ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత మంత్రివర్గంలో  విడదల రజనీ హాట్ టాపిక్ . ఆమె చిన్న వయసులోనే మంత్రి అవడం మాత్రమే కాదు  తొలి సారే ప్రాధాన్యత కలిగిన వైద్య ఆరోగ్య శాఖను నిర్వహిస్తున్నారు. ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా మందికి తెలియదు. తాను చంద్రబాబు నాటిన ఐటీ వనంలోని మొక్కను అని మహానాడులో స్వయంగా చెప్పుకున్నారు కాబట్టి ఐటీ ఉద్యోగిగా చేశారని అందరూ అనుకుంటున్నారు. ఆమె స్వస్థలం చిలుకలూరిపేట అని పురుషోత్తమ పట్నం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. 


త‌గ్గెదేలే - ప‌ట్టువీడ‌ని మాజీ హోం మంత్రి సుచ‌రిత‌, నేడు సీఎం జగన్‌తో భేటీ అవుతారా !


అయితే ఆమె గురించి వివరాలు చాలా మందికి తెలియవు . చివరికి ఆమె సామాజికవర్గం ఏమిటో కూడా ఎవరికీ తెలియదు. బీసీ నేతగా పాపులర్ అయ్యారు. ఆమె రజక సామాజికవర్గానికి చెందిన వారిగా ప్రచారం జరగడం... ఆ కోటాలోనే మంత్రి పదవి ఇస్తున్నారన్న ప్రచారం జరగడంతో కొన్ని రజక సంఘాల నేతలు ప్రెస్‌మీట్ పెట్టి నిజం కాదని ప్రకటించారు. ఆమె ముదిరాజ్ వర్గానికి చెందిన వారని చెప్పారు.  ఇప్పుడు మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె చిలూకలూరిపేట వద్ద ఉన్న పురుషోత్తమ పట్నం లో జన్మించలేదని.. ఆమె  తెలంగాణ బిడ్డ అని చెబుతున్నారు. 


వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు, మంత్రి పదవి దక్కకపోవడంపై తమ్మినేని హాట్ కామెంట్స్


 యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కూతురు రజని అని తెలుస్తోంది. రజని మంత్రి కావడంతో కొండాపురం గ్రామంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాగుల సత్తయ్య బతుకుదెరువు నిమిత్తం 40 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు వలస వెళ్లారు. సఫిల్‌గూడలో నివాసం ఉంటున్నారు. రజనీ హైదరాబాద్‌లోనే జన్మించారని అంటున్నారు. రాగుల సత్తయ్యకు  ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రెండో కూతురు రజని.  చిలుకలూరిపేటకు చెందిన విడదల కుమారస్వామిని ఆమె వివాహం చేసుకున్నారు. ఆయన సాఫ్ట్ వేర్ కంపెనీలు నిర్వహిస్తూంటారని చెబుతూంటారు. 


విశాఖ కోర్టు సంచలన తీర్పు, పోక్సో కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష


ఈ క్రమంలో రాజకీయాలపై ఆసక్తితో మొదట ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. చిలుకలూరిపేటకు కార్యక్షేత్రంగా మార్చుకుని రాజకీయాలు ప్రారంభించారు. అనతి కాలంలోనే వైఎస్ఆర్సీపీలో చేరి టిక్కెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన మూడేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య మంత్రిగా చోటు దక్కించుకున్నారు. అంటే తెలంగాణ బిడ్డ ఏపీలో మంత్రిగా ఉన్నారన్నమాట.