సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్-2022 పరీక్ష ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ కీ చూసుకోవచ్చు. అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు ప్రశ్నపత్రాలను కూడా అందుబాటులో ఉంచారు.


కీపై అభ్యంతరాలకు అవకాశం:
సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్-2022 పరీక్ష ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే అక్టోబరు 3 రాత్రి 11.50 లోపు తెలపవచ్చు. అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఇంకా ఏమైనా సందేహాలుంటే ఫోన్: 011- 40759000 లేదా ఈమెయిల్: csirnet@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు. 


CSIR-UGC NET ఆన్సర్ కీ, అభ్యంతరాలు తెలిపేందుకు క్లిక్ చేయండి...



నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సెప్టెంబరు 16 నుంచి 18 వరకు ఆన్‌లైన్ విధానంలో జాయింట్ సెంట్రల్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్-యూనివర్సిటీగ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CSIR-UGC NET, June 2022)ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 166 నగరాల్లో 338 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 2,21,746 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని అక్టోబరు 1న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ కీతోపాటు పరీక్ష ఫలితాలను కూడా ఎన్టీఏ విడుదల చేయనుంది.




సీఎస్ఐఆర్‌ యూజీసీ నెట్‌ గురించి.. 
సైన్స్‌ రంగంలో పరిశోధనలు సాగించాలనుకునే ప్రతిభావంతులకు చక్కటి మార్గంగా చెప్పవచ్చు. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) జాతీయ స్థాయిలో ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో ప్రతిభ ద్వారా జేఆర్‌ఎఫ్‌(జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌) సాధించిన విద్యార్థులకు ప్రముఖ సంస్థలో పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా యూజీసీ గుర్తింపు పొందిన కళాశాలల్లో ప్రొఫెసర్‌ /లెక్చరర్‌గా కెరీర్‌ ప్రారంభించవచ్చు. 

ఫెలోషిప్‌ ప్రయోజనాలు:

* సైన్స్‌ విద్యార్థులకు సీఎస్‌ఐఆర్‌ నెట్‌ కెరీర్‌ పరంగా అత్యంత ముఖ్యమైన పరీక్ష. ఇందులో అర్హత పొంది ఫెలోషిప్‌ సాధిస్తే చక్కటి కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. దేశంలోని గొప్ప సైంటిస్ట్‌లతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది.
* సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ ద్వారా జేఆర్‌ఎఫ్‌ సాధించిన అభ్యర్థులకు సీఎస్‌ఐఆర్‌ పరిశోధన సంస్థలతోపాటు ఇతర ప్రతిష్టాత్మక సంస్థల్లో పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో రెండేళ్ల పాటు నెలకు రూ.31వేల ఫెలోషిప్, అలాగే అదనంగా ఏటా కంటిన్‌జెన్సీ గ్రాంట్‌ కింద రూ.20వేలు పొందవచ్చు.
* రెండేళ్ల జేఆర్‌ఎఫ్‌ పూర్తిచేసుకున్న అభ్యర్థులు పీహెచ్‌డీకి రిజిస్టర్‌ చేసుకుంటే.. సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌)గా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.35 వేలు ఫెలోషిప్‌ లభిస్తుంది.
* నేషనల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ షెడ్యూల్‌ క్యాస్ట్‌ స్టూడెంట్స్, నేషనల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ అదర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్, మౌలానా అజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ మైనారిటీ స్టూడెంట్స్‌ వంటి ఫెలోషిప్‌లకు కూడా సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌లో ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేస్తారు. 

లెక్చరర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌:

* నెట్‌లో అర్హతతో దేశంలోని అన్ని డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ/తత్సమాన హోదా ఉన్న సంస్థల్లో లెక్చరర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కెరీర్‌ ప్రారంభించవచ్చు. 
* తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు భర్తీ చేసే డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. నెట్‌/స్లెట్‌లో అర్హత తప్పనిసరి. 
* ఐఐటీ, ఐఐఎస్సీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పరిశోధన కోర్సుల్లో ప్రవేశాలకు నెట్‌ /జేఆర్‌ఎఫ్‌ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాకుండా ఓఎన్‌జీసీ వంటి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నియామకాల కోసం నెట్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి.


 


Also Read:


SSC Recruitment: భారత వాతావరణ శాఖలో 990 ఉద్యోగాలు, అర్హతలివే!
భారత వాతావరణ శాఖలోని సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాతపరీక్షకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ కేంద్రాల్లోని సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రూప్-'బి' నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 18లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


SSC CGL Notification 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 20 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2022' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడంచెల (టైర్-1,టైర్-2, టైర్-3) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



UPSC Notification: 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2023' నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టులెన్నో తెలుసా?

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్‌-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 11లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష, జూన్ 24, 25 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



UPSC: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా
యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...