Vishnu Purana: అష్టాద‌శ పురాణాల్లో విష్ణు పురాణం ముఖ్యమైనది. ఈ ప్రపంచంలోని సృష్టి-స్థితి-లయ కార‌ణాల‌తో సహా వేలాది ఇతర విష‌యాల‌ను ఈ పురాణంలో వివ‌రించారు. విష్ణు పురాణం మానవ సంక్షేమానికి అవసరమైన అనేక అంశాల‌ను వివరిస్తుంది. విష్ణు పురాణం ప్రకారం, ఒక వ్యక్తి కొన్ని వస్తువులను విక్రయించకూడదని పేర్కొన్నారు. ఈ వస్తువులను విక్రయించే వ్యక్తి ఎప్పుడూ ఏదో ఒక సమస్యలో ఇరుక్కుపోతాడు. విష్ణు పురాణం ప్రకారం మనం ఏ వస్తువులు అమ్మకూడదో తెలుసుకుందాం.


1. ఆవు          
హిందూ ధ‌ర్మంలో ఆవుకు తల్లి స్థానం ఇచ్చారు. అంతే కాదు గోమాత‌లో మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారని హిందువ‌ల విశ్వాసం. అందుకే ఆవులను, వాటి పాలను అమ్మకూడదని విష్ణు పురాణం చెబుతోంది. నిజానికి విష్ణు పురాణం ప్రకారం, ఆవు పాలు దాని దూడకు మాత్రమే పరిమితం. ఆవు పాలను సాధారణంగా డబ్బు కోసం అమ్ముతారు. విష్ణు పురాణం దీనిని అంగీకరించదు. దూడకు చెందాల్సిన‌ ఆవు పాలు అమ్మేవాడు పాపంలో భాగస్వామి అవుతాడు.


Also Read : గురువారం ఈ పండు తింటే శ్రీహరి ఆగ్రహానికి గురవుతారు జాగ్రత్త!


2. ఆవు పాలు అమ్మితే ఏం చేయాలి.?         
ఈ రోజుల్లో చాలా మంది డబ్బు కోసం లేదా వారి జీవ‌నోపాధి కోసం ఆవు పాలు అమ్ముతున్నారు. మరికొందరు పెద్ద పెద్ద పాల దుకాణాలు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఈరోజు మీరు ఈ తప్పులు చేస్తుంటే. ఈ పాపం నుంచి తప్పించుకోవడానికి ఒక సులభమైన మార్గం ఉంది. ఆవు పాలను అమ్మిన తర్వాత, కొంత డబ్బును ధ‌ర్మ‌సంబంధిత‌ కార్యక్రమాలకు లేదా ప్రజా సంక్షేమానికి వినియోగించండి.


3. బెల్లం      
విష్ణు పురాణంలో, బెల్లం శ్రేయస్సుకు చిహ్నంగా పేర్కొన్నారు. ఈ కారణంగా మనం ఎప్పుడూ బెల్లం అమ్మకూడదు. ఎవరైనా బెల్లం అడిగితే డబ్బులు తీసుకుని బెల్లం ఇవ్వకండి. అందుకు బదులుగా, మీరు సంతోషంగా దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ సంతానానికి మేలు జ‌రుగుతుంది.


4. ఆవ నూనె     
బెల్లం వంటిదే ఆవాలు కూడా. ఆవ నూనె ఎవరికీ అమ్మకూడదని విష్ణుపురాణంలో పేర్కొన్నారు. మీరు డబ్బు తీసుకుని ఎవరికీ ఆవనూనె ఇవ్వకూడదు. దాతృత్వంతో వాటిని సంతోషంగా ఇతరులకు అందించవచ్చని విష్ణు పురాణంలో స్ప‌ష్టంచేశారు.


Also Read : స్త్రీలు విష్ణు సహస్రనామం జపించకూడదా - ఎందుకు!


విష్ణు పురాణం ప్రకారం, ధనంపై దురాశతో పై వస్తువులను అమ్మేవాడు పాపంలో భాగస్వామి అవుతాడు. అందువ‌ల్ల‌ అతని జీవితంలో ఆనందం, శాంతిని కోల్పోతాడు. మీరు అలాంటి తప్పులు చేస్తుంటే, ఈ రోజు నుంచే చేయడం మానేయడం మంచిది.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.