How To Offer Arghya To Sun: మన భారతీయ వారసత్వంలో సూర్యారాధన వేదకాలం నుంచి నిరంతరం కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ సూర్య భగవానుని పూజించడం, అర్ఘ్యం ఇవ్వ‌డం, మంత్ర ప‌ఠ‌నం చాలా ముఖ్యమైనవి. మత విశ్వాసాల ప్రకారం, ప్రతిరోజూ సూర్యుడిని పూజించడం లేదా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ప్రతికూలత తొలగిపోతుంది, మనలో సానుకూల శక్తిని పెంచుతుంది.


ప్రతి ఉదయం ఇలా చేయండి
ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యోదయానికి ముందు తలస్నానం చేసి శుభ్రంగా ఉండండి. ఆ తరువాత, ఉదయించే సూర్యుని ముందు ద‌ర్భ‌తో చేసిన ఆసనాన్నిపై కూచుని, సూర్య భగవానుని స్మరిస్తూ అర్ఘ్యం సమర్పించండి.


అర్ఘ్య జలం నేలపై పడకూడదు
తెల్లవారుజామున, సూర్యోదయానికి ముందు, తూర్పు దిశలో నారింజ రంగు కిరణాలు కనిపించిన వెంటనే, రాగి పాత్రను రెండు చేతులతో పట్టుకుని, ఉదయించే సూర్యునికి అభిముఖంగా నిలబడాలి. మీరు సూర్యునికి సమర్పించే నీరు నేలపై పడకుండా చూసుకోండి. మీరు పవిత్రమైన‌ నది ఒడ్డున నిలబడి సూర్యునికి అర్ఘ్యం సమర్పించవచ్చు. ఇంట్లో ఉన్న పూల మొక్క లేదా శుభ్రమైన పాత్రపై పడేలా చేయ‌డం ద్వారా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించవచ్చు. సూర్యునికి స‌మ‌ర్పించే అర్ఘ్య జలం భూమిపై పడితే, దాని ప్రయోజనం మొత్తం వృథా అవుతుంది. కాబట్టి, అర్ఘ్యం నేరుగా నేలపై పడకూడదని గుర్తుంచుకోండి.


సూర్య మంత్రం
సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు


ఓం ఏహి సూర్య సహస్త్రాంశోం తేజోరాశే జగత్పతే| 
అనుకమ్పయే మాం భక్త్యా గృహాణార్ఘ్యం దివాకరః|| 


ఈ మంత్రాన్ని అర్ఘ్యం స‌మ‌ర్పిస్తూ కనీసం 11సార్లు జపించాలి.


దీనితో పాటు మీరు ఈ మంత్రాన్ని కూడా పఠించాలి.


ఓం హ్రీం హ్రీం సూర్యాయ, సహస్త్రకిరణాయ| 
మనోవాంచిత ఫలం దేహి దేహి స్వాహా||


అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఇలా చేయండి
సూర్యునికి అర్ఘ్యం స‌మ‌ర్పించిన‌ తర్వాత, అరచేతిలో నీటిని తీసుకొని మీ చుట్టూ చల్లుకోండి. అదే స్థలంలో 3 ప్ర‌ద‌క్షిణ‌లు చేసిన తర్వాత, ఆ స్థానంలో కూచుని సూర్య‌భ‌గ‌వానుడికి నమస్కరించాలి. ఈ విధంగా సూర్యభగవానుని ఆరాధించడం వల్ల జీవితంలో కీర్తి, విజయాలు, శ్రేయస్సు, విజయాలు లభిస్తాయి.


Also Read : సూర్యాస్తమయం తర్వాత ఇలా చేస్తే లెక్క‌లేన‌న్ని న‌ష్టాలు. ఈ ప‌నులు మీరు చేయ‌కండి


సూర్య అర్ఘ్యం ప్రయోజనం
నమ్మకం ప్రకారం, సూర్యారాధన ప్రతిరోజూ లేదా ప్రతి ఆదివారం పూర్ణ హృదయంతో చేస్తే అనేక ప్ర‌యోజ‌నాలున్నాయ‌ని గ్రంధాల్లో పేర్కొన్నారు. ఈ రోజున సూర్య భగవానుని పూజించండి. రాగి కుండలో నీళ్లు నింపి ఎర్రచందనం, కుంకుమ, అక్షత, ఎర్రపువ్వు, బెల్లం వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే సూర్యదేవుని విశేష అనుగ్రహం లభించడంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.


Also Read : వాస్తు ప్రకారం ఇంట్లో రాగిసూర్యుడిని ఉంచితే ఎన్ని ప్రయోజనాలో!






ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial