నివాస యోగ్యమైన స్థలాలను నిర్ధారించడానికి వాస్తు ఒక మంచి మార్గం. వాస్తును అనుసరించి ఉన్న స్థలాలలో నివాసం ఆనందంగా, ఆరోగ్యంగా, సంపన్నంగా ఉంటుంది. తూర్పు, ఈశాన్య, ఉత్తర దిక్కులు వాస్తు ప్రకారం మంచివి. ఈ దిక్కులలో ఉన్న స్థలాలలో నిర్మాణాలు శుభ పలితాలను ఇస్తాయి. కాబట్టి మీ ఇంటి నిర్మాణం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తిని అనుసరించి మీకు ఏ దిశలో నిర్మించిన ఇల్లు అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం.



  • టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నపుడు తూర్పు ముఖంగా ఉండే ఇల్లు మంచిది. బ్యాంకింగ్ రంగం లేదా ఫైనాన్స్ సెక్టార్ లో పనిచేసే వారికి ఈశాన్య లేదా ఉత్తర ముఖంగా ఉండే ప్లాట్స్ మంచివి. ఈ దిక్కులు బుధుడు, కుబేరుడు అధిపతులుగా ఉంటారు. పార్లర్ లేదా సెలూన్ వంటి బ్యూటీకి చెందిన వ్యాపారంలో ఉంటే ఆగ్నేయ దిక్కు మంచిది.

  • ప్లాట్ ఆకృతి కూడా ముఖ్యమే. ఇల్లు కొనే ముందు తప్పనిసరిగా అన్ని దిశలను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లాట్ మూలల్లో ఎలాంటి కొనసాగింపు ఉండకూడదు. చతురస్రం లేదా దీర్ఘ చతురస్రాకృతిలో ఉండాలి. అంతేకాదు ఫ్లాట్ భుజాల నిష్పత్తి 1:3కి మించకూడదు.

  • అంతేకాదు ప్లాట్ పరిసరాలకు 100 అడుగుల దూరంలో మందిరం ఉండకూడదు. ఉత్తరం లేదా తూర్పు దిశలలో ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ సంప్ నిర్మాణం చేసుకోవడం మంచిది. దక్షిణాన ఎత్తైన నిర్మాణాలు లేదా కొండలు ఉండడం వాస్తు ప్రకారం చాలామంచిది.

  • నిర్మాణ స్థలానికి దగ్గరగా స్మశాన వాటిక లేదని నిర్ధారించుకోవడం తప్పనిసరి. ఇంటి ముందు విద్యుత్ స్థంభం ఉందో లేదో చూసుకోవాలి.

  • నేల, రంగు, వాసన కూడా చాలాకీలకమైన అంశాలు. వాస్తు పండితులతో వీటికి సంబంధించిన పరీక్ష చేయించుకోవాలి. నిర్మాణం చేసే స్థలం నివాసానికి, వ్యాపారానికి అనుకూలమో కాదో ఒక సారి చూసుకోవడం అవసరం.

  • నేలను తవ్వినప్పుడు ఎముకలు, గోళ్లు కనిపిస్తే అది అశుభం. అలా జరిగినపుడు నేలపై పొర పూర్తిగా తొలగించి శుభ్రమైన మట్టితో నింపుకోవడం అవసరం. భూమి పూజ చేస్తున్న సందర్భంలో ఈశాన్యంలో కలశం, నాగినిని ప్రతిష్టించడం తప్పనిసరి. వాస్తు పూజ చేయ్యడం వల్ల స్థలం పాజిటివ్ ఎనర్జీని సంతరించుకుంటుంది.

  • ఉత్తరం లేదా తూర్పు వైపు వాలుగా ఉండే ప్లాట్లు చాలా మంచివి. సహజంగా వాలు ఆ దిశగా లేకపోతే తప్పకుండా మట్టి నింపి వాలు అటువైపు ఉండేట్టు చూసుకోవాలి. స్థలంలో పల్లం ఎటువైపు ఉంటుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఇలాంటి జాగ్రత్త అవసరం.


వాస్తు జీవితాన్ని సుఖమయం చేసే సాధనం. దీన్ని ఉపయోగించుకోవడం వల్ల లాభమే తప్ప నష్టం లేదు. కొన్ని చిన్న జాగ్రత్తలు నిర్మాణాలు మొదులు పెట్టడానికి ముందే తీసుకుంటే తర్వాత కాలంలో పెద్ద నష్టాలను నివారించడం సులభం అవుతుంది.



Also Read: నిత్యం తినే ఆహారంలో 5 రకాలైన దోషాలు, మీరు ఎలాంటి భోజనం చేస్తున్నారో తెలుసా!