ఆంధ్రప్రదే్శ్‌లో అభివృద్ధిని చూసి ఓర్వలేక కేటీఆర్ .. ఏపీ గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నారని కృష్ణా జిల్లా మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది ఎవరో అందరికీ తెలుసని..  హైదరాబాద్‌కు కల్చర్ నేర్పింది ఏపీ వాసులన్నారు. ఏపీలో ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి కనిపిస్తుందన్నారు. ఎక్కడ చూసినా గ్రామ సచివలాయం కనిపిస్తుందని.. ఏ గ్రామంలో చూసినా డిజిటల్ లైబ్రరీ కనిపిస్తుందన్నారు. ఏపీకి వస్తే అమ్మఒడి కనిపిస్తుంది.. ఏపీకి వస్తే ఆసరా కనిపిస్తుంది.. ఏపీకి వస్తే 31 లక్షల ఇళ్లు కనిపిస్తాయని మంత్రి కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా ఏపీలో జగన్ దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయనంత అభఇవృద్ధి చేస్తున్నారన్నారు. ఏపీలో జరుగుతున్న అభవృద్ధిని చూసి కేటీఆర్ మాట్లాడాలన్నారు. 


నరకంలాగా ఏపీ, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు - ‘నేనేం డబ్బా కొట్టట్లేదు, అన్నీ నిజాలే’నంటూ కామెంట్స్


కేటీఆర్‌ను ఏపీకి ఆహ్వానిస్తున్నామని..  మరో వైఎస్ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు ప్రకటించారు. కేసీఆర్ లాగే కేటీఆర్ కూడా పిట్టకథలు చెబుతున్నారన్నారు. కేసీఆర్ పిట్టకథలు చెప్పే రాష్ట్రాన్ని విభజించారన్నారు. విజయవాడ వచ్చి చూస్తే డెవలప్ మెంట్ కనిపిస్తుందన్నారు.మళ్లీ ఉమ్మడి రాష్ట్రం కోం ప్రజలు ఉద్యమించాల్సిన పరిస్థితిని టీఆర్ఎస్ నేతలు కల్పిస్తున్నారని విశ్లేషించారు. వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్‌కు అత్యంత ఆప్తుడిగా భావిస్తున్న కేటీఆర్ ఇంత వరకూ ఎక్కడా జగన్ ప్రభుత్వంపై నెగెటివ్ వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇప్పుడు హఠాత్తుగా తీవ్రంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. వైఎస్ఆర్‌సీపీ నేతలకు కూడా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. దీనిపై ఎలా స్పందించాలో తెలియక హైకమాండ్‌ను స్పందిస్తున్నారు. 


సొంతపార్టీపై మంత్రి ఘాటు విమర్శలు.. ఈసారి రెడ్లను టార్గెట్ చేసిన నారాయణ స్వామి


వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ కూడా ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తోంది. ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వంతో వివాదాలున్నా... రాజకీయంగా టీఆర్ఎస్‌తో ఎలాంటి ఇబ్బందులు లేవు. రాజకీయ వ్యవహారాలన్నీ సఖ్యతగానే చక్క బెట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఒక్క సారిగా తమ పార్టీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ అగ్రనేత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వెనుక ఏమి వ్యూహం ఉందా అన్న విశ్లేషణ జరుపుకుంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందన కీలకమయ్యే అవకాశం ఉంది. 


జగన్‌ను కలిసిన మేకపాటి విక్రం రెడ్డి - ఆత్మకూరులో పోటీకి లైన్ క్లియర్ !
 


కేటీఆర్ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో కొత్త కలకలం ప్రారంభమయ్యే  అవకాశం కనిపిస్తోంది.