Dussehra 2022: కాలాన్ని స్త్రీ పురుష రూపాత్మకంగా చెబుతారు. ఏడాదిలో చైత్రం మొదలు భాద్రపద మాసం వరకూ తొలి అర్ధ భాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజం నుంచి ఫాల్గుణం వరకు గల ఆరు నెలల కాలం స్త్రీ రూపాత్మకం. ప్రత్యేకించి రెండో అర్ధ భాగంలోని తొలి మాసం ఆశ్వయుజం అందుకే అమ్మవారి ఉపాసనకు ఈ నెల చాలా ప్రత్యేకం అని చెబుతారు. అందుకే శరన్నవరాత్రులు అత్యంత పవర్ ఫుల్. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకూ రోజుకో అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారికి రోజుకో నైవేద్యం సమర్పిస్తారు... ఏ రోజు ఏం నివేదించాలో చూద్దాం...



  1. మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి..ఈ రోజు శ్రీ స్వర్ణకవచలాంకృత దుర్గాదేవి అవతారంలో కనిపించే అమ్మవారికి కట్టు పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు

  2. ఆశ్వయుజశుద్ధ విదియ రోజు శ్రీ బాలా త్రిపురసుందరీదేవి అవతారం..ఈ రోజు పులిహోర నైవేద్యం పెడతారు

  3. ఆశ్వయుజ శుద్ధ తదియ రోజు శ్రీ గాయత్రీదేవి  అలంకారం...గాయత్రి దేవికి కొబ్బరి అన్నం నివేదిస్తారు

  4. ఆశ్వయుజ శుద్ధ చవితి రోజు శ్రీ లలితా దేవి అలంకారంలో అమ్మవారు అనుగ్రహిస్తుంది..ఈ రోజు కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు

  5. ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజు అన్నపూర్ణ అలంకారంలో దర్శనమిచ్చే అమ్మకు పంచభక్షాలు నివేదించాలి

  6. ఆశ్వయుజ శుద్ధ షష్టి  రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో కనిపించే అమ్మవారికి కదంబం  నివేదిస్తారు

  7. ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారికి దధ్యోజనం నైవేద్యం పెడతారు

  8. ఆశ్వయుజ శుద్ధ అష్టమి  రోజు...ఇదే దుర్గాష్టమి..ఈ రోజు దుర్గాదేవి చక్కెరపొంగలి నైవేద్యంగా పెడతారు

  9. ఆశ్వయుజ శుద్ధ నవమి ..అంటే...మహర్నవమి రోజు  శుభానికిసంకేతంగా పాయసం నివేదిస్తారు

  10. ఆశ్వయుజ శుద్ధ దశమి శ్రీ రాజరాజేశ్వరి దేవికి గారెలు,పాయసం, పులిహోర అన్నీ నైవేద్యం పెట్టొచ్చు


అలంకారాన్ని బట్టి ఇవి నివేదిస్తారు..అంతే కానీ.. తప్పనిసరిగా ఇవే నివేదించాలనేం లేదు. ఎవరి శక్తికి తగిన నైవేద్యం వారు పెట్టొచ్చు. భక్తి ప్రధానం....


Also Read: శరన్నవరాత్రుల్లో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరు, తింటే ఏమవుతుంది!


శరన్నరాత్రులు ఎందుకింత ప్రత్యేకం
భగవంతుని చేరుకోవడానికి ప్రారంభం ఆశ్వయుజ మాసం నుంచే మొదలవుతుందని చెబుతారు పండితులు. ఈ నెల ఆరంభంలోనే శారదా నవరాత్రులు పేరుతో తొమ్మిది రోజులు ఉపాసన చేస్తారు. ఎందుకంటే..ఈ నెల ఆరంభంలోనే తొమ్మది రాత్రులు కలపి ఒకరోజు ప్రారంభంలో ఉండే తెల్లవారు ఝాముతో సమానమని చెబుతారు. అంటే సూర్యోదయానికి ముందున్న కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తాం కదా అలా అన్నమాట. అందుకే ఈ నవరాత్రులు  ఉపాసనకి పరమయోగ్యమైన కాలమని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే సంవత్సరం మొత్తాన్ని ఒక రోజుగా భావిస్తే అందులో తల్లవారుఝాము కాలం ఆశ్వయుజ పాడ్యమి నుంచి నవమి వరకూ ఉండే కాలం. ఈ తొమ్మిది రాత్రులను బ్రహ్మ ముహూర్తంగా పరిగణిస్తారు.  అందుకే ఉపాశనకు నవరాత్రులు అత్యంత  యోగ్యమైనవి అని చెబుతారు. 


Also Read: శరన్నవరాత్రుల్లో పాడ్యమి నుంచి దశమి వరకూ అమ్మవారికి రోజుకో రంగు ప్రత్యేకం