నాతన హిందూ ధర్మంలో మాలధారణకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. భగవంతుడికి పూమాల సమర్పించి బంగారం వంటి లోహంతో చేసిన మాల లేదా మణి మాలను కూడా వేస్తారు. రకరకాల మాలలకు రకరకాల దేవతలకు ప్రీతి పాత్రమైనవిగా ఉంటాయి. ఉదాహరణకు శివారాధకులు రుద్రాక్షమాల ధరిస్తే, విష్ణు ఆరాధకులు తులసి మాలాధారణ చేస్తారు. పూజలు, జపాలకు కూడా జపమాలలను ఉపయోగిస్తారు. ఈ మాలల విషయంలో చాలా రకాల నియమాలు శాస్త్రంలో సూచించారు. ఈ నియమ పాలన చెయ్యకపోతే పూజాఫలం దక్కదు. అంతేకాదు సరైన పద్ధతిలో చెయ్యకపోవడం వల్ల నష్టం కూడా కలుగవచ్చు. మెడలో వేసుకున్న మాలను జపానికి వినియోగించ కూడదు. ఇలా జప మాల విషయంలో కొన్ని నియమాలు, నిష్ఠలు ఉన్నాయి వాటి గురించి పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.


రుద్రాక్షమాల


రుద్రాక్షను శివప్రసాదంగా భావిస్తారు. అందుకే ఋషులు, సాధువులు తప్పకుండా రుద్రాక్ష ధరిస్తారు. కానీ రుద్రాక్షను కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం కూడా ధరిస్తారు. జ్యోతిషం ప్రకారం రుద్రాక్షను సరైన ముఖంతో ఉన్నదాన్నే ధరించాలి. లేదంటే ఆరోగ్య నష్టం, ఆర్థిక నష్టం జరగవచ్చు. అంతేకాదు పవిత్రతను కాపాడేందుకు పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలి.


తులసి మాల


తులసి మాలను జపానికి వినియోగిస్తారు. దీన్ని మెడలోనూ మణికట్టుకు కూడా ధరిస్తారు. తులసి పూసల ధారణ వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం దొరుకుతుందని నమ్మకం. కానీ ఈ మాల ధరించినపుడు మాంసం, చేపలు, మద్యం వంటివాటికి దూరంగా ఉండాలి. ఈ నియమాలు పాటించకపోతే లాభానికి బదులుగా నష్టం జరగవచ్చు. జీవితంలో ఆనందం, శాంతి కరువు కావచ్చు.


చందన మాల


గంధపు పూసలు హిందువులు చాలా రకాల ఆధ్యాత్మిక సాధనలలో వినియోగిస్తారు. మహావిష్ణువు పూజకు తెల్ల చందనం, పసుపు గంధం వినియోగిస్తారు. ఎర్రచందనం మాలలు అమ్మవారి పూజకు వాడుతారు. అమ్మవారి ఉపాసకులు ఎర్రచందన మాల ధరించాలి. ఎర్రచందన మాల ధారణతో రాహు, కేతు దోషాలు కూడా తొలగిపోతాయి.


ముత్యాల మాల


ముత్యాల మాల అందానికి ప్రతీక. వీటితో నగలు కూడా తయారు చేస్తారు. కానీ క్రమం తప్పకుండా ముత్యాల పూసలను ధరించాలని అనుకుంటే ముందు జాతకంలో చంద్రుని స్థానం గురించి తెలుసుకున్న తర్వాతే ధరించడం మంచిది. ముత్యాన్ని చంద్రుని రత్నంగా భావిస్తారు. చంద్రుడు శుభంలో లేని పక్షంలో ముత్యాలు ధరించడం వల్ల మానసిక క్షోభ పెరిగి మానసిక సమస్యలు రావచ్చు.


స్పటిక మాల


స్పటిక మాల కూడా పవిత్రమైంది. స్పటిక మాల ధరించడం వల్ల శుక్రగ్రహానికి సంబంధించిన శుభాలు కలుగుతాయి. జ్యోతిషంలో శుక్రగ్రహ దోష నివారణకు స్పటిక మాల ధరించాల్సిందిగా సూచిస్తారు. జన్మ జాతకంలో శుక్రుడు చెడిపోయి ఉంటే దీన్ని ధరించడం వల్ల సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే పండితుల సలహా మేరకు మాత్రమే వీటిని ధరించాలి.


Also read : Dreams in Sawan: శ్రావణ మాసంలో ఈ కలలు వస్తే మీరు చాలా లక్కీ!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial