జ్యోతిష్యంలో ఒకనిర్ధుష్ట సమయం తర్వాత ప్రతి గ్రహం కొంత కాలం పాటు తిరోగమనంలో ఉంటుంది. గ్రహాలన్నింటిలోకి చాలా నెమ్మదిగా కదిలే గ్రహం శని. మందగమనంలో ఉంటాడు కనుక శని భగవానుడికి మందుడు అని కూడా అంటారు. తిరోగమన స్థితిలో శని కాస్త బలహీన పడతాడు కూడా. అందువల్ల సరైన ఫలితాలను ఇవ్వలేడు. శని శుభస్థితిలో ఉంటే ఆనందం, శాంతి వంటి మంచి ఫలితాలు ఉంటాయి. శని కర్మ ప్రదాత. ఆయన ఎప్పుడూ న్యాయం వైపు ఉంటాడని జ్యోతిష్యం చెబుతోంది. అటువంటి శని ఈ ఏడాది జూన్ 17 న కుంభరాశిలోనే తిరోగమనం మొదలైంది. ఇలా శని తిరోగమించడం వల్ల గోచార రీత్యా కొన్ని రాశులకు సమయం అనుకూలంగా ఉండదు. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. జూన్ 17 నుంచి నాలుగు నెలల పాటు శని తిరోగమనంలో ఉంటాడు. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది. ఆరాశుల వారు చాలా మంచి ఫలితాలు సాధించి విజయపథంలో సాగబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
మకర రాశి
శని తిరోగమనంలో ఉండడం వల్ల మకరరాశి వారికి అదృష్టం కలిసివస్తుంది. ఈ సమయంలో మకరరాశి వారు ఆర్థికంగా బలపడతారు. బ్యాంక్ బాలెన్స్ పెరుగుతుంది. ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలను ఆర్జిస్తారు. కుటుంబ వైవాహిక జీవితంలో సారుకూలత కనిపిస్తుంది. మనసు ఆనందంగా ఉంటుంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి శని తిరోగమన కాలం విశేష ఫలితాలను ఇవ్వబోతోంది. పనిచేసే చోట మంచి ప్రశంశలు అందుకుంటారు. ఉన్నత స్థాన్నాన్ని పొందుతారు. మీ మాట తీరుతో చాలా మందిని ఆకట్టుకుంటారు. అదృష్టం పూర్తి స్థాయిలో వీరి వైపు ఉంటుందని చెప్పవచ్చు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. కొన్ని కొత్త విషయాలను ఆవిష్కరిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.
వృషభ రాశి
శని వక్రగతి వృషభరాశి వారికి చాలా యోగదాయక కాలం. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. మాట మీద కాస్త అదుపు మాత్రం అవసరం. పనిచేసే చోట సహోద్యోగుల సహకారం దొరుకుతుంది. ఈ సమయంలో పనులు సజావుగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావచ్చు. పెద్ద ప్రాజెక్టుల్లో భాగం వల్ల లాభాలు పొందుతారు. వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. ధన లాభం తప్పకుండా ఉంటుంది.
ఇక శని వక్రమార్గంలో ఉండడం వల్ల కాలం కలిసి రాని జాతకులు ప్రతి రోజూ శనిబీజ మంత్రం, తాంత్రిక శని మంత్రం ప్రతి రోజూ పఠించడం వల్ల శని వల్ల కలిగే ఇబ్బందులను అధిగమించే శక్తిని పొందవచ్చు. అవసరంలో ఉన్న వారికి సాయం చెయ్యడం, పశుపక్ష్యాదుల పట్ల దయకలిగి ఉండడం వాటి ఆకలి తీర్చడం వంటివన్నీ కూడా శని ప్రతికూలతలను నివారిస్తాయి. ఏలినాటి, అష్టమ, అర్ధాష్టమ శని ప్రభావాలు ఉపశమిస్తాయి.
Also read : Bamboo plant: వెదురు మొక్కను ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందా? దీన్ని ఎలా పెంచాలి?
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.