Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతితో ప్ర‌పంచ ప్రసిద్ధి చెందాడు. ఆచార్య చాణక్యుడు భారతదేశంలోని గొప్ప పండితులలో ఒకడిగా పేరొందాడు. నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త, దౌత్యవేత్త, వ్యూహకర్త మాత్రమే కాకుండా, అతను ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు. జీవితంలోని ఎన్నో సమస్యల నుంచి బయటపడటానికి చాణక్యుడు సూచించిన నియ‌మాల‌ను అనుసరించే వారెందరో. వ్యక్తిగత జీవితం నుంచి పని, వ్యాపారం, మాన‌వ‌ సంబంధాల వరకు అన్ని అంశాలపై స్ప‌ష్ట‌త‌నిస్తుంది. మన జీవితంలో చాణక్యుడి సూత్రాలను అనుసరించడం ద్వారా మనం అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. జీవితంలో పురోగతితో పాటు విజయం సాధించాలంటే మనం కొన్ని నియమాలను పాటించాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మీరు కూడా జీవితంలో చాలా పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించాలనుకుంటే, ఈ నియ‌మాలు పాటించండి.


మీ సమస్యలు పంచుకోవ‌ద్దు


జీవితంలో పురోగతి సాధించాలని, డబ్బు సంపాదించాలని కోరుకునే వ్యక్తి తన సమస్యలను లేదా బాధలను ఇతరులతో పంచుకోకూడదని ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు. మీరు మీ సమస్యలను ఇతరులతో పంచుకున్నప్పుడు, వారు వాటిని మరింత తీవ్రతరం చేయవచ్చు.


Also Read : చాణ‌క్య నీతి ప్ర‌కారం మీ బంధం ప‌దిలంగా ఉండాలంటే ఈ విషయాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి.!


జ్ఞానుల సహ‌వాసం


చాణక్య నీతి ప్రకారం, మనం పురోగతి సాధించాలంటే లేదా విజయవంతమైన వ్యక్తిగా మారాలంటే, మనం మొదట జ్ఞానులతో సహవాసం చేయాలి. మీరు అజ్ఞానులతో లేదా మూర్ఖులతో ఎప్పుడూ సహవాసం చేయకూడదు. అలాంటి వారితో సహవాసం చేయడం ద్వారా మీరు మీ జ్ఞానాన్ని పెంచుకునే బదులు కోల్పోతారు.


అలాంటి వారిని నమ్మవద్దు


చాణక్య నీతి ప్రకారం, ఇతరులను విశ్వసించే ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిది కాకుండా వేరే ప్రపంచంలో ఉన్న వ్యక్తిని ఎప్పుడూ నమ్మవద్దు లేదా సరిగ్గా అంచ‌నా వేయ‌కుండా వారిని విశ్వ‌సించ‌కండి. అలాంటి వారు మీరు చెప్పిన దానిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అన్య‌మ‌న‌స్కంగా వినడం ద్వారా, ఇతరులకు మ‌రో విధంగా చెప్పడం ద్వారా మీకు సమస్యలను కలిగించవచ్చు.


మితిమీరిన అంచ‌నాలు


ఇతరులపై మితిమీరిన అంచనాలు పెట్టుకోవడం మంచిది కాదని చాణక్య నీతిలో పేర్కొన్నారు. అతిగా అనుబంధం పెంచుకోవ‌డం కూడా తప్పు అని హెచ్చ‌రించాడు. సంబంధాలు ఎప్పుడు అర్థాన్ని కోల్పోతాయో చెప్పడం కష్టం. ఈ సమయంలో మంచి సంబంధం మరొక క్షణంలో దాని అర్ధాన్ని కోల్పోవచ్చు.


Also Read : చాణ‌క్య నీతి ప్ర‌కారం మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇలా చేయండి


ఖర్చుపై పరిమితులు


సంపాదించిన డబ్బును కూడబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. మీ ఖర్చులు మీ ఆదాయానికి సమానంగా లేదా మించకూడదు. ఖ‌ర్చు ఎల్లప్పుడూ సరైన మార్గంలో మాత్రమే చేయాలి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.