Chanakya Niti tips for self-protection: ఆచార్య చాణక్యుడు గొప్ప వ్యక్తి, సలహాదారు, వ్యూహకర్త, ఉపాధ్యాయుడు, ఆర్థికవేత్త, రాజకీయవేత్త. అతని జ్ఞానం, సామర్థ్యాలు భారతదేశ చరిత్రను మార్చాయి. మానవ సంక్షేమం కోసం చాణక్యుడు తన విధానంలో అనేక ఆలోచనలు ఇచ్చాడు. అవి నేటికీ ఆచరణీయంగా ఉంటూ కొనసాగుతున్నాయి. మీరు ఈ సూత్రాలను పాటించినట్లయితే మిమ్మల్ని విజయం సాధించకుండా ఎవరూ ఆపలేరు. అంతే కాదు, ఆయన సూచించిన ఈ నియమాలను అవలంబించడం ద్వారా మనం రోజువారీ జీవితంలో అనుభవిస్తున్న అన్ని కష్టాల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. మనల్ని మనం రక్షించుకోవడానికి చాణక్యుడు ఎలాంటి సూత్రాలు ప్రతిపాదించాడో తెలుసా.?
మీ ప్రసంగం మధురంగా ఉండాలి
చాణక్యుడి సిద్ధాంతం ప్రకారం, ప్రసంగం మధురంగా ఉండే వ్యక్తి జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగలడు. మధురమైన మాటలు లేని వ్యక్తి ప్రతిభ ఉన్నా విజయం సాధించడం కష్టమే.
Also Read : మీ జీవితం నుంచి ఈ 3 సమస్యలు తొలగించగలిగితేనే విజయం సాధిస్తారు
డబ్బును ఎప్పుడూ విస్మరించవద్దు
చాణక్యుడి విధానం ప్రకారం, ఏ వ్యక్తీ తన ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులకు చెప్పకూడదు. మీరు చాలా డబ్బు సంపాదించి ఉంటే లేదా ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లయితే, అలాంటి ఆలోచనలను మీలోనే ఉంచుకోండి. పొరపాటున కూడా ఇతరులతో పంచుకోవద్దు. ఇది మీకు మరిన్ని సమస్యలను కలిగిస్తుంది.
ఈ తప్పు చేయవద్దు
కెరీర్‌లో విజయాల మెట్లు ఎక్కాలంటే.. మీ ప్రణాళికలను ఎప్పుడూ గోప్యంగా ఉంచాలని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే మీరు మీ భవిష్యత్ ప్రణాళికల గురించి ఎవరికైనా చెబితే, వారు అవి సాకారం కాకుండా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయవచ్చు. దీనివల్ల మీరు విజయం సాధించలేకపోవచ్చు.
ఎల్లప్పుడూ ఓపికతో పని చేయండి
ఏది జరిగినా సహనం కోల్పోకూడదని చాణక్యుడు చెప్పాడు. అలాగే, ఎల్లప్పుడూ మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవాలి. మనం ఏమీ చేయలేము అని అనుకుంటే, మనం చేయలేము. ఈ పని మనతోనే జరుగుతుందని సానుకూలంగా ఉన్నప్పుడు, అది ఖచ్చితంగా పూర్తవుతుంది.
ఎక్కువ ఖర్చు పెట్టకండి
చాణక్య విధానం ప్రకారం, ప్రతి వ్యక్తి డబ్బును పొదుపు చేయాలి. ఎందుకంటే సంక్షోభ సమయాల్లో, డబ్బు మీకు విలువైన మిత్రుడిగా పనిచేస్తుంది. చేతిలో డబ్బు లేదని చెప్పుకొని బాధపడే బదులు వీలైనంత ఎక్కువ పొదుపు చేసేందుకు ప్రయత్నించండి.
Also Read : మీరు ఇలా ఉంటే ఆనందం మీ సొంతం, కష్టం అనేదే దరి చేరదు!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.