Chanakya Niti: చాణక్యుడు తన చాణక్య నీతి ద్వారా సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం పాటించాల్సిన ఎన్నో నియమాలు వెల్లడించారు. హిందూ వివాహ సంప్రదాయంలో వివాహ సమయంలో వధువు నుంచి కొన్ని వాగ్దానాలు తీసుకుంటారు. పెళ్లికూతురు నుంచే కాకుండా వరుడి నుంచి కూడా కొన్ని వాగ్దానాలు తీసుకోవడం ఆనవాయితీ. వధువు నుంచి తీసుకోవలసిన కొన్ని వాగ్దానాలను పేర్కొన్నాడు. భర్త అనుమతి లేకుండా ఈ 4 ప్రాంతాలకు వెళ్లకూడదని పెళ్లి సమయంలో పెళ్లికూతురుతో వాగ్దానం చేయిస్తారు.
భర్త అనుమతి లేకుండా భార్య ఏ ప్రదేశాలకు వెళ్లకూడదు..?
పెళ్లయ్యాక భార్య బాధ్యత అంతా భర్తదే. అందుకే భర్త అనుమతి లేకుండా భార్య ఇతరుల తోటలకు, తాగుబోతులు ఉండే ప్రాంతాలకు, తండ్రి ఇంటికి, రాజుల ఇళ్లకు వెళ్లకూడదని చెబుతారు. అనుమతి లేకుండా ఈ ప్రాంతాలకు వెళ్లకూడదని చెప్పడం వెనుక కారణమేంటి..?
Also Read : చాణక్య నీతి ప్రకారం మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇలా చేయండి
1. తోటలకు ఎందుకు వెళ్లకూడదు..?
భర్తకు చెప్పకుండా భార్య వేరొకరి తోటకు వెళ్లడం సరికాదు. వివాహ సమయంలో భార్య నుంచి ఈ మేరకు వాగ్దానం తీసుకుంటామని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే భర్త అవమానాన్ని ఎదుర్కోవచ్చు, లేదా భార్యకు హాని కలగవచ్చు. అందువల్ల ఈ మొదటి నియమాన్ని పాటిస్తే భార్యాభర్తల భవిష్యత్తు బాగుంటుంది.
2. తాగుబోతులు ఉండే దారిలో ఎందుకు వెళ్లకూడదు..?
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో భార్య తాగుబోతులు ఉన్న ప్రదేశాలకు లేదా మద్యం సేవించే ప్రదేశాలకు వెళ్లకూడదని పేర్కొన్నాడు. మద్యం సేవించే ప్రాంతాలకే కాకుండా కూర్చుని మద్యం సేవించే ప్రాంతాలకు కూడా వెళ్లకూడదని స్పష్టంచేశాడు. ఆ ప్రాంతాల్లో ఆమెకు హాని కలిగే ప్రమాదం ఉంది కాబట్టి భర్తకు తెలియకుండా, అతని అనుమతి లేకుండా భార్య వెళ్లకూడదని చాణక్యుడు హెచ్చరించాడు.
3. రాజుగారి ఇంటికి ఎందుకు వెళ్లకూడదు.?
రాజు ఇంటికి అంటే అధికారం కలిగిన వాడు. అలాంటి వారి ఇంటికి లేదా ఓ నాయకుడి ఇంటికి భార్య ఒంటరిగా వెళ్లకూడదని చాణక్యుడు వెల్లడించాడు. అంత పెద్ద ఇంట్లో చాలా మంది ఉంటారు. అలాంటి ప్రాంతాలకు, స్త్రీ ఒంటరిగా వెళ్లకూడదు. ఇది ఆమె ప్రతిష్ఠను కూడా దెబ్బతీస్తుంది. అందువల్ల భర్త అనుమతి లేకుండా లేదా అతని తోడు లేకుండా రాజులు, నాయకుల నివాసాలకు భార్య వెళ్లకూడదని చాణక్యుడు చెప్పాడు.
4. తండ్రి ఇంటికి ఎందుకు వెళ్లకూడదు.?
పెళ్లయిన తర్వాత భర్త అనుమతి లేకుండా తన తండ్రి ఇంటికి కూడా వెళ్లకూడదని చాణక్యుడు చెప్పాడు. భర్త అనుమతి లేకుండా భార్య తండ్రి ఇంటికి వెళితే, ఆమె అవమానానికి గురవుతుంది. అంతేకాకుండా ఇది వారి వైవాహిక జీవితంపై కూడా దుష్ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు: పరమశివుని భార్య సతీదేవి, శివుని అనుమతి లేకుండా తన తండ్రి దక్ష మహారాజు చేసిన యాగానికి వెళుతుంది. ఆ సమయంలో సతీదేవి అవమానానికి గురై ప్రాణత్యాగం చేసుకుంది. .
Also Read : మీ జీవితం నుంచి ఈ 3 సమస్యలు తొలగించగలిగితేనే విజయం సాధిస్తారు
పై కారణాల వల్ల స్త్రీ తన భర్త అనుమతి లేకుండా కొన్ని ప్రదేశాలకు వెళ్లకూడదని ఆచార్య చాణక్యుడు స్పష్టంచేశాడు.