మూడు రాజధానుల్లో ఒకటి విశాఖకు ఇస్తానంటే దుష్ట చతుష్టయం అడ్డుకుందని సీఎం జగన్ ఆరోపించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి బహిరంగసభలో ప్రసంగించారు. పాదయాత్రలో పాతిక లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చామని ఇప్పుడు ముఫ్పై లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు.  30 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ. 55 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని ప్రకటించారు. ఇంటి స్థలాల విలువ రూ. 35 వేల కోట్లు ఉంటుందని అ‍న్నారు. కనీస సౌకర్యాల కల్పనకు మరో రూ. 32 వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. 


రేపు మరోసారి ఢిల్లీకి సీఎం జగన్, ప్రధాని మోదీతో భేటీ - పర్యటన ఉద్దేశం ఏంటంటే


ఇవాళ ఇళ్ల పట్టాలు అందుకున్న మహిళల చేతుల్లో రూ.10 వేల కోట్ల ఆస్తి ఉందని తెలిపారు. పేదలకు మంచి చేస్తూంటే... కోర్టులకు వెళ్లి  అడ్డంకులు సృష్టించారని విపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హయాంలో కనీసం 5 లక్షల ఇళ్లు కూడా కట్టలేదన్నారు. తాను మాత్రం హైదరాబాద్‌లో ప్యాలెస్ కట్టుకున్నారని చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాన్నారు.  ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సచివాలయం, మార్కెట్‌ యార్డ్‌, మూడు పార్క్‌లు రాబోతున్నాయని తెలిపారు. 


సెల్‌ఫోన్ లైటింగ్‌లో పిల్లల చదువులు! పది పరీక్షల వేళ కరెంటు కోతలు - ఈ ఫోటోలు నిజమేనా?


16 నెలల తర్వాత పేదల కల సాకారమవుతోందని తెలిపారు. ఇప్పటికే 16 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభించామని తెలిపారు. గజం రూ.12 వేల విలువున్న 50 గజాల స్థలం ఇస్తున్నామని సీఎం జగన్‌ చెప్పారు.రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయని అన్నారు. రెండో దశ నిర్మాణం  ప్రారంభించమని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఇల్లు రాని వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం జగన్‌ సూచించారు.


తిరుపతి, విజయవాడ వంటి ఘటనలు మళ్లీ జరగొద్దు - ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం !


అనకాపల్లి జిల్లాలో  ఒక్క కాలనీలోనే 10228 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని జగన్ తెలిపారు. ఒక్కొక్కరికి సెంట్‌ స్థలం ఇస్తున్నామని, ఇక్కడ గజం స్థలం రూ.12 వేలు ఉందని అన్నారు. అంటే స్థలం విలువ అక్షరాల రూ. 6 లక్షలు అని తెలిపారు. ఒక ఇల్లు అంటే మహిళలకు శాశ్వత చిరునామా ఇచ్చినట్లు అవుతుందని అన్నారు. పేదలందరికీ ఇళ్లు ఇచ్చిన తర్వాత ఏపీలో ఇళ్లు లేని నిరుపేదలే ఉండరన్నారు.