Chanakya Niti In Telugu: స్వర్ణయుగంలో తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, ఆచార్యునిగా మన్ననలు అందుకున్న వ్యక్తి చాణక్యుడు. కౌటిల్యుడు రచించిన రాజనీతి గ్రంథం అర్థశాస్త్రంగా ప్రసిద్ధి చెందింది.  గుప్తల కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఆ కాలానికి చెందిన చాణక్యుడు తన అసమాన ప్రతిభాపాటవాలతో గుప్త సామ్రాజ్యంలో సుస్థిర పాలనకు బీజం వేశాడు. తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, ఆచార్యునిగా మన్ననలు అందుకున్నాడు. ఈయన రచించిన రాజనీతి గ్రంథమైన అర్థశాస్త్రం ప్రస్తుత సమకాలీన రాజకీయాలకు అద్దం పడుతోంది. భారతీయ ఆర్థశాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన చాణక్యుడు రాజనీతి, అర్థశాస్త్రాలను ఆకళింపు చేసుకున్నాడు. కేవలం రాజనీతి, అర్థశాస్త్రం గురించి మాత్రమే కాకుండా మనిషిగా బతికేందుకు ఎన్నో విషయాలు బోధించాడు చాణక్యుడు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతిబంధకాలను ఎలా దాటాలో కూడా సూచించాడు. ఆనాడు ఆయ‌న‌ చెప్పిన విష‌యాలు ఈనాడు మన జీవితాల‌కు సరిగా సరిపోతున్నాయి. ఆయ‌న‌ సూచనలు, సలహాలు మన జీవన మార్గానికి బాసటగా నిలుస్తున్నాయి. జీవితంలో మనం ఎలా ముందుకెళ్లాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఎలా నడుచుకోవాలో చాణ‌క్యుడు చ‌క్క‌గా వివరించాడు. లక్ష్యాన్ని సాధించేందుకు సిద్ధంగా ఉన్నవారే ఖచ్చితంగా విజయం సాధిస్తారని చాణక్యుడు చెప్పాడు. రోజూ ఉదయం లేచిన తర్వాత చాణక్యుడు చెప్పిన ఈ 5 పనులు చేస్తే విజయం మీ సొంత‌మ‌వుతుంది.


Also Read: మీ అనారోగ్య సమస్యలను నిర్ణయించేది మీ రాశిచక్రమే - ఏ రాశివారికి ఎలాంటి వ్యాధులొస్తాయి!


సూర్యోద‌యానికి ముందే లేవండి


మీరు మీ లక్ష్యాన్ని సాధించాలనుకుంటే, 24 గంటల్లో ఒక్క క్షణం కూడా వృధా చేయకండి. ఇందులో మొదట చేయాల్సింది తొందరగా నిద్రలేవడం.  అంటే మరో ఐదు నిముషాలు మరో ఐదు నిముషాలు అంటూ...ఆలస్యంగా నిద్రలేవకుండా ఉండడం. సూర్యోదయానికి ముందే బ్రహ్మ మహూర్తంలో నిద్రలేవడం వల్ల..ఆ రోజు ఏఏ పనులు చేయాలి అనుకున్నారో అవన్నీ సకాలంలో చేయగలుగుతారు.


ప్రణాళిక ప్ర‌కారం ప‌ని చేయండి


సమయానికి నిద్రలేవడం ఎంత ముఖ్యమో... ఆ సయమాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్లాన్ చేసుకోడం మరింత ముఖ్యం. ఒక్క నిముష కూడా వృథా చేయకూడా, సోమరితనం దరి చేరనీయకుండా....రోజంతా పని చేయాలని చాణక్యుడు చెప్పాడు. రోజంతా ప్రణాళిక ప్రకారం పని చేసే వారు విజయ సాధనలో మొదటి అవరోధాన్ని దాటుతారు.


Also Read: ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు


ఏ రోజు పని ఆ రోజే చేయండి


పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందవచ్చు, కానీ గడిచిన‌ కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రాదు. అందువ‌ల్ల ఈ రోజు చేయ‌ల్సిన‌ పనిని రేపటికి వాయిదా వేయకూడ‌ద‌ని చాణ‌క్యుడు సూచించాడు. మీరు సమయాన్ని గౌరవిస్తేనే ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు.


ఆహారం


ప్ర‌స్తుతం ఉరుకుల ప‌రుగుల‌ జీవితంలో, తాము తీసుకునే ఆహారం, పానీయాల పట్ల మాన‌వుల్లో శ్రద్ధ తగ్గింది. అయితే స‌రైన‌ సమయానికి బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన‌ మంచి పోషకాలున్న‌ ఆహారం తీసుకుంటే  ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటాడని చాణక్యుడు చెప్పాడు. ఫ‌లితంగా రెట్టించిన‌ ఉత్సాహంతో విజయం వైపు పయనిస్తార‌ని తెలిపాడు.


ఆరోగ్యంపై దృష్టి పెట్టండి


శరీరం అనారోగ్యంగా ఉంటే ఏ లక్ష్యం నెరవేరదు. మీరు కలలను అర్థవంతం చేయాలనుకుంటే, ప్రతిరోజూ ఉదయం యోగా, వ్యాయామం కోసం కొంత సమయం కేటాయించండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే పూర్తి శక్తితో పని చేయగలుగుతారు. పనిచేయడం, కాసులు సంపాదనే ముఖ్యం అనుకుంటే కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోలేరని చాణక్యుడు హెచ్చరించాడు....