బుల్లితెర ప్రేక్షకులని టీవీలకి కట్టిపడేసిన సీరియల్ కార్తీకదీపం. రాత్రి 7.30 అయ్యిందంటే చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరినీ టీవీలకి అతుక్కుపోయేలా చేసింది. టాప్ రేటింగ్ సంపాదిస్తూ నిర్విరామంగా ఆరేళ్ళపాటు కొనసాగిన ఈ సీరియల్‌కు ఈ వారంతో ఎండ్ కార్డ్ పడబోతోంది. ఈ సీరియల్ స్థానంలో కొత్తగా ‘బ్రహ్మముడి’ సీరియల్ ప్రసారం కాబోతోంది. ఇందులో మానస్, దీపిక రంగరాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బిగ్ బాస్ నటి హమీదా కూడా మరో కీలక పాత్రలో కనిపించనుంది. హీరోయిన్‌కు చెల్లిగా నటిస్తోంది.
దుగ్గిరాల కుటుంబానికి ముగ్గురు వారసులు. చిన్నవాడు కళ్యాణ్ కవితలు రాస్తాడు. అతనేవారో కాదు ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో రిషి బెస్ట్ ఫ్రెండ్ గా కనిపించే గౌతమ్. ఇక రెండో వాడు రాహుల్ ప్లే బాయ్. ఇక పెద్ద వాడు రాజ్యవర్థన్ (మానస్). చేసే పనిలో స్టేటస్ తో పాటు పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటాడు. స్వచ్చమైన ముత్యం లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటాడు. కానీ రెండో వాడు మాత్రం రాజ్యవర్థన్ కోరుకున్నవన్నీ లాగేసుకుంటాడు. ఆ కుటుంబానికి తన ముగ్గురు కూతుళ్ళు కోడళ్ళు కావాలని ఆశపడుతుంది ఓ తల్లి. గాల్లో మేడలు కట్టే ఆ తల్లి కూతుళ్లకి గొప్ప ఇంటి సంబంధాలు చేయగలదా లేదా అనేది తెలియాలంటే కొత్తగా ప్రారంభం కాబోతున్న ‘బ్రహ్మముడి’ సీరియల్ చూడాల్సిందే.
ఇందులో హీరోయిన్ ఆత్మాభిమానంతో తన కాళ్ళ మీద నిలబడాలని కోరుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మట్టి బొమ్మలకి రంగులు వేస్తూ ఉంటుంది. అటు మన హీరోగారు స్టేటస్ చూసే వాడు. మరి వీరిద్దరికీ జోడీ ఎలా కుదురుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది బెంగాలీ సీరియల్ ‘గట్చోరా’కి రీమేక్.
మానస్ ‘కార్తీకదీపం’ సీరియల్ లో పెద్ద హిమకి జోడీగా నటించాడు. బిగ్ బాస్ సీజన్ 5లోనూ మానస్ పాల్గొన్నాడు. తన మంచి ప్రవర్తనతో టాప్ 5 వరకు వచ్చాడు. ‘కోయిలమ్మ’ సీరియల్ లో నటించాడు. యాంకర్ విష్ణు ప్రియతో కలిసి ‘జరీ జరీ పంచెకట్టు’ ప్రైవేట్ సాంగ్ లో అదిరిపోయే స్టెప్పులు వేసి దుమ్ములేపాడు.
Also Read: 'కార్తీకదీపం' సీరియల్ కు ఎండ్ కార్డ్, క్లారిటీ ఇచ్చిన నిరుపమ్, ప్రేమీ - త్వరలో 'బ్రహ్మముడి'