Happy Bathukamma 2022 Greetings: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో  ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఈ పండుగ. అంటు వ్యాధులు, కరువు కాటకాల బారినుంచి ప్రజల్ని కాపాడాలని ప్రార్థిస్తూ ప్రకృతి గౌరిని ఆటపాటలతో పూజించే వేడుకే ఇది. ప్రకృతిలో లభించే ప్రతీ పూవును ఏరికోరి బతుకమ్మలను తయారు చేయడం, వాటిని ఇంటి ముందు, వీధుల్లో, ఆలయాల ముందు ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ ఆడిపాడడం ఎంతో ఆనందాన్నిస్తుంది. గుమ్మడి పూలలోని పసుపు వర్ణంలో ఉన్న దిద్దుని గౌరీ దేవిగా భావిం చి అందులో పసుపు గౌరమ్మను నిల్పి  ముస్తాబు చేస్తారు. మహిళలు, పిల్లలు అనే వయోబేధం లేకుండా ఆడిపాడుతారు.తెలంగాణ పల్లె పల్లెల్లో జరుపుకునే ఈ పండుగ ఇప్పుడు ఎల్లలు దాటి దేశ విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు. అక్టోబరు 3 సోమవారం రోజు సద్దుల బతుకమ్మతో ఈ వేడుక ముగుస్తుంది...ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పేందుకు కొన్ని కొటేషన్స్..

Also Read: మీ బంధుమిత్రులకు దసరా శుభాకాంక్షలు చెప్పేయండిలా!

1.తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

2.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా పూజలను పూజిస్తూ బతుకమ్మ జరుపుకుంటున్న మహిళలకు పండుగ శభాకాంక్షలు

3.అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే బతుకమ్మ పండుగ వేళ మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

4.తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

5.తెలంగాణ ఆచార సంప్రదాయలకు ప్రతీకమన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చూపే పూల వేడుకబతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

6.తీరొక్క పూలతో తీర్చిదిద్ది ఆటపాటలు, కోలాటాలుఅవధుల్లేని ఆనందంతో జరుపుకునేసద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే

7.ఆడపడుచుల ఆకుపచ్చని సంబంరంపల్లెకు కొత్తఅందాన్ని తీసుకొచ్చే పూల వైభవంబతుకమ్మ పండుగ శుభాకాలంక్షలు

8.ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునేఉమ్మెత్త పువ్వొప్పునే గౌరమ్మ ఉమ్మెత్త కాయప్పునేసద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

9.రామ రామ నంది ఉయ్యాలో రాగమేత్తరాదు ఉయ్యాలో..నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో నేలవన్నేకాడ ఉయ్యాలో..పాపిటలో చంద్రుడా ఉయ్యాలో బలాకుమరుడా ఉయ్యాలో..తెలంగాణ ఆటపాటల పండుగ బతుకమ్మ శుభాకాంక్షలు

10. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..బంగారు బతుకమ్మ ఉయ్యాలోతెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

11. తంగేడు పూల సందమామ..మల్లెన్నడు వస్తావు.. సందమామ..గునుగు పూల సందమామ..బతుకమ్మ పోతుంది.. సందమామ..మీకు మీ కుటుంబ సభ్యులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

12. ఉసికెలో పుట్టే గౌరమ్మ..ఉసికెలో పెరిగే గౌరమ్మ..కుంకుమలో పుట్టే గౌరమ్మ..కుంకుమలో పెరిగే గౌరమ్మ..పసుపులో పుట్టే గౌరమ్మ..పసుపులో పెరిగే గౌరమ్మ..మీ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

బతుకమ్మ పండుగ చివరి రోజు ఆఖరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు. బతుకమ్మలను సాధారణ రోజుల కంటే పెద్ద పరిమాణంలో తయారు చేసి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగను దుర్గా అష్టమి రోజు జరుపుకుంటారు.