ట్రైల‌ర్ క‌ట్ కూడా అయిపోయింది. సినిమా ముందు రిలీజ్ అవుతుంది క‌దా.. చింపేస్తాం. నేను కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. ప‌వ‌న్ కల్యాణ్ ని కొత్త‌గా చూస్తున్నాం క‌దా" అని సినిమా గురించి విశేషాలు పంచుకున్నారు సుజీత్. సుజీత్ మాట‌లు విన్న ఫ్యాన్స్ అంతా తెగ కామెంట్లు పెడుతున్నారు. "వెయిటింగ్ ఇక్క‌డా" అంటున్నారు. ‘ఓజీ’ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు.  


Also Read: పవన్ కల్యాణ్, ప్రభాస్‌లలో నాకు నచ్చేది అదే - ఆసక్తికర విషయాలు చెప్పిన ‘ఓజీ’ డైరెక్టర్ సుజీత్