Ekadashi 2026: ఏకాదశి 2026 తేదీల జాబితా: ఏడాదికి 24 ఏకాదశిలు వస్తాయి. శుక్లపక్ష ఏకాదశి, కృష్ణ పక్ష ఏకాదశి నెలకు రెండు వస్తాయి. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన తిథి ఏకాదశి. అందుకే 24 ఏకాదశిలు దేనికవే ప్రత్యేకం. 2026లో ఏకాదశి పూర్తి జాబితా ఇదిగో.. ఏకాదశి 2026 జాబితా
షట్తిలా ఏకాదశి- 14 జనవరి 2026
జయా ఏకాదశి - 29 జనవరి 2026
విజయా ఏకాదశి - 13 ఫిబ్రవరి 2026
ఆమలకి ఏకాదశి - 27 ఫిబ్రవరి 2026
పాపమోచని ఏకాదశి - 15 మార్చి 2026
కామదా ఏకాదశి - 29 మార్చి 2026
వరుథిని ఏకాదశి - 13 ఏప్రిల్ 2026
మోహిని ఏకాదశి - 27 ఏప్రిల్ 2026
అపరా ఏకాదశి - 13 మే 2026
పద్మిని ఏకాదశి - 27 మే 2026
పరమ ఏకాదశి - 11 జూన్ 2026
నిర్జల ఏకాదశి - 25 జూన్ 2026
యోగినీ ఏకాదశి - 10 జూలై 2026
దేవశయని ఏకాదశి - 25 జూలై 2026
కామికా ఏకాదశి - 9 ఆగస్టు 2026
శ్రావణ పుత్రదా ఏకాదశి - 23 ఆగస్టు 2026
అజా ఏకాదశి - 7 సెప్టెంబర్ 2026
పరివర్తిని ఏకాదశి - 22 సెప్టెంబర్ 2026
ఇందిరా ఏకాదశి - 6 అక్టోబర్ 2026
పాపాంకుశ ఏకాదశి - 22 అక్టోబర్ 2026
రమా ఏకాదశి - 5 నవంబర్ 2026
దేవుత్థాన ఏకాదశి - 20 నవంబర్ 2026
ఉత్పన్న ఏకాదశి - 4 డిసెంబర్ 2026
మోక్షదా ఏకాదశి - 20 డిసెంబర్ 2026
2026లో 2 ప్రత్యేక ఏకాదశిలు
2026లో అధిక మాసం కూడా వస్తుంది, అందుకే ఈ నెలలోని 2 ఏకాదశిలు చాలా ప్రత్యేకమైనవిగా పరిగణిస్తారు. వీటిని పరమ , పద్మిని ఏకాదశి అని పిలుస్తారు. పరమ అరుదైన శక్తులను ఇచ్చేది కాబట్టి పరమ అని పిలుస్తారు. అదే సమయంలో, పద్మిని ఏకాదశి వ్రతాన్ని క్రమబద్ధంగా పాటించేవారు విష్ణు లోకానికి వెళతా అన్ని రకాల యజ్ఞాలు, వ్రతాలు , తపస్సుల ఫలాలను పొందుతారని విశ్వాసం.
ఏకాదశి వ్రతం ప్రాముఖ్యత
ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది, పాపాలు తొలగిపోతాయి. మోక్షం లభిస్తుంది. ఈ వ్రతం శారీరక మానసిక శుద్ధితో పాటు, మనస్సును పదును పెడుతుంది.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఏకాదశి నాడు నారాయణుడు ఎక్కువ శక్తితో ఉంటాడని..అందుకే ఈ రోజు ఆయన్ని ఆరాధించడం వల్ల కలిగే పుణ్యఫలం ఇతర వ్రతాల కంటే వేల రెట్లు ఎక్కువగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి
పద్మ పురాణం ప్రకారం ఏకాదశి వ్రతం వల్ల జన్మజన్మాంతరాల పాపాలు క్షయమవుతాయి.
ఈ వ్రతాన్ని 24 లేదా 26 ఏకాదశులు ఆచరిస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి.
చంద్రకళల సిద్ధాంతం ప్రకారం ఏకాదశి తిథినాడు శరీరంలో నీటి అంశం ఎక్కువగా ఉంటుంది. ఉపవాసం చేయడం వల్ల జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభించి, శరీరం డీటాక్స్ అవుతుంది.
పురాణ కథలు భీష్మ పితామహుడు యుధిష్ఠిరునికి ఏకాదశి మాహాత్మ్యాన్ని వివరించాడు..వీటిలో అమలకీ ఏకాదశి, నిర్జలా ఏకాదశి, వైకుంఠ ఏకాదశి మరింత ప్రాధాన్యత కలిగినవి.
ఏకాదశి వ్రత నియమాలు
దశమి నాడు రాత్రి నుంచే ఉపవాసం మొదలు (ఒకపూట భోజనం మాత్రమే).
ఏకాదశి నాడు పూర్తి ఉపవాసం లేదా ఫలహారం (నిరాహారం - నీళ్లు కూడా తాగకపోవడం ఉత్తమం - నిర్జలా ఏకాదశి).
ధాన్యాలు, ఉప్పు, బియ్యం, గోధుమలు తినకూడదు.
ద్వాదశి నాడు పారాయణం చేసిన తర్వాత వ్రతం విరమించాలి
"ఏకాదశీ వ్రతం సర్వపాపహారి, సర్వసౌఖ్యప్రదం, మోక్షదాయకం"
ఇక తిరుమల శ్రీవారికి ఏ ఏ సేవలున్నాయి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది... పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు- పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా! ఈ లింక్ క్లిక్ చేయండి