Matrugaya Tirth Place : గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కి దాదాపు 114 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దపూర్ నే మాతృగయ అంటారు. శ్రీ కర్ధమఋషి, దేవహూతి పుణ్యదంపతులు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శ్రీమన్నారాయణుడిని ప్రశన్నం చేసుకుని ఆయన్నే పుత్రుడిగా పొందాలనే వరం కోరుకుంటారు. శ్రీ మహావిష్ణువే స్వయంగా కపిలమహర్షిగా జన్మిస్తాడు. అలా కపిలమహర్షి జన్మించిన నాలుగేళ్లకు తల్లికి ఉపదేశం చేసి వైకుంఠానికి మార్గం చూపిస్తాడు. ఈ సమయంలో ఉపదేశించినదే కపిల గీత.
దేవహూతి...నాయనా నారాయణా నువ్వు సర్వేశ్వరుడవు, మాకు వైకుంఠ ప్రాప్తి కల్పించావు. మరి ఈ లోకంలో ఉన్న సామాన్య తల్లులకు ఏ విధంగా కలుగుతుందని ప్రశ్నిస్తుంది. ఏ కుమారుడు అయితే బిందు సరోవరంలో స్నానమాచరించి...తల్లికి పిండ ప్రదానం చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరం ఇస్తాడు. ఆ తర్వాత పరశురాముడు తన తల్లి రేణుకాదేవికి ఇక్కడ పిండప్రదానం చేశాడు. దధీచి మహర్షి తన అస్తికలను ఇంద్రుడికి సమర్పించిన ప్రదేశం కూడా ఇదే అంటారు. బుగ్వేదంలోనూ ఈ పుణ్యప్రదేశం ప్రస్తావన ఉంది. సిద్దపూర్ లో కర్ధమ మహర్షి , దేవహూతి మాత... విష్ణుస్వరూపుడైన కపిల మహర్షితో పాటు సాక్షిభగవానుడి విగ్రహాలు చూడొచ్చు.
మాతృవియోగం పొందినవారు ఇక్కడ పిండం పెట్టాలి అనుకుంటే...కొందరు 20, మరికొందరు 27 పిండాలు పెట్టిస్తారు. తొమ్మిది నెలలు మోసినందుకు , కన్నందుకు, వివిధ సందర్భాల్లో పిల్లలు చేసిన తప్పులు క్షమించినందుకు కృతజ్ఞతలు చెబుతూ ఇన్ని పిండాలు పెడతారు. కేవలం తల్లికి మాత్రమే శ్రాద్ధ కర్మలు నిర్వహించే ప్రదేశం ఇదే. ఈ క్షేత్రంలో పురుషులు మాత్రమే కాదు.. మాతృవియోగం పొందిన స్త్రీలు కూడా కర్మకాండలు నిర్వహిస్తారు.
సిద్దపూర్ ని ముక్తిధామ్ అని పిలుస్తారు. చుట్టుపక్కల దాదాపు 85 గ్రామాల్లో ఎవరు మరణించినా ఇక్కడికి తీసుకొచ్చి అగ్ని సంస్కారాలు నిర్వహిస్తారు. ఇక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం. మరణించిన వారి అస్తికలను ఇక్కడ సరస్వతి నదిలో కలుపుతారు. ఇక్కడ ఉంటే స్మశానాన్ని గంధర్వ స్మశానం అంటారు. ఉజ్జయిని, కాశీ, ప్రయాగలో కూడా ఇలాంటి ముక్తి ధామ్ ఉంది.
ఇక్కడ కపిల, దేవహుతి, కర్దమ మహర్షి శివ, పార్వతి, గణపతి ఆలయాలతో పాటూ ఈ దగ్గర్లోనే సత్యనారాయణ మందిరం, శ్రీకృష్ణ ఆలయం, బాలాజీ మందిరం సహా ఇంకా చిన్న చిన్న ఆలయాలను దర్శించుకోవచ్చు..
సరస్వతి నది పుష్కరాలు (Saraswati Pushkaralu 2025) మే 15న ప్రారంభమయ్యాయి..మే 26 వరకూ జరగనున్నాయి. పుష్కర స్నానం ఆచరించేందుకు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లాకన్నా..గంగా సరస్వతి నదుల సంగమ ప్రదేశం అయిన గుజరాత్ అహ్మదాబాద్ సమీపంలో ఉన్న సిద్దపూర్ లో పవిత్ర స్నానం చేయడం అత్తుత్తమం.
పాకిస్థాన్ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!
కాళేశ్వరంలో 12 ప్రత్యేకతలు.. సరస్వతి పుష్కరాలకు వెళ్లేవారు ఇవి మిస్సవకండి