క్షయ తృతియ రోజున లక్ష్మితో పాటుగా అమృతం జనించిన రోజు. ఈ అమృత భాండాన్ని చేత బూని క్షీరసాగరం నుంచి ధన్వంతరి అవతరించిన రోజు. అమృతం జనించిన రోజు కనుకనే  అక్షయ తృతీయగా దీనికి పేరు. అక్షయం అంటే క్షయం లేనిది. అంటే ఎప్పటికీ నిలిచి ఉండేదని అర్థం. అందుకే సంపద మనతో ఎప్పటికీ నిలిచి ఉండాలని ఈ రోజున లక్ష్మీదేవిని, సంపదకు ప్రతీక వంటి సువర్ణాన్ని కొలుచుకుంటారు. కేవలం సంపద మాత్రమే కాదు ఈరోజు ఆయురారోగ్యాలు కూడా అందించే రోజు. దైవ వైద్యుడు ధన్వంతరి అవతరించిన రోజు కూడా. అన్ని భాగ్యాలలో ఆరోగ్యం కూడా ఒకటి అనటం కంటే ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. అటువంటి ఆరోగ్యానికి ప్రతీక వంటి  ధన్వంతరి గురించిన కొన్ని ఆసక్తి కరమైన విషయాలు తెలుసుకుందాం.


ఓం నమో భగవతే వాసుదేవాయ


ధన్వంతరయే అమృతకలశ హస్తాయ


వజ్రజలౌక హస్తాయ


సర్వామాయవినాశనాయ


త్రైలోక్య నాథాయ


శ్రీ మహా విష్ణవే నమః


భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం.


బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం భాస్కరుని (సూర్యభగవానుని) వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న ధన్వంతరి. ఇతడు సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.


కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు") - ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది. విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు.


ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంథాన్ని రచించాడని ఒక అభిప్రాయం. భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తరువాత రమాదేవి అవతరించి విష్ణువు వక్షోభాగాన్ని అలంకరించింది. తరువాత ధన్వంతరి అవతరించాడు.


"అప్పుడు సాగర గర్భం నుంచి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు."భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తరువాత రమాదేవి అవతరించి విష్ణువు వక్షభాగాన్ని అలంకరించింది. తరువాత ధన్వంతరి అవతరించాడు.


అప్పుడు సాగర గర్భం నుంచి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టారు.


Also read: దీపావళికి వంటింట్లో వాడే ఈ వస్తువులు మాత్రం కొనకండి, దురదృష్టం వెంటాడుతుందట