Garuda Puranam: హిందూ సంప్ర‌దాయంలో గరుడ పురాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వేదవ్యాసుడు రచించిన ఈ పురాణాన్ని చదవడం ద్వారా మానవ జీవితానికి అవసరమైన చాలా మంచి సమాచారాన్ని పొందవచ్చు. ప్రాచీన కాలం నుంచి హిందూ సంప్ర‌దాయంలో పవిత్ర గ్రంథంగా ఉన్న గరుడ పురాణం మానవ జీవిత సారాంశాన్ని వివరిస్తుంది. మరణానికి సంబంధించిన సంఘటనలు, మరణానంతర ఘటనలు గరుడ పురాణంలో స‌మ‌గ్రంగా వివరించారు. దీనితో పాటు గరుడ పురాణం మన జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి, దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవ‌డానికి ఏమి చేయాలో కూడా ప్రస్తావిస్తుంది. గరుడ పురాణం ప్రకారం ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవ‌చ్చ‌ని చెబుతారు.


భ‌గ‌వంతుడికి ధన్యవాదాలు


ఉదయం నిద్ర లేవ‌గానే, రాత్రి పడుకునే ముందు భగవంతుని స్మరించుకోవాలని గుర్తుంచుకోండి. ఈ రోజు మంచి రోజుగా మార్చినందుకు కృతజ్ఞతలు చెప్పండి. రేపు మ‌రో మంచి రోజు ప్ర‌సాదించ‌మ‌ని కోరుతూ ప్రార్థించండి. ఇది మనం రోజంతా బాగా గడపడానికి సహాయపడుతుంది.


స్నానం


ప్రతి రోజూ స్నానం చెయ్యాలి. రోజు స్నానం చేయ‌ని వారిలోకి త్వరగా ప్రతికూల శక్తులు ఆకర్షితమవుతాయి. దేహం దేవాలయంతో సమానం. దైవ నిలయమైన దేహాన్ని శుభ్రంగా ఉంచుకోకపోతే దైవ కృప దొరకదు. ప్రతి రోజూ స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి భగవంతుడిని పూజించే వారికి జీవితంలో ఎలాంటి లోటు రాదు.


Garuda purana: గ‌రుడ పురాణం ప్ర‌కారం వీరి నుంచి ఆహారం తీసుకుంటే నరకానికే


శుభ్ర‌మైన దుస్తులు ధ‌రించాలి


ప్రతి వారికి బాగా సంపాదించి సంపన్నమైన జీవితం గడపాలనే ఆశ ఉంటుంది. అలా గడిపేందుకు చాలా అదృష్టం ఉండాలి. కాలం కలిసి రావాలి. గరుడ‌ పురాణం ప్రకారం మురికిగా, దర్వాసన వ‌స్తున్న దుస్తులు ధరించే వారిని దురదృష్టం వెంటాడుతుంది. అలాంటి వారికి లక్ష్మీ కటాక్షం కూడా దొరకదు. ఇలాంటి వారి జీవితం విజయానికి ఆమడ దూరంలోనే ఉంటుంది. అందుకే ప్రతి రోజూ స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించాలి. శుభ్రమైన సువాసనతో ఉన్న దుస్తులనే ఎప్పుడూ ధరించాలని గరుడ‌ పురాణం చెబుతోంది.


పితృదేవ‌త‌ల‌ ఆశీస్సులు


సంతోషకరమైన జీవితానికి భగవంతుడితో పాటు పూర్వీకుల ఆశీర్వాదం అవసరం. ఇంట్లో చేసే మొదటి ఆహారం ఆవుకి, చివరి ఆహారం కుక్కకు తినిపించాలి. అలా చేయ‌డం ద్వారా పూర్వీకులను ప్రసన్నం చేసుకోవ‌చ్చ‌ని, భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని గరుడ పురాణం చెబుతోంది.


Chanakya Niti In Telugu: మీరు జీవితంలో ఎప్ప‌టికీ వ‌దులుకోకూడ‌ని ముగ్గురు వ్య‌క్తులు వీరే


భగవంతునికి నివేద‌న‌


ఇంట్లో తయారుచేసిన సాత్విక ఆహారాన్ని తినే ముందు దేవునికి నివేద‌న‌గా సమర్పించండి. ఇలా చేస్తే అన్నపూర్ణేశ్వరి దేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ ఆచారం చాలా కాలంగా హిందూ సంప్ర‌దాయంలో కొనసాగుతోంది.


తులసి పూజ


నిత్యం ఇంట్లో తులసి పూజ చేయడం మంచి పద్దతి. గరుడ పురాణం తులసిని పూజించే ఇంట్లో లక్ష్మి ఎప్పుడూ నివసిస్తుందని, అలాంటి ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి, డబ్బుకు కొరత ఉండదు. అందుకే రోజూ తులసి పూజ చేయండి.


Read Also: ఓటీటీలోకి రవితేజ ‘రావణాసుర’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?