నంద్యాల సభలో  సీఎం జగన్  ( CM Jagan ) అన్న  "వెంట్రుక పీక్కోలేరు" అన్న మాట వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను ఉద్దేశించి అన్నదేనని అనంతపురం జిల్లా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ( JC Prabhakar Reddy ) వ్యాఖ్యానించారు. తాడిపత్రిలో ( Tadipatri ) ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడిన ఆయన సీఎంజగన్ తాను ఇచ్చిన వారే మంత్రులు.. మిగతావారు నా వెంట్రుక పీకలేరని అర్థం వచ్చేలా మాట్లాడారని విశ్లేషించారు. సీఎం కామెంట్స్‌పై వైసీపీ ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలన్నారు. అయితే విద్యాదీవెన ( Vidya deevena ) పేరిట విద్యార్థులతో సభ ఏర్పాటు చేసిన చోట.. ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 


నెల్లూరులో వైఎస్ఆర్‌సీపీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ - ఫ్లెక్సీ చించేయడంతోనే రాజుకుంది !


పవన్ కల్యాణ్‌పై ( Pawan Kalyan ) జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.  కౌలురైతులకు పవన్‌ కల్యాణ్‌ ఆర్థికసాయం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.  అందరం కలిసి ప్రజల కోసం పని చేయాలన్నారు.  పవన్ కల్యాణ్ వస్తే కానీ ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వరా అంటూ వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు . తమ ప్రాంతానికి కూడా రావాలని పవన్‌ కల్యాణ్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి ఆహ్వానించారు. టీటీడీలో ( TTD  )  జరుగుతున్నది ఏంటి... సుబ్బారెడ్డి ఏమిచేస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఎండాకాలం... రెండేళ్ల అనంతరం దేవుడిని చూద్దామని వస్తే భక్తులను ఇన్ని అవస్థలు పెడుతున్నారేమిటని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్‌గా ( TTD Chairman )  సుబ్బారెడ్డి వచ్చాక దైవ దర్శనం కరవైందని తాము ఇంట్లో నుంచి మొక్కుంటున్నామన్నారు. 


ఏపీ మంత్రి విడదల రజనీ గురించి ఎవరికీ తెలియని విషయం ఇదే !
 
ఇన్ని రోజుల అనంతరం కార్యకర్తలకు చంద్రబాబు ( Chandrababu ) స్వేచ్చ ఇచ్చారని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు.  చంద్రబాబు ఫోటోతో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి జిల్లా మొత్తం తిరుగుతామని ప్రకటించారు.  ఇటీవల ఇతర నియోజకవర్గాల్లో వేలు పెట్టవద్దని టీడీపీ ( TDP ) హైకమాండ్  సీనియర్ నేతలను హెచ్చరించింది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పుట్టపర్తి వంటి నియోజకవర్గాలకు వెళ్లి అక్కడి టీడీపీ నేతలపై విమర్సలు చేస్తున్నారు. పల్లె రఘునాథరెడ్డికి టిక్కెట్ ఇవ్వవొద్దని బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు తాను జిల్లా మొత్తం తిరుగుతానని ప్రకటించడం టీడీపీలోనూ చర్చనీయాంశం అవుతోంది.