MP BJP Leader Booked: మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత మనోహర్ లాల్ ధాకడ్‌కు సంబంధించిన ఒక వివాదాస్పద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఈ వీడియో మే 13, 2025 రాత్రి ఢిల్లీ-ముంబై 8-లేన్ ఎక్స్‌ప్రెస్‌వేపై సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.  ఈ వీడియోలో మనోహర్ లాల్ ధాకడ్ ఒక మహిళతో కలిసి అభ్యంతరకర పనులు చేస్తూ   ఒక తెల్లని బాలెనో కారు (MP14CC4782) వద్ద  కనిపించారు. 

 ఈ ఫుటేజ్ హై-సెక్యూరిటీ సీసీటీవీ కెమెరాలో  రికార్డు అయింది.   సోషల్ మీడియా లీక్ అయిన వెంటనే వైరల్ అయింది.  ఈ వీడియో వైరల్ కావడంతో, మందసౌర్ జిల్లాలోని భాన్‌పురా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.  మనోహర్ లాల్ ధాకడ్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్‌లు 296, 285, మరియు 3(5) కింద కేసు నమోదు  చేశారు.  ఆ మహిళ ఎవరో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

కారు నంబర్ ప్లేట్ ఆధారంగా వాహనం మనోహర్ లాల్ ధాకడ్ పేరిటే్ నమోదైనట్లు గుర్తించారు.  వీడియో వైరల్ అయిన తర్వాత ధాకడ్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు.  మందసౌర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ దీక్షిత్, మనోహర్ లాల్ ధాకడ్ బీజేపీ సభ్యుడు కాదని స్పష్టం చేశారు. ఆయనకేం పదవి లేదని..  కేవలం ఆన్‌లైన్ ద్వారా సభ్యత్వం తీసుకున్న వ్యక్తి కావచ్చని పేర్కొన్నారు. వీడియోపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తరవాత  ధాకడ్ మహాసభ యువ సంఘం మనోహర్ లాల్ ధాకడ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుండి తక్షణమే తొలగించింది. ఈ నిర్ణయం సంస్థ అధ్యక్షుడు డాక్టర్ అర్జున్ ధాకడ్ తీసుకున్నారు, ఈ వివాదం నుండి సంస్థను దూరం చేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.