Sunday Tips: శాస్త్రం ప్రకారం ఆదివారం జన్మించిన వ్యక్తిపై సూర్య భగవానుడి అనుగ్రహం ఉంటుంది.  ధైర్యసాహసాలు కలిగి ఉంటారు. అందుకే, ప్రతి రంగంలోనూ విజయ‌ బావుటా ఎగురవేస్తారు. ఆదివారం అందరికీ చాలా ప్రత్యేకమైన రోజు. ముఖ్యంగా ఆదివారం జన్మించినవారు ఇలా చేస్తే అదృష్టం మరింత ప్రకాశిస్తుందని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు


ఆదివారం పుట్టిన వారు ఇలా చేస్తే అదృష్టమే


- ఆదివారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్య భగవానుని తప్పకుండా దర్శించుకోండి


Also Read : ఆదివారం సూర్యునికి అర్ఘ్యం సమర్పించ‌డం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా?


- ఈ రోజున సూర్య భగవానుని పూజించండి, సూర్య మంత్రాలను జపించండి.


- ఈ రోజు సూర్త త్రతక అంటే ఉదయించే సూర్యుడిని రెప్పవేయకుండా చూడండి.


- ఆదివారాలలో ఎరుపు, బంగారం, నారింజ రంగు దుస్తులు, ఆభ‌ర‌ణాలను ధరించండి.


- ఈ రోజు ఎవరితోనూ కోపంగా ఉండకండి.


అబద్ధం చెప్పకండి


- అబద్ధం చెప్పడం వల్ల సమాజంలో మీ గౌరవం, ప్రతిష్ఠ‌ చెడిపోతుంది.
- బెల్లం, ఎర్రటి వస్త్రం, గోధుమలు, ఎర్రటి పువ్వులను దానం చేయండి.
- ఆదిత్య హృదయం పఠించండి.


ఆదివారం పుట్టిన వారు ఈ పనులు చేయాలి


- సూర్యుడిని గ్రహాలకు అధిప‌తిగా పిలుస్తారు. ఈ కారణంగా సూర్యుని అనుగ్రహం పొందిన వ్యక్తులు జీవితంలో చాలా పురోగతిని పొందుతారు, ఆరోగ్యంగా ఉంటారు. జాతకంలో సూర్యుని స్థానం కూడా బలపడుతుంది. వారి జాతకంలో బలహీనమైన సూర్య స్థానం ఉన్నవారు ఈ రోజు సూర్య భగవానుని పూజించాలి. తరచుగా శారీరక సమస్యలతో బాధపడేవారు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆదివారం సూర్యభ‌గ‌వానుడిని పూజించాలి.


- ఐశ్వర్యం, శ్రేయస్సు కోసం, ఆదివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా నెయ్యి దీపాలను వెలిగించండి.
పురోగతి కోసం, ఈ రోజు బెల్లం, పాలు కలిపిన అన్నం తినండి.


- జాతకంలో సూర్యుని స్థానం బలపడటానికి, సమస్యల నుంచి బయటపడటానికి బెల్లం, అక్షతలను నీటిలో కలిపి పారే నీటిలో వేయాలి.


Also Read : సూర్యాస్తమయం వేళ ఇలా చేస్తే అదృష్టం మీ వెంటే!


- ఆదివారం ముఖ్యమైన పనుల‌ కోసం ఇంటి నుండి బయలుదేరే ముందు, ఆవుకి రొట్టె తినిపించండి. ఇది మీరు చేయబోయే పనిలో విజయంతో పాటు, భ‌విష్య‌త్తులో పురోగతి సాధించేలా చేస్తుంది.       


ఆదివారం పుట్టిన వారు పైన చెప్పిన పనులన్నీ ఆదివారం నాడు చేస్తే అనారోగ్య సమస్యలు తొల‌గిపోతాయి. ఉద్యోగాలలో పురోగతితో పాటు ఆర్థిక సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందుతారని విశ్వ‌సిస్తారు.


శ్లోకం
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||


Also Read: ఈ వారం ఈ రాశులవారికి లక్కు కలిసొస్తుంది - సెప్టెంబరు 4 నుంచి 10 వారఫలాలు


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.