ఆత్మకూరు స్థానానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా మేకపాటి రాజమోహన్ రెడ్డి మరో తనయుడు విక్రమ్ రెడ్డిని ఖరారు చేశారు. ఆయన తండ్రితో కలిసి సీఎం జగన్‌ను తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కలిశారు. గౌతంరెడ్డిలాగే విక్రమ్ రెడ్డిని కూడా ప్రోత్సహించాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్‌ను కోరారు. నియోజకవర్గంలో పని చేసుకోవాలని జగన్ సూచించినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్‌తో సమావేశం తర్వాత మేకపాటి రాజమోహన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  మేకపాటి గౌతమ్ రెడ్డి వారసుడిగా మా రెండో అబ్బాయికి విక్రమ్ ని నిర్ణయించామని రాజమోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల షెడ్యూలు వస్తే మిగతా విషయాలు బయటకు వస్తాయన్నారు. 


అప్పులు దొరకవు డబ్బులు పంచలేరు - జగన్‌కు ప్రతిపక్ష స్థానమే వస్తుందన్న మాజీ సీఎస్ !


ఆత్మకూరులో ఏకగ్రీవం అవుతుందో... లేకపోతే ఎంత మంది పోటీలో ఉంటారన్న విషయం  షెడ్యూల్ వచ్చిన తర్వాతే తేలుతుందన్నారు. నియోజకవర్గానికి వెళ్లేముందు జగన్ ఆశీస్సులు తీసుకోవడానికి విక్రమ్ ని తీసుకు వచ్చమన్నారు.  అన్న వారసుడిగా రాజకీయాల్లోకి వస్తున్నాని...గౌతంరెడ్డి ఆశయాలను  ముందుకు తీసుకు వెళ్తానని విక్రమ్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గానికి అన్న చేయాలనుకున్నది నేను చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.  


సీఎం జగన్ అప్పుల అప్పారావు, మంత్రులు భజనగాళ్లు - శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు


ఆత్మకూరు నుంచి మేకపాటి గౌతంరెడ్డి భార్యను అభ్యర్థిగా నిలబెడతారన్న ప్రచారం జరిగింది. ఆమెను కేబినెట్‌లోకి కూడా తీసుకుంటారని మొదట చెప్పుకున్నారు . కానీ కేబినెట్‌లోకి తీసుకోలేదు. ఆమెకు రాజకీయాలపై ఆసక్తి లేకపోవడమే కారణం అని చెబుతున్నారు. మేకపాటి కుటుంబం నుంచి విక్రమ్ రెడ్డిని రాజకీయాల్లో ప్రోత్సాహించాలని కుటుంబీకులంతా కలిసి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జగన్‌కు తమ నిర్ణయం తెలిపారు. జగన్ కూడా మేకపాటి విక్రం రెడ్డికి టిక్కెట్ ఇచ్చేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. 


మూడు రాజధానుల్లో ఒకటి విశాఖకు ఇస్తానంటే దుష్ట చతుష్టయం అడ్డుకుంది - సీఎం జగన్ విమర్శ


మేకపాటి రాజమోహన్ రెడ్డి వయోభారం కారణంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదు. ఈ కారణంగా కుమారుల్ని ప్రోత్సహిస్తున్నారు. పెద్ద కుమారుడు మేకపాటి గౌతం రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. కానీ హఠాత్తుగా చనిపోవడంతో ఆయన స్థానాన్ని  సోదరుడు భర్తీ చేయాల్సి వస్తోంది.  నియోజవర్గంలో వైఎస్ఆర్‌సీపీ నేతలతో సమావేశాలు నిర్వహించాలని మేకపాటి విక్రం రెడ్డి నిర్ణయించుకున్నారు.