Horoscope Today July 22, 2023


మేష రాశి
మేషరాశి వారికి ఈరోజు చాలా మంచి రోజు అవుతుంది. బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది కానీ తలపెట్టిన పనులు పూర్తికావడం మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. కుటుంబానికి సమయం కేటాయించండి. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.


వృషభ రాశి
ఈ రాశివారి ఈ రోజు ఒత్తిడితో కూడిన రోజు అవుతుంది. చెడు ఆలోచనలకు దూరంగా ఉండడం మంచిది లేదంటే ఆ ప్రభావం మీ కుటుంబంపై పడుతుంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. వ్యాపారులకు ఈరోజు పెద్దగా కలసిరాదు. ఉద్యోగులు పని విషయంలో అస్సలు నిర్లక్ష్యం వహించకూడదు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి


మిధున రాశి
మిథున రాశి వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. మీ మాటదూకుడు, కోపం నియంత్రించుకుంటే మంచిది. మీకు కోపం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి మీ కన్నా పెద్దవారా చిన్నవారా అనే విషయం మీరు మర్చిపోతారు. ఆ క్షణం మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మంచి జరుగుతుంది. ధనలాభం ఉంటుంది. పాత స్నేహితులను కలుస్తారు. మీ పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేసుకుంటారు.


Also Read: కలియుగం ఇంకా ఎన్నేళ్లుంది - కల్కి అవతరించేది అప్పుడేనా!


కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. ఏదో ఒక విషయంలో చాలా టెన్షన్ పడతారు. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.  విద్యార్థులు మితిమీరిన స్నేహంతో సమయాన్ని వృధా చేసుకోకూడదు. డబ్బు, మాట రెండూ పొదుపుచేయడం మంచిది. ఎవరిపైనా పరుష పదాలు వినియోగించవద్దు..అనవసర ఇబ్బందుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది.


సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబ పరంగా అంతా బాగానే ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా మానసిక సమస్యలు వేధిస్తాయి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి, వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది.


కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది.ఈ రోజు మీరు మీ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తారు. కొన్ని విషయాల్లో కోపంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యులు మీకు అన్ని విషయాల్లో సహకరిస్తారు. ఉద్యోగులకు కొద్దిగా ఆందోళన ఉంటుంది. మీ ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.


తులా రాశి
తుల రాశి వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తమ పనిని పూర్తిచేస్తారు. వ్యాపారంలో ఒడిదొడుకులు ఉండొచ్చు.ఏ విషయాన్ని అయినా లోతుగా ఆలోచిస్తారు. వైవాహిక సంబంధం బావుంటుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఆరోగ్యం జాగ్రత్త.


Also Read: కల్కి ఎంట్రీతో కలియుగం అంతమైపోతుందా - కల్కి ఎప్పుడు వస్తాడు!


వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం క్షీణించవచ్చు. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని సంప్రదించాకే ఏపనైనా చేస్తారు కానీ మీలోనే క్రమ శిక్షణా లోపం ఉంటుంది. డబ్బుని సరైన  వాటికి ఖర్చు చేస్తారు. 


ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈరోజు మంచి రోజు కానుంది. అనుకోని ప్రయోజనం పొందుతారు. అయితే విలువైన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న విషయాన్ని నిర్లక్ష్యంగా వదిలేయకండి వైద్యుడిని సంప్రదించండి. బంధువులను కలుస్తారు. మీరు  ప్రారంభించే పనులకు జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది.


మకర రాశి
మకర రాశి వారు ఈ రోజు అన్ని విషయాల్లో స్ట్రాంగ్ గా ఉంటారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు. కొత్తగా ప్రారంబించాలి అనుకునే పనులు ఆ రోజు మొదలుపెడితే తక్కువ సమయంలోనే పూర్తవుతాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. తగినంత నిద్ర అవసరం. 


కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు కొంత ఆందోళనకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. చేపట్టిన పనులు మాత్రం సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. కుటుంబానికి సమయం కేటాయించండి. అనవసర ఖర్చులు, అనవసర మాటలు తగ్గించుకుంటే మంచిది. 


మీనరాశి
మీన రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆరోగ్యం బావుంటుంది, ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ప్రారంభించిన పనులు మాత్రం మధ్యలోనే ఆగిపోతాయి. కుటుంబ బాధ్యతలు విస్మరిస్తారు. కొన్ని సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial