శ్రావణ మాసం మొదలైంది. ఇది ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో శివభక్తులు స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల మార్గాలను అనుసరిస్తారు. కొందరు ఉపవాసాలు చేస్తే.. కొందరు అభిషేకాలు చేస్తారు. కొందరు పూజలు, ఉపవాసాలు రెండూ చేస్తారు. అయితే స్వామి మన సేవలకు ఎంత వరకు సంతోషించారనేది మాత్రం మనకు అర్థం అవడం కష్టం. అయితే, శ్రావణ మాసంలో వచ్చే కలలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇది మనపై భోళా శంకరుడు చూపించే కరుణకు ప్రతీకలట. కలలో కనిపించే కొన్ని విషయాలు చాలా శుభప్రదమైనవి. కలలో జరిగే కొన్ని దర్శనాలు మన పూజ ఫలించిందని చెప్పే సంకేతాలట. అవేమిటో? పండితులు వాటి గురించి ఏమిని వివరిస్తున్నారో తెలుసుకుందాం.


జంట నాగులు


శ్రావణ మాసంలో కలలో పాములు కనిపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. జంట నాగులు కలలో కనిపిస్తే వైవాహిక జీవితం బలోపేతమవుతుందని అనేందుకు సంకేతం. ఇక వివాహం కానీ వారికి ఇలా జంట నాగులు కలలో కనిపిస్తే త్వరలోనే వివాహం జరుగుతుందని అర్ధం.


ఎద్దు (నంది)


పురాణాల ప్రకారం నంది శివ గణంలో భాగం. అంతేకాదు మహదేవుని వాహనంగా కూడా పరిగణిస్తారు. శ్రావణ మాసంలో కలలో ఎద్దు కనిపిస్తే శివుడు మీ విషయంలో ప్రసన్నంగా ఉన్నాడని అర్థం. కలలో నంది కనిపించడం విజయానికి సంకేతం.


చుట్ట చుట్టుకున్న పాము


శ్రావణ మాసంలో శివలింగం చుట్టు చుట్టుకున్న పాము కనిపిస్తే త్వరలోనే మీ కోరిన కోరికల్లో ఒకటి తీరబోతోందని అర్థం. మీ పూజలు ఫలించి శివుడు మీకు వరాలు అందించబోతున్నాడనేందుకు సంకేతం. ఈ కల వచ్చిన తర్వాత వెంటనే శివాలయానికి వెళ్లి శివలింగానకి అభిషేకం చేసుకోవాలి.


త్రిశూలం


తిశూలంలోని మూడు శూలాలు రాజో, తమో, సత్ గుణాలకు ప్రతీకలు. వీటిని కలిపి త్రిశూలం తయారవుతుంది. విశ్వాసాల ప్రకారం, శివుని త్రిశూలం మూడు అంచులు కామం, క్రోధ, లోభాలను అంతం చేసే ఆయుధమని అర్థం. కలలో త్రిశూలం కనిపిస్తే త్వరలోనే మీరు కష్టాల నుంచి బయటపడబోతున్నారని అర్థం.


డమరు


శివుడి చేతిలో ధరించే వాయిద్యం డమరు. డమరు స్థిరత్వానికి చిహ్నం. కలలో శివుడి అలంకారాల్లో ఒకటైన డమరు కనిపించడం ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తీరబోతున్నాయని అర్థం. డమరు కలలో కనిపిస్తే జీవితంలో స్థిరపడబోతున్నారని అర్థం చేసుకోవాలి.


Also read : Spirituality: తిలక ధారణ దేనికి సంకేతం ,చిన్న చుక్క బొట్టులో ఇన్ని విషయాలున్నాయా!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial