Garuda Purana:  మనిషి రోజు రోజుకీ మృగంలా మారిపోతున్నాడు...చివరకు మృగం కూడా సిగ్గుపడేలాంటి ఘటనలు దేశంలో జరుగుతున్నాయ్. మృగానికి కేవలం ఆకలి వేసినప్పుడే వేటాడుతుంది కానీ మనిషికి ఆ పరిమితులు, పరిధులు ఉండడం లేదు. అడ్డూ అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిని ఏం చేయాలి? ఎలాంటి శిక్షలు వేయాలి? ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటన ఈ  దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తున్నాయి. ఆగస్టు 9 ఉదయం కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్‌ అండ్ హాస్పిటల్‌ సెమినార్ హాల్‌లో ట్రైనీ డాక్టర్ మృతదేహం కనిపించింది. ఆమెను అత్యాచారం చేసి హత్యచేశారని వైద్యుల ప్రాధమిక నివేదికలో తేలింది. ఈ ఘటనలో కోల్ కతాలో ట్రాఫిక్ పోలీస్ వాలంటీర్ సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64(అత్యాచారం) 103/1(హత్య) కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులను త్వరగా పరిష్కరిచాలని, వైద్యులకు భద్రత కల్పించాలన దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు భారీగా ఆందోళనలు చేశారు. అసలు ఇలాంటి వారికి గరుడ పురాణం ప్రకారం ఎలాంటి శిక్షలున్నాయో తెలుసా..


 Also Read: గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చా-ఉండకూడదా!


అత్యాచారాలు చేసేవారికి గరుడ పురాణం ప్రకారం శిక్షలివే


ల‌లాభక్షం


అత్యాచారానికి పాల్పడే వారికి మాత్రమే కాదు..స్త్రీలను కామంతో చూసేవారికి కూడా నరకంలో శిక్షలు మామూలుగా ఉండవు. ఇలాంటి వారికి విధించే శిక్ష లలాభక్షం. ఈ శిక్షలో భాగంగా కుళ్లిపోయిన వీర్యంతో నిండిన స‌ముద్రంలో పడేస్తారు. 


పుయోద‌కం


పురుషులు లేదా మ‌హిళ‌లు ఎవ‌రైనా..ఎవర్నైనా అత్యాచారం చేసినా, లైంగికంగా వేధించినా నరకంలో విధించే శిక్ష ఇది. ఒక పెద్ద బావిలో మ‌లం, మూత్రం, ర‌క్తం, శ్లేష్మం నింపి అందులో ఆ వ్య‌క్తుల‌ను ప‌డేస్తారు. వాళ్లు ఎప్పటికీ ఆ బావిలోనే ఉండిపోవడమే. 


స‌ల్మ‌లి


నరకంలో విధించే శిక్షల్లో సల్మని ఒ‍కటి. వివాహేత‌ర సంబంధాలు పెట్టుకునే స్త్రీ, పురుషుల‌కు విధించే శిక్ష పేరు సల్మలి. బాగా వేడిగా అగ్నికణంలా ఉన్న ఓ ఇనుప స్తంభాన్ని నగ్నంగా కౌగిలించుకోమని చెప్పి యమభటులు కొరడాలతో కొడుతుంటారు.  


Also Read: పక్కవాళ్లకు స్వీట్ ఇవ్వకుండా తింటే కూడా పాపమే? గరుడ పురాణంలో ఘోరమైన శిక్ష?


వ‌జ్ర‌కంఠక‌స‌లి


లైంగిక వాంఛ తీర్చుకునేందుకు చిన్నారులను, స్త్రీలను మాత్రమే కాదు చివరకు జంతువులను కూడా వదలడం లేదు. ఇలాంటి వారికి నరకంలో విధించే శిక్షే వజ్రకంఠసలి. సూదుల్లా ఉన్న పెద్ద లోహాలను శరీరంలోకి గుచ్చి వాటితో మనిషిని అమాంతం పైకిలేపి గాల్లో వేలాడదీసి శరీరాన్ని ఛిద్రం చేస్తారు. 


అష్టాదశ పురాణాలలో గరుడ పురాణం ఒకటి. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన విషయాలను వేద వ్యాసుడు రచించాడు. మనిషి మరణించినప్పటి నుంచి ఆత్మ ప్రయాణం ఎలా సాగుతుంది..ఎక్కడెక్కడ తిరుగుతుంది..పాపం చేస్తే ఎలాంటి శిక్షలు అనుభవిస్తారు..పుణ్యం చేస్తే ఎక్కడకు వెళతారు అవన్నీ వివరంగా ఉంటాయి. కేవలం చావుకి సంబంధించి మాత్రమే కాదు ..మనిషి పుట్టుక నుంచి ఆచరించిల్సిన సంస్కారాల గురించి కూడా గరుడపురాణంలో ఉంటుంది. 


Also Read:  జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట