Diwali 2023: భారతదేశంలో ముఖ్యమైన పండుగ దీపావళి. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్ర‌జ‌లు ఈ పండుగ‌ జరుపుకొంటారు. దీపావళి రోజు పాటించే అత్యంత ముఖ్యమైన సంప్రదాయాలలో మట్టితో చేసిన ప్ర‌మిద‌ల‌లో  దీపాలను వెలిగించడం ఒక‌టి. ప్ర‌తి పండుగ రోజున వెలిగించవలసిన దీపాల సంఖ్య హిందూ సంప్ర‌దాయాల ప్రకారం మారుతూ ఉంటుంది. 


ధన్‌తేరస్


ధన్‌తేరస్‌లో 13 దీపాలను వెలిగించడం ఆచారం. ఈ దీపాల‌ను ఇంటి ప్రవేశద్వారం వద్ద, వంటగది, పూజ గది వంటి వివిధ ప్రదేశాలలో ఉంచాలి. ప్రతి దీపానికి ఒక ప్ర‌త్యేక అర్ధం ఉంటుంది. ఉదాహరణకు తలుపు వద్ద ఉంచిన దీపం అతిథులను స్వాగతించడంతో పాటు ఇంటికి శ్రేయస్సును సూచిస్తుంది. వంటగదిలో ఉంచిన దీపం సమృద్ధిగా ఆహారం, మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. పూజ గదిలో ఉంచిన దీపం భగవంతుని ఆరాధన, ఆశీస్సులతో పాటు మ‌న‌ కోరికను సూచిస్తుంది.


Also Read : దీపావళి రోజు పూజించాల్సిన దక్షిణావర్తి శంఖం విశిష్టత ఏంటో తెలుసా!


చోటి దీపావళి


కాళీ చౌదాస్ అని కూడా పిలుచుకునే చోటి దీపావళి నాడు, 14 దీపాలను వెలిగించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ దీపాలను అంచు చుట్టూ 11 దీపాలు, మధ్యలో నాలుగు ముఖాల దీపాలతో ఒక ప్లేట్‌లో ఉంచాలి. ముందుగా నాలుగు ముఖాల దీపాన్ని వెలిగించాలి, ఆ తర్వాత మిగిలిన 11 దీపాలను వెలిగించాలి. కొందరు వ్యక్తులు సంపన్నమైన జీవితం కోసం వారి కోరికకు ప్రతీకగా పంచదార లేదా ఇతర స్వీట్లను కూడా దీపాల‌కు జోడిస్తారు.


Also Read : దీపావళికి దీపాలు వెలిగించేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఇవే!


దీపావళి


 లక్ష్మీపూజ అని కూడా పిలిచే దీపావళి రోజున, ఇల్లు మొత్తంతో పాటు ప్రాంగణంలో అనేక దీపాలను వెలిగించ‌డం సంప్ర‌దాయంగా వ‌స్తోంది. అమావాస్య రోజు మిరుమిట్టుగొలిపే కాంతుల‌తో ప్ర‌జ‌లంతా దీపాలు వెల‌గించి, బాణాసంచా కాలుస్తూ ఆనందంగా జ‌రుపుకోవ‌డం అనాదిగా ఆచారంగా వ‌స్తోంది. ఇది ప్రకాశవంతమైన, సంపన్నమైన భవిష్యత్తు కోసం కోరికల‌ను సూచిస్తుంది. కొంతమంది దీపావళి ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడానికి వారి ఇంటి ప‌రిస‌రాలు, వారి బాల్కనీలలో దీపాలను వెలిగిస్తారు. 


Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!


ఇవి సాధారణ మార్గదర్శకాలు మాత్రమే అని గమనించాలి. దీపావళి రోజున ఎన్ని దీపాలు వెలిగించాల‌నే లెక్క ఏమీ లేదు. కొంతమంది వ్యక్తులు వారి వ్యక్తిగత ప్రాధాన్యతలు, సంప్రదాయాలను బట్టి ఎక్కువ లేదా తక్కువ దీపాలను వెలిగించవచ్చు. స్వచ్ఛమైన హృదయంతో, మంచి మ‌న‌స్సుతో హృదయపూర్వకంగా భ‌గ‌వంతుని స్మ‌రిస్తూ దీపాలను వెలిగించడం గుర్తుంచుకోవ‌ల‌సిన అత్యంత ముఖ్యమైన విషయం.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.