అక్టోబరు 30 రాశిఫలాలు


మేష రాశి


ఈ రాశివారికి చేపట్టిన పనిపై ఉత్సాహం పెరుగుతుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి ధనం పొందుతారు. మేధోపరమైన పని నుంచి సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.


వృషభ రాశి


ఈ రాశివారికి ఓర్పు తగ్గుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. వ్యాపారులకు మాత్రం ఇది శుభసమయం. స్నేహితుల సహకారంతో వ్యాపారం విస్తరించే ప్రణాళిక వేసుకుంటారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. 


మిథున రాశి


ఆత్మవిశ్వాసం తగ్గుతుంది కానీ ప్రశాంతంగా ఉండండి. రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాల నిర్వహణపై చర్చించుకుంటారు. మేధోపరమైన పని నష్టానికి దారితీయవచ్చు. కళలు, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది.


Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!


కర్కాటక రాశి


మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మితిమీరిన కోపం తగ్గించుకోవాలి. కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు. మీరు కుటుంబంలోని పెద్దల నుంచి ఆర్థిక ప్రయోజనం పొందుతారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న డబ్బు కూడా చేతికందే అవకాశం ఉంది. ఉద్యోగులు పై అధికారుల నుంచి మద్దతు పొందుతారు. 


సింహ రాశి


ఈ రాశి విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశాలు ఉంటాయి, ఆస్తులు విస్తరించవచ్చు. వాహన నిర్వహణపై ఖర్చులు పెరగవచ్చు. పోటీ పరీక్షలలో విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు. ఉద్యోగం మారే పరిస్థితులు ఎదురుకావొచ్చు.


Also Read: అట్ల తదియ - వివాహితులకే కాదు పెళ్లికానివారికీ ప్రత్యేకమే!


కన్యా రాశి


వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతమవుతాయి. తోబుట్టువుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు ఉంటాయి, అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పుతో మరొక ప్రదేశానికి మారవలసి ఉంటుంది. ఎగుమతి-దిగుమతుల వ్యాపారంలో లాభ అవకాశాలు ఉంటాయి. వాహన ఆనందం పెరుగుతుంది. 


తులా రాశి


ఈ రాశివారు అధిక కోపాన్ని తగ్గించుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. అనుకోని బహుమతులు అందుకుంటారు. తండ్రి నుంచి ధనలాభం ఉంటుంది. పై అధికారులతో విభేదాలు ఉండొచ్చు..సంయమనం పాటించాలి. 


వృశ్చిక రాశి


ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కానీ మనసులో ప్రతికూల ఆలోచన ప్రభావం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. విద్యార్థులకు చదువులపై ఆసక్తి పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి మద్దతు ఉంటుంది. తొందరగా అలసిపోతారు.


Also Read: నవంబరు 12 or 13 - దీపావళి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి!


ధనుస్సు రాశి


ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు తప్పదు. వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావొచ్చు. కుటుంబం నుంచి సహకారం లభిస్తుంది. ఏదో అసౌకర్యంగా అనిపిస్తుంది. 


మకర రాశి


ఈ రాశివారు అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే మీకు ఇదే సరైన సమయం. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కుటుంబానికి సమయం కేటాయించాలి. 


కుంభ రాశి


మనస్సులో సంతోషకరమైన అనుభూతులు ఉంటాయి. అధిక కోపాన్ని నివారించండి. తల్లితో విభేదాలు ఉండవచ్చు. ఉద్యోగంలో మరొక ప్రదేశానికి బదిలీ జరిగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది.  అధికారుల నుంచి మద్దతు పొందుతారు.కుటుంబానికి సంబంధించి ఏదో ఆందోళన వెంటాడుతుంది.


మీన రాశి


ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది కానీ సన్నిహితులు, కుటుంబ సభ్యుల మద్దతుతో కొంత ధైర్యంగా ఉంటారు. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. పాత స్నేహితుల సహాయంతో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంభాషణలలో సంయమనం పాటించండి, ఖర్చులు పెరుగుతాయి. బహుమతులు పొందవచ్చు.