CM Jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు (ఏప్రిల్ 29) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు సాయంత్రం సీఎం జగన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. తర్వాతి రోజు అంటే ఏప్రిల్ 30న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించే సమావేశంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. 30న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్ని రాష్ట్రాల సీఎంలు, జడ్జిలతో సమావేశం నిర్వహించనున్నారు.
Jagan Vizag Tour నేడు ఇళ్ల పట్టాలు మంజూరు
మరోవైపు, నేడు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సీఎం జగన్ పర్యటిస్తారు. ఉదయం 9.20కి తాడేపల్లి నుంచి బయలుదేరి 10.40కి అనకాపల్లి జిల్లా సబ్బవరం చేరుకుంటారు. ఉదయం 11.05 గంటలకు వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్ విగ్రహావిష్కరణ, పార్కు ప్రారంభోత్సవం, లే అవుట్లను పరిశీలించనున్నారు. అనంతరం మోడల్ హౌస్‌లను లబ్ధిదారులకు అందజేస్తారు. పైలాన్ ప్రారంభోత్సవం, ల్యాండ్ పూలింగ్ కోసం భూములిచ్చిన రైతులతో ఫోటో సెషన్ ఉంటుంది. తర్వాత ఇళ్ల పట్టాలు, హౌసింగ్ స్కీమ్ మంజూరు పత్రాల పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి 2.25 గంటలకు తిరిగి తాడేపల్లికి సీఎం చేరుకుంటారు.
సాయంత్రం గవర్నర్తో భేటీ CM Jagan Governor Meet
ముఖ్యమంత్రి జగన్ నేడు సాయంత్రం (ఏప్రిల్ 28) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశం కానున్నారు. విశాఖ పర్యటన అనంతరం సాయంత్రం సీఎం రాజ్ భవన్‌కు సీఎం వెళ్తారు. ఇటీవలే గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఢిల్లీ పెద్దల ఆదేశాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది.