Spirituality:  నిత్యం ఉపయోగించే వస్తువులు ఎన్నో ఉంటాయి.  ఆ వస్తువులు సడెన్ గా అయిపోవడమో, వెంటనే తెచ్చుకునే అవకాశం లేకపోవడం వల్లనో ఇరుగు పొరుగు వారిని అడిగి తీసేసుకుంటారు. అయితే కొన్ని వస్తువులు డబ్బులివ్వకుండా తీసుకోకూడదంటారు పండితులు.  తెలియక ఈ తప్పు చేసినా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతారు. నగదు చెల్లించకుండా తీసుకోకూడని, ఇవ్వకూడని వస్తువులేంటో చూద్దాం...


సూది


శాస్త్రం ప్రకారం డబ్బు ఇవ్వకుండా సూది తీసుకోకూడదు. ఇది ఇనుము వస్తువు..అందుకే శనిగా భావిస్తారు. అందుకే సూదిని డబ్బులు ఇవ్వకుండా ఉచితంగా తీసుకెళ్లిన‌ట్ల‌యితే ఇంట్లో సమస్యలు పెరుగుతాయి.  నెగెటివ్ ఎనర్జీ వస్తుందంటారు.  పైగా ఇలా తీసుకున్న వ్యక్తుల మధ్య పరస్పర విభేదాలు, తగాదాలు పెరుగుతాయి. న‌గ‌దు చెల్లించి సూది తీసుకోవచ్చు


Also Read : ఇంట్లో వీటిని ఖాళీగా ఉంచితే దురదృష్టం వెంట‌పడుతుందా!


పాలు


పాలను పవిత్రంగా భావిస్తారు. ఈ కారణంగా మనం పాలను దానధర్మంగా తీసుకోకూడదు లేదా ఇవ్వకూడదు. ఒకరి దగ్గర పాలు తీసుకుంటే డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. డబ్బులు చెల్లించకుండా పాలు తీసుకునేందుకు వెళ్లవద్దు. ఇది మీ ఇంటిలో అప్పుల భారాన్ని పెంచుతుంది. ఫ‌లితంగా ఇంట్లో అశాంతి వాతావరణాన్ని సృష్టించవచ్చు.


ఇనుము


డబ్బు చెల్లించకుండా మరొకరి నుంచి బహుమతిగా లేదా ఉచితంగా ఇనుము తీసుకోకూడదు. ఎందుకంటే ఇనుము శనిదేవునికి సంబంధించిన లోహం. డబ్బు చెల్లించకుండా ఇనుము తీసుకోవడం వల్ల ఇంట్లో అశాంతి పెరుగుతుంది. మీరు ఆర్థిక‌ సమస్యను ఎదుర్కోవడం మొదలవుతుంది. సంపాదన హరించుకుపోతుంది. శని దేవుడి ఆగ్రహానికి గురి చేస్తుంది.


నూనె


తైల వాస్తు శాస్త్రం ప్రకారం, నూనెను దానంగా తీసుకోకూడదని లేదా దానమివ్వకూడదని చెబుతారు. నూనె కావాలంటే డబ్బులు ఇవ్వొచ్చు లేదా తీసుకోవచ్చు. లేదంటే ఇంట్లో అశాంతి వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఆర్థిక‌ నష్టాన్ని కూడా అనుభవిస్తారు. ముఖ్యంగా శనివారం  ఆవ నూనె తీసుకోకూడదు, ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సమస్యలు వస్తాయి. ఈ కారణంగా డబ్బు లేకుండా ఎవరి దగ్గరా నూనె తీసుకోకండి. ఇలా చేయడం వల్ల శని దేవుడు మీపై కోపగించుకోవచ్చు.


Also Read : ఆదివారం పుట్టిన వారు ఇలా చేస్తే అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది.!


పూజా సామగ్రి


పూజకు ఉపయోగించే వస్తువులను ఎవరి దగ్గరా ఉచితంగా తీసుకోకూడదని, ఇవ్వకూడదని మత విశ్వాసం. ఇలా చేయడం వల్ల పూజకు తగిన ఫలం లభించదు. ఈ పూజను భ‌గ‌వంతుడు కూడా ఆమోదించడు. అంతేకాదు ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డి, కుటుంబంలో వ్య‌క్తులు ఒత్తిడితో కూడిన జీవితం అనుభ‌వించాల్సి వ‌స్తుంది.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.