ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ( CM Jagan ) మంత్రివర్గ విస్తరణ చేశారు.  పదవులు దక్కిన వాళ్లు ఆనందం వ్యక్తం చేశారు. పదవులు పోయిన వాళ్లు.. దక్కని వాళ్లు అసంతృప్తికి గురయ్యారు. వారందరూ సర్దుకున్నారు. అయితే పదవి దక్కినా .. దక్కకపోయినా పెద్ద సమస్య లేదనుకున్న ఓ ఎమ్మెల్యేకు మాత్రం చిక్కులు తప్పడం లేదు. వస్తే మంత్రిగా రా లేకపోతే ఎమ్మెల్యేగా (MLA Kapu )  పదవిగా కూడా రాజీనామా చేయమని అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. బహిరంగంగానే చెబుతున్నారు. ఆ ఎమ్మెల్యే అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. 


పవన్ కల్యాణ్ తాడిపత్రి రావాలి - ఆహ్వానించిన జేసీ ప్రభాకర్ రెడ్డి !
  
రాయదుర్గం రావాలంటే మంత్రిగానే రా లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నియోజకవర్గానికి రావాలని ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డిని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డ రామచంద్రా రెడ్డి కి ( MLA  Ramachandra reddy )పదవి ఇవ్వకపోవడం అన్యాయమని వారంటున్నారు.  .మాటతప్పని మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి  ఎన్నికల సమయంలో కాపు రామచంద్రా రెడ్డి కి మంత్రి పదవి  ( Minister Post ) ఇస్తానాన్న హామీ ఏమైందని వారు ప్రశ్నిస్తున్నారు.  


నెల్లూరులో వైఎస్ఆర్‌సీపీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ - ఫ్లెక్సీ చించేయడంతోనే రాజుకుంది !


సొంత పార్టీపై,  ఇష్టమైన ముఖ్యమంత్రిపై ఆందోళన చేయడం బాధగా ఉందని.. కానీ తమకు అండగా నిలబడ్డ కాపు రామచంద్ర రెడ్డి కి మంత్రి పదవి కేటాయించకపోవడం అన్యాయమని వారంటున్నారు. బుధవారం రామచంద్రారెడ్డి అనుచరులంతా బంద్ పిలుపునిచ్చారు. అయితే ఎక్కడా ఎవరూ బంద్ చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు.  అందుకే  వస్తే మంత్రిగా రా లేకపోతే రాజీనామా చెయ్యాలని కాపు రామచంద్రా రెడ్డి పై ఆయన అనుచరులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. 


ఏపీ మంత్రి విడదల రజనీ గురించి ఎవరికీ తెలియని విషయం ఇదే !


రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి  వైఎస్ జగన్‌కు సన్నిహితులు. ఆయన గాలి జనార్ధన్ రెడ్డి కుటుంబానికీ సన్నిహితులే. గాలి జనార్ధన్ రెడ్డి వైపు నుంచి సిఫారసు చేయించుకున్నా  ఫలితం దక్కలేదని తెలుస్తోంది. గాలి జనార్ధన్ రెడ్డి కి సన్నిహితుడైన కర్ణాటక మంత్రి శ్రీరాములు  మరో సిఫారసు చేయడంతో కాపు రామచంద్రారెడ్డికి అవకాశం లేకుండా పోయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి ఇంటా బయటా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.