Datta Jayanti 2022: మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. అత్రి మహాముని, మహా పతివ్రత అనసూయల సంతానం దత్తాత్రేయడు. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి ఆయన. సత్యాన్వేషణలో భాగంగా దత్తాత్రేయుడు చిన్న వయసులోనే ఇల్లు వదిలి వెళ్లి..జీవితంలో చాలా భాగాన్ని ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లోని నర్మదా నది ప్రాంతాలలో తిరుగాడారని పండితులు చెబుతారు. ఉత్తర కర్ణాటకలో గాణ్గాపూర్ లో దత్తుడికి జ్ఞానోదయం కలిగింది. గిరినార్‌లో పర్వతాగ్రం వద్ద దత్త పాదముద్రలు ఉన్నాయంటారు. పరశురాముడిని గురించి ప్రస్తావించే త్రిపుర-రహస్య గ్రంథం గంధమాదన పర్వతం వద్ద దత్తుడు ధ్యానం చేస్తున్నట్లు పేర్కొంది. తన తండ్రి అత్రి మహర్షి ఆదేశానుసారం దత్తాత్రేయుడు గౌతమీ నది గట్టు వద్ద కూర్చుని శివుడిని ప్రార్థించాడని, చివరకు బ్రహ్మజ్ఞానం పొందాడని బ్రహ్మ పురాణం చెబుతోంది. అందుకనే, దత్తాత్రేయుడు నాథ సంప్రదాయంలో ఆది సిద్ధుడుగా చెబుతారు
అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహామునిః
తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైః ప్రముచ్యతే
Sri Dattatreya Stotram – శ్రీ దత్తాత్రేయ స్తోత్రం
జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిమ్ |
సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ||
అస్య శ్రీదత్తాత్రేయస్తోత్రమంత్రస్య భగవాన్నారదఋషిః
అనుష్టుప్ ఛందః శ్రీదత్తః పరమాత్మా దేవతా
శ్రీదత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ||
నారద ఉవాచ |
జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే |
భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||
జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ |
దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తు తే ||
కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ |
వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||
హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత |
పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||
యజ్ఞభోక్త్రే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ |
యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||
ఆదౌ బ్రహ్మా హరిర్మధ్యేఽప్యంతే దేవస్సదాశివః |
మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||
భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే |
జితేంద్రియ జితజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||
దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ |
సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోఽస్తు తే ||
జంబూద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే |
జయమాన సతాం దేవ దత్తాత్రేయ నమోఽస్తు తే ||
భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే |
నానాస్వాద్యమయీ భిక్షా దత్తాత్రేయ నమోఽస్తు తే ||
బ్రహ్మజ్ఞానమయీ ముద్రావస్త్రమాకాశభూతలే |
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||
అవధూత సదానంద పరబ్రహ్మస్వరూపిణే |
విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||
సత్యరూప సదాచార సత్యధర్మపరాయణ |
సత్యాశ్రయ పరోక్షాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||
శూలహస్త గదాపాణే వనమాలాసుకంధర |
యజ్ఞసూత్రధర బ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తు తే ||
క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ |
దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోఽస్తు తే ||
దత్తవిద్యాయ లక్ష్మీశ దత్తస్యాత్మస్వరూపిణే |
గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||
శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ |
సర్వపాపప్రశమనం దత్తాత్రేయ నమోఽస్తు తే ||
ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్ |
దత్తాత్రేయప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్ ||
ఇతి శ్రీనారదపురాణే నారదవిరచితం శ్రీ దత్తాత్రేయ స్తోత్రమ్ |
Also Read: అనసూయ మహా పతివ్రత ఎందుకంటే!
Sri Datta Ashtakam – శ్రీ దత్తాష్టకం
గురుమూర్తిం చిదాకాశం సచ్చిదానందవిగ్రహం |
నిర్వికల్పం నిరాబాధం దత్తమానందమాశ్రయే ||
యోగాతీతం గుణాతీతం సర్వరక్షాకరం విభుం |
సర్వదుఃఖహరం దేవం దత్తమానందమాశ్రయే ||
అవధూతం సదాధ్యానం ఔదుంబరసుశోభితం |
అనఘాప్రియా విభుం దేవం దత్తమానందమాశ్రయే ||
నిరాకారం నిరాభాసం బ్రహ్మవిష్ణుశివాత్మకం |
నిర్గుణం నిష్కళం శాంతం దత్తమానందమాశ్రయే ||
అనసూయాసుతం దేవం అత్రివంశకులోద్భవం |
దిగంబరం మహాతేజం దత్తమానందమాశ్రయే ||
సహ్యాద్రివాసినం దత్తం ఆత్మజ్ఞానప్రదాయకం |
అఖండమండలాకారం దత్తమానందమాశ్రయే ||
పంచయజ్ఞప్రియం దేవం పంచరూపసుశోభితం |
గురుపరంపరం వందే దత్తమానందమాశ్రయే ||
దత్తమానందాష్టకం యః పఠేత్ సర్వవిద్యా జయం లభేత్ |
దత్తానుగ్రహఫలం ప్రాప్తం దత్తమానందమాశ్రయే ||
ఫలశ్రుతి –
ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః
సర్వసిద్ధిమవాప్నోతి శ్రీదత్తశ్శరణం మమ ||
Also Read: చెడు పనులు చేస్తే బొగ్గు - మంచి పనులు చేస్తే బహుమతి, ఆ దేశంలో శాంటాక్లాజ్ బదులు మంత్రగత్తె