Adilabad:  నదులను దైవాలుగా కొలిచే ఆచారం అనాదిగా వస్తోంది. పన్నెండేళ్లకోసారి పుష్కరాలు జరిపి నదులకు ఉత్సవాలు జరుపుతుంటారు. ఈ సమయంలో భారీగా భక్తులు తరలివెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అయితే కొన్ని నదులకు ఏడాది పొడవునా పూజలు చేస్తుంటారు,మొక్కులు చెల్లిస్తారు. అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయం ఇది. దీన్ని ఇప్పటికీ అనుసరిస్తున్నారు. 

కుటుంబం మొత్తం తరలివెళ్లి  పవిత్ర జలాల్లో పుణ్య స్నానాలు చేసి అక్కడే ప్రత్యేక పూజలు చేసి నదీమతల్లి దీవెనలు అందుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గోదావరి, పెన్ గంగా, ప్రాణహిత తదితర పవిత్ర నదుల్లో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఏటా తొలకరి జల్లుల కురిసే ముందు గంగమ్మకు పూజలు చేస్తుంటారు ఆదిలాబాద్ జిల్లావాసులు.

వానాకాలం ఆరంభానికి సూచనగా గంగమ్మకు ఆహ్వానం పలుకుతూ ప్రత్యేక పూజలు చేస్తారు. వ్యవసాయ పనులు మొదలై, విత్తనాలు విత్తుకునే సమయం రాగానే తమకు పంటనిస్తున్న గంగమ్మకు కృతజ్ఞతలు ఇలా తెలియజేస్తారు. 

ఆదిలాబాద్ జిల్లావాసులు మాత్రేమే కాదు మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రజలు కూడా పెన్ గంగా నదికి పెద్ద సంఖ్యలో గ్రామీణులు తరలివెళ్లి  పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. నది ఒడ్డునే వంటచేసి గంగమ్మకి నివేదిస్తారు. నదిలో దీపాలు వెలిగించిన తెప్పలు వదిలి మొక్కులు చెల్లించుకుంటారు. పంటలు సమృద్ధిగా పండాలని, ఇంటిల్లపాది కళకళలాడుతూ ఉండాలని గంగమ్మను మొక్కుకుంటారు. 

ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, భీంపూర్ మండలాలతో పాటు జైనథ్, బేలా మండలాల నుంచి భారీగా రైతు కుటుంబాలు పెన్ గంగా నదికి వెళ్లి పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. పెన్ గంగా నదీ పరివాహక ప్రాంతాలైన గొల్లఘాట్ తాంసి, వడూర్, అంతర్గామ సహా ..నదికి దూరంలో ఉన్న వడ్డాడి, జామిడి, పాలొది, కప్పర్ల, తాంసి, సావర్గామ, పొన్నారి తదితర గ్రామాల రైతులు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి గంగమ్మకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని ఇక్కడి రైతులు మాత్రమే కాదు నివాసం ఉండే అందరూ పాటింస్తున్నారు.  

నదిలో స్నానం ఆచించేటప్పుడు అయినా..నదికి పూజలు నిర్వహించే ముందు నీళ్లు చల్లుకున్నప్పుడు అయినా

గంగేచ యమునేచైవ గొదావరీ సరస్వతీ|నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు|| 

అనే శ్లోకాని పఠిస్తే గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి ఈ నదులు అన్నింటిలో స్నానం ఆచరించిన పుణ్యఫలం వస్తుందని ఈ శ్లోకం అర్థం..

తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు- పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

తిరుమల అలిపిరి మెట్లదారిలో ఈ అద్భుతాలను గమనించారా..మీరెన్ని చూశారు

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

పాకిస్థాన్‌ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!