Shravan Shaniwar: సనాతన ధర్మంలో, శని భగవానుడు కర్మ ఫలాలను ఇచ్చే దేవునిగా భావిస్తారు. ఒక వ్యక్తి తన చర్యలను ఎలా నిర్వహిస్తాడో వాటి ఆధారంగా, అతను లేదా ఆమె శుభ లేదా అశుభ ఫలాలను పొందుతారు. శని దేవుడిని ఆరాధించడానికి శనివారం ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు. శనిదేవుని ఆశీస్సులు పొందేందుకు ఈ రోజున దానాలు ఇవ్వాలని సూచించారు. ఎందుకంటే ఈ దానాలు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడతాయి. శనివారం ఏయే వస్తువులను దానం చేయాలి..?


ఆవాల నూనె
శాస్త్రం ప్రకారం, శనివారాలు ఆవనూనెను దానం చేయడం చాలా ప్రయోజనకరమ‌ని పరిగణిస్తారు. శని భ‌గ‌వానుడి నుంచి మీ జీవితంలో అడ్డంకులు ఎదురవుతున్నట్లయితే, మీరు శనివారం రోజు ఆవనూనెను ఎక్కువగా ఉపయోగించాలి. ఇనుప పాత్రలో ఆవాల నూనె తీసుకుని అందులో 1 రూపాయి నాణెం వేసి శనివారం నాడు ముఖానికి రాసుకోవాలి. అప్పుడు ఆ నూనెను పేదలకు దానం చేయండి లేదా పుష్పించే చెట్టుకు సమర్పించండి.


Also Read : శనివారం ఈ ప‌రిహారాల‌తో శని దోషం తప్పకుండా తొలగిపోతుంది


నల్ల వ‌స్త్రాలు, బూట్లు
శాస్త్రం ప్రకారం, చాలా కాలంగా అనారోగ్యాలు మిమ్మల్ని బాధపెడుతుంటే, శనివారం సాయంత్రం ఒక పేద వ్యక్తికి న‌ల్ల‌ని వస్త్రాలు, బూట్లు లేదా చెప్పులు దానం చేసి, ఆ వ్యక్తి ఆశీర్వాదం పొందాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, వ్యాధుల నుంచి మీరు క్ర‌మంగా దూర‌మ‌వుతారు.


ఇనుప పాత్రలు
శనివారం నాడు ఇనుప పాత్రలను దానం చేయడం చాలా శుభప్రదమని శాస్త్రాలలో చెప్పారు. మీ జాతకంలో శని ప్రభావం ఉంటే, అవసరమైన వ్యక్తికి పాన్, గ్రిడ్ లేదా పటకారు వంటి ఇనుప పాత్రలను దానం చేయండి. ఇలా చేయడం వల్ల ప్రమాదాలు జరగకుండా ప్రయాణం సుఖంగా ఉంటుంది.


నల్ల నువ్వులు
మీరు ఆర్థిక‌ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, శనివారం సాయంత్రం 1.25 కిలోల నల్ల నువ్వులను పేదవారికి దానం చేయండి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీరు వరుసగా ఐదు శనివారాలు ఇలా చేయాలి. అలా చేస్తే త్వరలో మీ జీవితంలోని ఆర్థిక‌ సంబంధిత సమస్యలన్నీ తొల‌గిపోతాయి.


Also Read : రావిచెట్టును పూజిస్తే శ‌ని అనుగ్ర‌హం ఖాయం


గుర్రపు నాడా
గుర్రం కాలుకు వేసిన నాడాను ఉపయోగించి మన అనేక సమస్యలకు పరిష్కారాలను కనుగొనవచ్చు. శుక్రవారం రోజు గుర్రపు నాడాను ఆవాల నూనెలో ముంచి, శనివారం ప్రధాన ద్వారం మీద U ఆకారంలో ఉంచండి. మీ ఇంట్లో ఇలా చేస్తే కుటుంబ సభ్యులు శనిగ్రహ దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందుతారు. ఇంట్లో శాంతి, సంతోషాలు ఉంటాయి. అయితే ఈ నాడా పాత‌దై ఉండాలి. 


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.